2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 134 135 / Vishnu Sahasranama Contemplation - 134, 135🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 47 / Sri Devi Mahatyam - Durga Saptasati - 47🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 115🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 136 🌹
6) 🌹. శివగీత - 125 / The Siva-Gita - 126🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 62🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 115, 116 / Sri Lalita Chaitanya Vijnanam - 115, 116🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473🌹
10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 85 📚
11) 🌹. శివ మహా పురాణము - 283🌹
12) 🌹 Light On The Path - 38🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 170🌹
14) 🌹 Seeds Of Consciousness - 234 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 109🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 73 / Sri Vishnu Sahasranama - 73 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 562 / Bhagavad-Gita - 562 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 05 🌴*
05. ఆశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనా: |
దమ్భాహంకారసంయుక్తా: కామరాగబలాన్వితా: ||
06. కర్షయన్త: శరీరస్థం భూతగ్రామమచేతస: |
మాం చైవాన్త:శరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||
🌷. తాత్పర్యం :
శాస్త్రవిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఒనరించువారును, కామరాగములచే ప్రేరేపింపబడినవారును, అచేతసులై దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అగువారలు అసురులుగా తెలియబడుదురు.
🌷. భాష్యము :
శాస్త్రములందు తెలియజేయనటువంటి తపస్సులను, నిష్ఠలను సృష్టించువారు పెక్కురు కలరు. ఉదాహరణకు న్యునమైనటువంటి రాజకీయ ప్రయోజనార్థమై ఒనరించు ఉపవాసములు శాస్త్రమునందు తెలుపబడలేదు.
ఉపవాసమనునది సాంఘిక, రాజకీయ ప్రయోజనముల కొరకు గాక ఆద్యాత్మికోన్నతి కొరకే శాస్త్రమునందు ఉపదేశింపబడినది. భగవద్గీత ననుసరించి అట్టి తపస్సుల నొనరించినవారు నిక్కముగా ఆసురస్వభావము కలవారే.
అట్టివారి కర్మలు సదా అశాస్త్రవిహితములై, జనులకు హితకరములు కాకుండును. వాస్తవమునకు వారు ఆ కార్యములను గర్వము, మిథ్యాహంకారము, కామము, ఇంద్రియభోగముల యెడ ఆసక్తితోనే ఆచరింతురు. అట్టి కార్యముల వలన దేహము నేర్పరచెడి పంచభూతములేగాక, దేహమునందుండెడి పరమాత్మయు కలతనొందుదురు.
అంతియేగాక రాజకీయ ప్రయోజనార్థమై ఒనరింపబడెడి అట్టి తపస్సు లేదా ఉపావసములు ఇతరులను సైతము నిక్కముగా కలత నొందించును. అట్టి తపస్సులు వేదవాజ్మయమున తెలుపబడలేదు. అసురప్రవృత్తి గలవారు ఆ విధానము ద్వారా శత్రువుని గాని, ఎదుటి పక్షమును గాని బలవంతముగా తమ కోరికకు లొంగునట్లుగా చేసికొందుమని తలచుచుందురు.
కొన్నిమార్లు అట్టి తపస్సు ద్వారా మరణము సైతము సంభవించుచుండును. ఈ కార్యములను శ్రీకృష్ణభగవానుడు ఆమోదించుట లేదు. ఆ కార్యములందు నియుక్తులైనవారు దానవులని అతడు వర్ణించినాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 562 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 05 🌴*
05. aśāstra-vihitaṁ ghoraṁ
tapyante ye tapo janāḥ
dambhāhaṅkāra-saṁyuktāḥ
kāma-rāga-balānvitāḥ
06. karṣayantaḥ śarīra-sthaṁ
bhūta-grāmam acetasaḥ
māṁ caivāntaḥ śarīra-sthaṁ
tān viddhy āsura-niścayān
🌷 Translation :
Those who undergo severe austerities and penances not recommended in the scriptures, performing them out of pride and egoism, who are impelled by lust and attachment, who are foolish and who torture the material elements of the body as well as the Supersoul dwelling within, are to be known as demons.
🌹 Purport :
There are persons who manufacture modes of austerity and penance which are not mentioned in the scriptural injunctions. For instance, fasting for some ulterior purpose, such as to promote a purely political end, is not mentioned in the scriptural directions.
The scriptures recommend fasting for spiritual advancement, not for some political end or social purpose. Persons who take to such austerities are, according to Bhagavad-gītā, certainly demoniac. Their acts are against the scriptural injunctions and are not beneficial for the people in general. Actually, they act out of pride, false ego, lust and attachment for material enjoyment.
