✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 14 🌻
మార్గములో సద్గురువు యొక్క దర్శకత్వము ఏల అవసరము?
459. సద్గురువు సహాయము లేకుండా, మార్గములో పయనించువారు, మార్గములో గోచరించెడు తేజోవంతమైన--భ్రాంతి జనకములైన--దుస్తరములైన--వింత దృశ్యములలో చిక్కుకొని వాటి నుండి తప్పించుకొని బయటికి రాలేరు. అట్టి ప్రమాదములకు లోను కాకుండా సద్గురువు కాపాడుచుండును.
460. ఆధ్యాత్మిక మార్గం భౌతిక గోళమునకు, సత్య గోళ మనకు వంతెన వంటిది.
ఆరవ భూమికలో__ సత్పురుషుడు:-- మానవుడు, మానవునిగా భగవంతుని ప్రతి వారిలో ప్రతి దానిలో చూచును. ఇది ఆధ్యాత్మిక పంచభూత లలో రెండవది.
మానవుని ఆధ్యాత్మిక వికాసము
గుణైక్యము:--
ఆరవభూమికలో ఇంకనూ ఆత్మను వదలక పట్టి యున్న భౌతికగోళ సంబంధమైన భౌతిక లక్షణములు సూక్ష్మగోళ సంబంధమైన సూక్ష్మ లక్షణములు కాంతి హీనమైనట్లు పూర్తిగా తొలగిపోయి కరిగిపోవును. మానవుని ఆధ్యాత్మిక వికాసములో ఇది నాలుగవది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
No comments:
Post a Comment