🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నరనారాయణ మహర్షులు - 2 🌻
8. ఆర్యుడు విగ్రహాన్ని ఆరాధించనే ఆరాధించడు. విగ్రహాన్ని ఆరాధిస్తున్నారని తెలియనివాళ్ళు అంటారు. అంటే విగ్రహాన్ని పూజచేస్తూ, అంతర్వస్తువును-ఒక దేవతను-సూక్ష్మవస్తువును-హిందువు ధ్యానిస్తాడు. ఆ విగ్రహమందుకూడా అంతర్యామి ఉన్నాడు అని భావన. తనలోపల ఉండే వస్తువును ఆరాధనచేసుకొని తాను అంతర్ముఖుడు కాలేడు.
9. అందుచేత, బయట ఒక సుందరమైన విగ్రహాన్ని కల్పించుకొని ఆ నారాయణుడు అక్కడఉన్నట్లు భావనచేసి, కాని లోపల ఉండే వస్తువే ఫలాన్నిస్తుందని నిశ్చితంగా జ్ఞాపకం చేసుకొని, ఆర్యుడు ఫలాన్ని పొందుతున్నాడు. ‘అది మాకు ప్రతీక(symbol). మాది ప్రతీకోపాసన.
10. అంతరాత్మయై, అందుండేటటువంటి వస్తువుయొక్క ప్రతిబింబం, విగ్రహంలో ఉంది. దీంట్లో ఉండే అంతర్వస్తువు మా లోపల ఉందనే భావంతో ఆరాధన చేస్తాం. అందుకనే మా పూజలు ఫలప్రదమవుతున్నాయి’ అని సమాధానం.
11. నిరంతరమూ ఆప్తకాములై లోకంలో ఉండేటటువంటి మునులు అవిద్య, అజ్ఞానములను జయించినవాళ్ళేకానీ, జ్ఞానవిషయంలో సంపూర్ణత్వము పొందాము అనేటటువంటి అహంకారంలో లేరు వాళ్ళు. వారిని ఈ లోకంలో బాధించగలిగేటటువంటి వస్తువు ఏదీ లేదు.
12. ఏకాంతమంటే ఎవరూలేనిచోటికి పారిపోవడంకాదు. అందరిలో ఉండికూడా ఏకాంతం సంపాదించాలి. అనేకమందిలో ఉండికూడా తనలోతనుండగలగటం ఏకాంతం. కాబట్టి సాధనద్వారా తన స్వరూపమందు తాను సంపాదించుకోగలిగింది ఏకాంతంకానీ; ప్రాంతంలోనూ, దేశంలోనూ, కాలంలోనూ కనపడేది ఏకాంతంకాదు.
బ్రహ్మప్రవృత్తిమార్గాన్ని శాసించేవాడే.
13. ఈ వేదాలు, యజ్ఞాలు అన్నీకూడా బ్రహ్మముఖంలోంచి వచ్చినవే! ఇది ప్రవృత్తియేతప్ప నివృత్తికాదు. జ్ఞానమార్గమిదికాదని ఘంటాపథంగా జ్ఞానులు, పెద్దలు చెబుతున్నారు. సృష్టి ప్రవర్తిల్లి జీవులు శరీరాలుధరించి ఖర్మానుభవాన్నిపొందడం బ్రహ్మ అభిమతం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
No comments:
Post a Comment