By such activities, not only is the combination of material elements of which the body is constructed disturbed, but also the Supreme Personality of Godhead Himself living within the body. Such unauthorized fasting or austerities for some political end are certainly very disturbing to others. They are not mentioned in the Vedic literature.
A demoniac person may think that he can force his enemy or other parties to comply with his desire by this method, but sometimes one dies by such fasting. These acts are not approved by the Supreme Personality of Godhead, and He says that those who engage in them are demons.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 134, 135 / Vishnu Sahasranama Contemplation - 134, 134 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻134. సురాధ్యక్షః, सुराध्यक्षः, Surādhyakṣaḥ🌻*
*ఓం సురాధ్యక్షాయ నమః | ॐ सुराध्यक्षाय नमः | OM Surādhyakṣāya namaḥ*
సురాణాం అధ్యక్షః సురలకు అధ్యక్షుడు. ప్రపంచముయొక్క నిర్వహణను చూచెడి ఇంద్ర, అగ్ని, వాయు, వరుణాది దేవతల యోగక్షేమములను విచారించుచుండువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 134🌹*
📚. Prasad Bharadwaj
*🌻134. Surādhyakṣaḥ🌻*
*OM Surādhyakṣāya namaḥ*
Surāṇāṃ adhyakṣaḥ / सुराणां अध्यक्षः He is the presiding Lord of the gods like Indra, Agni, Vāyu, Varuṇa etc., who hold sway over the worlds.
OM Vedavide namaḥ*
Viṃte vicārayati yo vedaṃ vedaviducyate / विंते विचारयति यो वेदं वेदविदुच्यते He inquires into the Vedas.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥
లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥
Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 135 / Vishnu Sahasranama Contemplation - 135 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻135. ధర్మాధ్యక్షః, धर्माध्यक्षः, Dharmādhyakṣaḥ🌻*
*ఓం ధర్మాధ్యక్షాయ నమః | ॐ धर्माध्यक्षाय नमः | OM Dharmādhyakṣāya namaḥ*
శ్లోకమున 'సురాధ్యక్షో ధర్మాధ్యక్షః' అనుచోట ధర్మాధ్యక్షః అధర్మాధ్యక్షః అని రెండు విధములుగను విభాగము చేయవచ్చును కనుక ధర్మస్య అధర్మస్య చ అధ్యక్షః అనగా ధర్మమును అధర్మమును కూడ సాక్షాత్తుగా చూచుచు వారికి వానికి తగిన విధమగు ఫలమును ఇచ్చుచుండును అని వివరించబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 135🌹*
📚. Prasad Bharadwaj
*🌻135. Dharmādhyakṣaḥ🌻*
*OM Dharmādhyakṣāya namaḥ*
Since the combination 'Surādhyakṣo Dharmādhyakṣaḥ' leads to interpretation for the divine name Dharmādhyakṣaḥ as Dharmādhyakṣaḥ as well as Adharmādhyakṣaḥ, Dharmasya adharmasya ca adhyakṣaḥ explains the same as that He cognises dharma i.e., righteousness and adharma, the opposite of dharma, directly to give their appropriate rewards.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥
లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥
Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 47 / Sri Devi Mahatyam - Durga Saptasati - 47 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 13*
*🌻. "సురథ వైశ్యవరప్రదానము” -1 🌻*
1-2. ఋషి పలికెను : ఓ రాజా! దేవి యొక్క ఈ శ్రేష్ఠమైన మాహాత్మ్యాన్ని నేను నీ కిప్పుడు తెలిపాను.
3. దేవి అట్టి ప్రభావ సంపన్నురాలు. ఈ జగత్తును భరించేది ఆమెయే. అలాగే విద్ (జ్ఞానం)ను ఇచ్చేది భగవంతుడైన విష్ణుదేవుని మాయ అయిన ఆమెయే.
4. ఆమెచేత నీవు, ఈ వైశ్యుడు, వివేకవంతులైన ఇతరులు అజ్ఞానంలో పడుతున్నారు. ఇతరులు కూడా (పూర్వం) పడ్డారు, (ఇక పై కూడా) పడతారు.
