శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 47 / Sri Devi Mahatyam - Durga Saptasati - 47
🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 47 / Sri Devi Mahatyam - Durga Saptasati - 47 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 13
🌻. "సురథ వైశ్యవరప్రదానము” -1 🌻
1-2. ఋషి పలికెను : ఓ రాజా! దేవి యొక్క ఈ శ్రేష్ఠమైన మాహాత్మ్యాన్ని నేను నీ కిప్పుడు తెలిపాను.
3. దేవి అట్టి ప్రభావ సంపన్నురాలు. ఈ జగత్తును భరించేది ఆమెయే. అలాగే విద్ (జ్ఞానం)ను ఇచ్చేది భగవంతుడైన విష్ణుదేవుని మాయ అయిన ఆమెయే.
4. ఆమెచేత నీవు, ఈ వైశ్యుడు, వివేకవంతులైన ఇతరులు అజ్ఞానంలో పడుతున్నారు. ఇతరులు కూడా (పూర్వం) పడ్డారు, (ఇక పై కూడా) పడతారు.
5. ఓ మహారాజా! ఆ పరమేశ్వరి వద్ద శరణు పొందు. తనను పూజించే వారికి ఆమెయే భోగాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
6-8. మార్కండేయుడు తన శిష్యుడైన భాగురితో పలికెను: ఓ మహామునీ! అత్యంత మమకారం వల్ల, రాజ్యభ్రంశం వల్ల ఖిన్నులైన ఆ వైశ్యుడు, ఆ సురథనరపాలుడు ఆ పలుకులు విని తీక్ష్మవ్రత తత్పరునిగా పేరుగాంచిన ఆ ఋషికి ప్రణమిల్లి తపమొనర్చడానికి వెంటనే వెళ్ళారు.
9. అంబా సందర్శనార్ధులై ఆ వైశ్యుడు, రాజు ఒక నది ఇసుకదిబ్బపై కూర్చొని శ్రేష్ఠమైన దేవీ సూక్తాన్ని జపిస్తూ తపమొనర్చారు.
10. మట్టితో దేవీ విగ్రహం ఒకటి చేసి వారిరువురూ ఆ ఇసుక దిబ్బపై పూవులతో, ధూపంతో, అగ్నితో, జలతర్పణతో ఆమెను అర్చించారు.
11. ఆహారం తీసికోకుండా, స్వల్పాహారం తీసుకుంటూ, మనస్సులను ఆమెపైనే నిలిపి, ఏకాగ్రబుద్ధితో వారిరువురూ తమ శరీర రక్త బిందువులతో తడిసిన బలులను సమర్పించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 47 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 13
🌻 The bestowing of boons to Suratha and Vaisya - 1 🌻
The Rishi said:
1-2. I have now narrated to you, O King, this sublime poem on the glory of the Devi.
3. The Devi is endowed with such majestic power. By her this world is upheld. Knowledge is similarly conferred by her, the illusive power of Bhagavan Vishnu.
4. By her, you, this merchant and other men of discrimination, are being deluded; and others were deluded (in the past), and will be deluded (in the future).
5. O great King, take refuge in her, the supreme Isvari. She indeed when worshipped bestows on men enjoyment, heaven and final release (from transmigration). Markandeya said (to his disciple Bhaguri):
6-8. O great sage, King Suratha who had become despondent consequent on his excessive attachment and the deprivation of his kingdom, and the merchant, having heard this speech prostrated before the illustrious Rishi of sever penances and immediately repaired to perform austerities.
9. Both king and the merchant, in order to obtain a vision of Amba, stationed themselves on the sand-bank of a river and practised penances, chanting the supreme Devi-sukta (hymn to the Devi).
10. Having made an earthen image of the Devi on the sands of the river, they both worshipped her with flowers, incense, fire and libation of water.
11. Now abstaining from food, and now restraining in their food, with their minds on thee and with concentration, they both offered sacrifices sprinkled with blood drawn from their own bodies.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment