🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 18
🌻. జపలక్షణము - 1 🌻
శ్రీ భగవానువాచ :-
అక్షమాలా విధిం వక్ష్యే - శృణుష్వా నహితో నృప,
సామ్రాజ్యం స్పటికో దద్యా - త్పుత్ర జీవః పరాం శ్రియమ్ 1
ఆత్మ జ్ఞానం కుశ గ్రందీ - రుద్రాక్ష స్సర్వ కామదః,
ప్రవాళైశ్చ కృతా మాలా - సర్వ లోక వశ ప్రదా 2
మోక్ష ప్రదాచ మాలాస్యాం - దామ లక్యా: ఫలై: కృతా,
ముక్తా ఫలై: కృతా మాలా సర్వ విద్యా ప్రదాయినీ 3
మాణిక్య రచితా మాలా - త్రైలోక్య స్య వ శంకరీ,
నీలై ర్మరక తైర్వాపి - కృతా శత్రు భయప్రదా 4
సువర్ణ రచితా మాలా - దద్యా ద్వై మహతీం శ్రియమ్,
తధా రౌప్య మయీ మాలా - కన్యాం యచ్ఛతి కామితామ్ 5
ఉక్తానాం సర్వ కామానాం -దాయినీ పారదై: కృతా,
అష్టోత్తరతం మాలా - తత్ర స్యాద్దుత్త మోత్తమా 6
శత సంఖ్యొత్త మా మాలా - పంచాశ న్మధ్య మామతా,
చతు: పంచాశతీ యద్వా - ప్యధవా సప్త వింశతి: 7
అధవా పంచ వింశత్యా -యది స్యాచ్చత నిర్మితా,
పంచాశ దక్ష రాణ్యత్రా - నులోమ ప్రతిలో మతః 8
ఇత్యేవం స్థాపయే త్స్పష్టం - నకస్త్మే చిత్ప్ర దర్శయేత్,
వర్డై న్యస్తయ యస్తు -క్రియతే మాలాయా జపః 9
ఏక వారేణ తస్యైవ - పురశ్చర్యా కృతా భవేత్,
సవ్య పాణిం గుడే సాప్య - దక్షిణం చ ద్వజో పరి 10
శ్రీ పరమేశ్వరుడా దేశించు చున్నాడు:
అక్ష (రుద్రాక్ష ) మాలా విధిని బోధించెదను. వినుము:
స్పటిక మాలతో జపించిన సామ్రాజ్యము నొసగును. పుత్ర జీవనము సంపద నొసగును. కుశ గ్రంధి యాత్మ జ్ఞాన మొసగును.
రుద్రాక్ష సమస్త కోరికలను ఫలింప చేయును. పగడాల మాల లోకమునే వశ మొనర్చును. ఉసిరక పండ్ల మాల మోక్ష మొసగును. ముత్యాల మాల సమస్త లోకమునే వశము గావించును. నీల మణుల చేతను, మరకత మణులతోను చేయబడిన మాల సమస్త విద్యల నొసగును.
మాణిక్య మాల సమస్త లోకమునే వశము గావించును . నీల మణుల చేతను మరకత మణులతోను చేయబడిన మాల శత్రు భయంకర మైనది. బంగారపు గుండ్ల మాల గొప్ప సంపద నొసగును. వెండి గుండ్లతో చేయబడిన మాల కోరబడిన కన్య నొసగును.
పైన పేర్కొన్న సమస్త కోరికలను ఫలింప చేయునది. పాదరసపు గుండ్లతో చేయబడిన మాల. ఇది యుత్తమోత్తమమైనది. నూరు సంఖ్య గల మాల శ్రేష్ఠ మైనది. ఏబది సంఖ్య గల మాల మధ్యమము లేదా యేబది నాలుగు గలదైనను సరియైనదే.
కనీసము ఇరువది యేడు సంఖ్య గల మాలిక యైనను మేన యుండవలెను. ఇరువది యైదింటి చే చేయబడిన మాల అధమ మైనది.
ఒకప్పుడు నూరు సంఖ్య చేత చేయ బడిన మాలైన యెడల "ఆకారాది " క్షకారాంత ముగా జపించి పిదప "ళ " కారమును మేరువుగా చేసికొని అను లోమ ప్రతి లోమముల చేత వర్ణముల మాలికను స్థాపించ వలెను.
జపమాలను ఎవ్వరికిని చూప కూడదు. వర్ణములతో చేసిన మాలతో నెవ్వడు జపించునో వాడికొకేసారి జపముతో పురశ్చరణ పూర్తి ఫలము లభించును.
మరియు ఎడమ హస్తమును గుదమందును, కుడి హస్తము శిశ్నము పై నుంచుట యోని ముద్ర యనబడును. ఇది శ్రేష్టమైన ఆసన మనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 127 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 18
🌻 Japa Lakshanam - 1🌻
Sri Bhagawan said:
I would explain you the process of using Rudraksha beaded rosary.
Listen!
If one does Japa using Sphatika Mala (rosary of crystals), I give him samrajyam (kingdom), son, long life and wealth. Grass beads rosary gives Atmanjnanam (knowledge of atman). Rudraksha bead rosary fulfils all wishes.
Rosary of Pravala beads (red colored gems), makes the entire world conquered under the devotee's power. Rosary made from Amla fruits gives Moksham.
A rosary of pearls bestows all kinds of knowledge. Rosary of manikya gems makes entire world under his control. Blue gems and by Marakata gems when rosary is prepared when chanted using that it frees one from all fears of enemies.
A rosary of golden beads gives immense wealth when chanted using that. A rosary of silver beads when used for chanting the devotee gets the girl he loves for himself. And a rosary made of mercury beads gives all the aforementioned results combined together. This rosary is best of the best one.
A rosary of 100 beads is best, of 50 beads is better, or even if 54 beads are there that is also fine. At least the rosary should have minimum 27 beads. A rosary of 25 beads is the lowest and is not preferable.
If the 100 beads rosary is used, one should chant AkaradiKShakarantam
(from a to z), and at the "La" syllable one should make it as lightning, by following Anuloma Pratiloma methods should establish a rosary of alphabets/varnas (Varnamala).
The rosary used for japa should never be shown to anyone. One who does Japa using the rosary made of varnas (Varnamala) he gains all the merits of Purascharana purti at once in one shot itself.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
No comments:
Post a Comment