5. ఓ మహారాజా! ఆ పరమేశ్వరి వద్ద శరణు పొందు. తనను పూజించే వారికి ఆమెయే భోగాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
6-8. మార్కండేయుడు తన శిష్యుడైన భాగురితో పలికెను: ఓ మహామునీ! అత్యంత మమకారం వల్ల, రాజ్యభ్రంశం వల్ల ఖిన్నులైన ఆ వైశ్యుడు, ఆ సురథనరపాలుడు ఆ పలుకులు విని తీక్ష్మవ్రత తత్పరునిగా పేరుగాంచిన ఆ ఋషికి ప్రణమిల్లి తపమొనర్చడానికి వెంటనే వెళ్ళారు.
9. అంబా సందర్శనార్ధులై ఆ వైశ్యుడు, రాజు ఒక నది ఇసుకదిబ్బపై కూర్చొని శ్రేష్ఠమైన దేవీ సూక్తాన్ని జపిస్తూ తపమొనర్చారు.
10. మట్టితో దేవీ విగ్రహం ఒకటి చేసి వారిరువురూ ఆ ఇసుక దిబ్బపై పూవులతో, ధూపంతో, అగ్నితో, జలతర్పణతో ఆమెను అర్చించారు.
11. ఆహారం తీసికోకుండా, స్వల్పాహారం తీసుకుంటూ, మనస్సులను ఆమెపైనే నిలిపి, ఏకాగ్రబుద్ధితో వారిరువురూ తమ శరీర రక్త బిందువులతో తడిసిన బలులను సమర్పించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 47 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
*CHAPTER 13*
*🌻 The bestowing of boons to Suratha and Vaisya - 1 🌻*
The Rishi said:
1-2. I have now narrated to you, O King, this sublime poem on the glory of the Devi.
3. The Devi is endowed with such majestic power. By her this world is upheld. Knowledge is similarly conferred by her, the illusive power of Bhagavan Vishnu.
4. By her, you, this merchant and other men of discrimination, are being deluded; and others were deluded (in the past), and will be deluded (in the future).
5. O great King, take refuge in her, the supreme Isvari. She indeed when worshipped bestows on men enjoyment, heaven and final release (from transmigration). Markandeya said (to his disciple Bhaguri):
6-8. O great sage, King Suratha who had become despondent consequent on his excessive attachment and the deprivation of his kingdom, and the merchant, having heard this speech prostrated before the illustrious Rishi of sever penances and immediately repaired to perform austerities.
9. Both king and the merchant, in order to obtain a vision of Amba, stationed themselves on the sand-bank of a river and practised penances, chanting the supreme Devi-sukta (hymn to the Devi).
10. Having made an earthen image of the Devi on the sands of the river, they both worshipped her with flowers, incense, fire and libation of water.
11. Now abstaining from food, and now restraining in their food, with their minds on thee and with concentration, they both offered sacrifices sprinkled with blood drawn from their own bodies.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 115 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -45 🌻*
ఎందుకని అంటే, మిగిలిన వాని యొక్క ప్రభావము చైతన్యము మీద లేకుండా, ముద్రితము కాకుండా, ప్రారబ్ద కర్మ విశేషము అనుభవించబడి, ఆగామి కర్మగా మారకుండా, కొత్త సంస్కారాలు తయారవ్వకుండా, కొత్తవాసనలు తయారవ్వకుండా, కొత్త స్మృతి బలం ఏర్పడకుండా, అనేక జన్మార్జిత విశేషములంతా కూడా కర్మ బంధ రూపములో ఉన్నదానిని అధిగమించి, సాక్షీ భూతుడై, ఆ కర్మబంధానికి అతీతుడై, త్రిపుటికి అతీతుడై, జీవించ వలసినటువంటి లక్ష్యాన్ని తాను స్వీకరించి, నిరంతరాయంగా ఆ పనిలో ఉండాలి.
ఏమండీ, పొద్దున నుంచీ రాత్రి వరకూ మీరు ఖాళీగానే ఉన్నారు కదండీ! అని అంటారే అనుకోండి, నేను చాలా బిజీగా వుంటానండీ! ఏమి చేస్తుంటారండీ? మీరేమీ కరచరణాద్యవయవములతో మీరేమీ కదిలించినట్లు కనబడలేదు, ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి పనులు చేసినట్లు కనబడలేదు, ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి ఫలితాలు కూడా వచ్చినట్లు కనపడలేదే? అని అంటే, అంతకంటే పెద్ద పనిలో ఉన్నానండీ! అని అంటారు.
ఏమిటది అంటే, సూక్ష్మశరీరాన్ని బాగు చేసే పనిలో ఉన్నాడు. కారణశరీరాన్ని గుర్తించే పనిలో ఉన్నాడు. మహా కారణ శరీరాన్ని గుర్తించే పనిలో ఉన్నాడు. మహాకారణ స్థితిలో నిలకడ చెంది, సూక్ష్మ కారణ శరీరాల్ని రద్దు పరుచుకునే పనిలో ఉన్నాడు. శరీరత్రయ సాక్షిత్వాన్ని సంపాదించే పనిలో ఉన్నా డు.శరీర త్రయం విలక్షణత్వాన్ని సంపాదించే పనిలో ఉన్నా డు. పంచకోశ నిరసన చేసే పనిలో ఉన్నాడు.
కాబట్టి, ఇంతకంటే పెద్ద పని ఏమున్నదయ్యా? అంటే, ఇంతకంటే పెద్దపని ఏమీ లేదు. అన్నిటికంటే పెద్ద పని ఈ పని. కానీ మనం ఏం చేస్తున్నామంటరోజువారీ జీవితంలో. ఆయా గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియాలను వెనక్కు తీసుకోవడమే సాధన. మనస్సును విరమింపచేయటమే సాధన.
అంతరముగా నున్నటువంటి మనస్సు లోపలికి, గోళకాలని, ఇంద్రియాలని, తన్మాత్రలని వెనక్కి విరమించి, అందులోకి చేర్చాలి. అట్లా చేర్చిన తరువాత, మనస్సును దాని స్వస్థానమైనటువంటి, బుద్ధి యందు చేర్చాలి. ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖంగా వెళ్ళకుండా ఉంటుందో, దానికి సహజమైనటువంటి గతి, పరిణామశీలత ప్రయాణం తప్పక అంతర్ముఖంలోకి ప్రయాణిస్తుంది. ఇట్టి అంతర్ముఖ ప్రయాణం కలిగినటువంటి మానవుడే సరియైనటువంటి మానవుడు.
నిజ మానవుడు అనటానికి అర్హమైనవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే, ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తి కలిగి, ఎవరైతే యమనియమాది అష్టాంగ యోగ విధిని ఎఱిగి, ఎవరైతే విషయవ్యావృత్తి లేకుండా, ఎవరైతే బహిర్ముఖత్వం లేకుండా, ప్రవృత్తి మార్గంలో ప్రవేశించకుండా, నివృత్తి యందు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సాంఖ్య విజ్ఞానాన్ని కరతలామలకంగా తెలుసుకొన్నటువంటి వారు. స్వాధ్యాయం చేయుదురు. ఏకాగ్రంగా చిత్తాన్ని నిలబెట్టుకోగలిగే వాళ్ళు.
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అత్యంత విలువైనది ఆత్మస్వరూపము. అత్యంత విలువైన ఆత్మస్వరూపాన్ని సూక్ష్మంగా పట్టుకోవాలే కానీ, దానిని స్థూలంగా వస్తురూపంగా చూపెట్టటం సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. అధవా నువ్వు వస్తురూపంగానే నేను గ్రహిస్తాను అంటే, సమస్త వస్తుజాలము ఆత్మయందు అంశీభూతములే! అనేటటువంటి ఒకే ఒక నిర్ణయ వాక్యం మాత్రమే పనికి వస్తుంది.
ఓ గిన్నెలాగా, ఓ బిందెలాగా, ఒక ఇల్లులాగా, ఒక శరీరంలాగా, ఒక ఇంద్రియంలాగా, ఒక గోళకం లాగా, ఒక తినే పదార్థంలాగా చూపెట్టాలి అంటే, ఆ రకమైనటువంటి పరిమితమైనటువంటి స్థితిగా ఉండేది కాదు. సర్వ వ్యాపకమైనటువంటిది, సర్వకాలములందు, సర్వత్రా సాక్షీభూతమైనటువంటి ఏదైతే స్థితి ఉన్నదో, ఆ స్థితికి ఆత్మ అని పేరు.
కాబట్టి, ఆత్మ వస్తువు లేకుండా, అసలు దేనికీ ఉనికే లేదు. ఈ సృష్టి, ఈ విశ్వం మొత్తం మీద, దేనికైనా ఒక దానికి ‘ఉండుట’ అనేటటువంటి స్థితి అంటూ ఉన్నదంటే, అది దేనివలన ఉన్నదయ్యా? అంటే ఆత్మ వలననే ఉన్నది. కాబట్టి, దేనికైనా ‘ఉండుట’ అనేటటువంటి స్థితిని అనుగ్రహింప గలిగేటటువంటి సమర్థవంతమైనటువంటిది ఆత్మ.
సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రములున్నవి. పంచభూతములు ఉన్నవి. జీవరాశి ఉన్నది, వృక్షరాశి ఉన్నది. ఇలా ఈ వ్యాపకమైనటువంటి జగత్తునిండా ఎన్నైతే ఉన్నవి, ఉన్నవి, ఉన్నవి... అంటున్నావో అవన్నీ ఉన్నవి అంటున్నటువంటి స్థితికి సర్వాధారమైనటువంటిది ‘ఆత్మ’.
ఆ సర్వాధారమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే, మార్గమేది? తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి మనోబుద్ధులను బహిర్ముఖముగా పోనివ్వక, అంతర్ముఖము వైపు త్రిప్పి, వాటిని తమ స్వస్థానమైనటువంటి, మహతత్త్వము, అవ్యక్తమును దాటించి, ప్రత్యగాత్మ స్థితి యందు నిలకడ కలిగేటట్లు చేయుట. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 136 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
128
Sloka:
Gacchatah prsthato gacchet gurupadau na langhayet | Nolbanam dharayedvesam nalankaram statholbanam
While guru is walking, you must only follow him. You must never overtake him or walk ahead of him.
You must never be dressed ostentatiously, wear showy jewelry or use elaborate cosmetics and ornamentation in the presence of guru. Devotees who do it out of ignorance are forgiven, but not disciples.
Who are devotees? Who are disciples? What is the difference? Those who merely come for darshan and leave are devotees. Those who come frequently to see guru, listen to his words of wisdom, offer him gifts and services off and on, and lead their family lives as per the advice given by guru are disciples.
Once the relationship is established as that of guru and disciple, certain rules must be followed.
Sloka:
Guru ninda param drsthva dhavaye datha varayet sthanam va tatparityajyam jihvacchedo ksama yadi
If anyone is blaming guru, such persons must be chased out, or else prevented from speaking ill of guru. You must contradict them, argue with them and must convince them that they are completely wrong. If none of these are possible, leave the spot at once and go far away, saying, “You do not leave. You do not stop talking. I cannot argue with you and convince you. Hence, I leave your presence”.
But to listen to verbal abuse of guru and to tolerate it, thinking that whatever the other person says is his own business, is a terrible sin. The only atonement for it is to cut out the tongue.
What is the harm in tolerating such speech? One word or argument amongst those ten arguments he gives may cause the disciple to begin entertaining doubts about his guru.
Suspicion may arise that may be there is some truth in his words. Cut out your own tongue or cut out his tongue. It does not mean taking a knife and actually cutting off the tongue and going to the hospital. You would have to then get stitches or you would have to get a replacement tongue from some animal, like a dog, or get a wooden replacement tongue.
What it means that you should endlessly speak until the opponent is either convinced that you are right, or runs away, unable to take the force of your arguments. He should simply run away and leave your friendship. That is the meaning of cutting their tongue. Shut them up completely. It is not as easy as taking a pair of scissors and chopping off your tongue and getting stitches.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 127 / The Siva-Gita - 127 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 18
*🌻. జపలక్షణము - 1 🌻*
శ్రీ భగవానువాచ :-
అక్షమాలా విధిం వక్ష్యే - శృణుష్వా నహితో నృప,
సామ్రాజ్యం స్పటికో దద్యా - త్పుత్ర జీవః పరాం శ్రియమ్ 1
ఆత్మ జ్ఞానం కుశ గ్రందీ - రుద్రాక్ష స్సర్వ కామదః,
ప్రవాళైశ్చ కృతా మాలా - సర్వ లోక వశ ప్రదా 2
మోక్ష ప్రదాచ మాలాస్యాం - దామ లక్యా: ఫలై: కృతా,
ముక్తా ఫలై: కృతా మాలా సర్వ విద్యా ప్రదాయినీ 3
మాణిక్య రచితా మాలా - త్రైలోక్య స్య వ శంకరీ,
నీలై ర్మరక తైర్వాపి - కృతా శత్రు భయప్రదా 4
సువర్ణ రచితా మాలా - దద్యా ద్వై మహతీం శ్రియమ్,
తధా రౌప్య మయీ మాలా - కన్యాం యచ్ఛతి కామితామ్ 5
ఉక్తానాం సర్వ కామానాం -దాయినీ పారదై: కృతా,
అష్టోత్తరతం మాలా - తత్ర స్యాద్దుత్త మోత్తమా 6
శత సంఖ్యొత్త మా మాలా - పంచాశ న్మధ్య మామతా,
చతు: పంచాశతీ యద్వా - ప్యధవా సప్త వింశతి: 7
అధవా పంచ వింశత్యా -యది స్యాచ్చత నిర్మితా,
పంచాశ దక్ష రాణ్యత్రా - నులోమ ప్రతిలో మతః 8
ఇత్యేవం స్థాపయే త్స్పష్టం - నకస్త్మే చిత్ప్ర దర్శయేత్,
వర్డై న్యస్తయ యస్తు -క్రియతే మాలాయా జపః 9
ఏక వారేణ తస్యైవ - పురశ్చర్యా కృతా భవేత్,
సవ్య పాణిం గుడే సాప్య - దక్షిణం చ ద్వజో పరి 10
శ్రీ పరమేశ్వరుడా దేశించు చున్నాడు:
అక్ష (రుద్రాక్ష ) మాలా విధిని బోధించెదను. వినుము:
స్పటిక మాలతో జపించిన సామ్రాజ్యము నొసగును. పుత్ర జీవనము సంపద నొసగును. కుశ గ్రంధి యాత్మ జ్ఞాన మొసగును.
రుద్రాక్ష సమస్త కోరికలను ఫలింప చేయును. పగడాల మాల లోకమునే వశ మొనర్చును. ఉసిరక పండ్ల మాల మోక్ష మొసగును. ముత్యాల మాల సమస్త లోకమునే వశము గావించును. నీల మణుల చేతను, మరకత మణులతోను చేయబడిన మాల సమస్త విద్యల నొసగును.
మాణిక్య మాల సమస్త లోకమునే వశము గావించును . నీల మణుల చేతను మరకత మణులతోను చేయబడిన మాల శత్రు భయంకర మైనది. బంగారపు గుండ్ల మాల గొప్ప సంపద నొసగును. వెండి గుండ్లతో చేయబడిన మాల కోరబడిన కన్య నొసగును.
పైన పేర్కొన్న సమస్త కోరికలను ఫలింప చేయునది. పాదరసపు గుండ్లతో చేయబడిన మాల. ఇది యుత్తమోత్తమమైనది. నూరు సంఖ్య గల మాల శ్రేష్ఠ మైనది. ఏబది సంఖ్య గల మాల మధ్యమము లేదా యేబది నాలుగు గలదైనను సరియైనదే.
కనీసము ఇరువది యేడు సంఖ్య గల మాలిక యైనను మేన యుండవలెను. ఇరువది యైదింటి చే చేయబడిన మాల అధమ మైనది.
ఒకప్పుడు నూరు సంఖ్య చేత చేయ బడిన మాలైన యెడల "ఆకారాది " క్షకారాంత ముగా జపించి పిదప "ళ " కారమును మేరువుగా చేసికొని అను లోమ ప్రతి లోమముల చేత వర్ణముల మాలికను స్థాపించ వలెను.
జపమాలను ఎవ్వరికిని చూప కూడదు. వర్ణములతో చేసిన మాలతో నెవ్వడు జపించునో వాడికొకేసారి జపముతో పురశ్చరణ పూర్తి ఫలము లభించును.
మరియు ఎడమ హస్తమును గుదమందును, కుడి హస్తము శిశ్నము పై నుంచుట యోని ముద్ర యనబడును. ఇది శ్రేష్టమైన ఆసన మనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 127 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 18
*🌻 Japa Lakshanam - 1🌻*
Sri Bhagawan said:
I would explain you the process of using Rudraksha beaded rosary.
Listen!
If one does Japa using Sphatika Mala (rosary of crystals), I give him samrajyam (kingdom), son, long life and wealth. Grass beads rosary gives Atmanjnanam (knowledge of atman). Rudraksha bead rosary fulfils all wishes.
Rosary of Pravala beads (red colored gems), makes the entire world conquered under the devotee's power. Rosary made from Amla fruits gives Moksham.
A rosary of pearls bestows all kinds of knowledge. Rosary of manikya gems makes entire world under his control. Blue gems and by Marakata gems when rosary is prepared when chanted using that it frees one from all fears of enemies.
A rosary of golden beads gives immense wealth when chanted using that. A rosary of silver beads when used for chanting the devotee gets the girl he loves for himself. And a rosary made of mercury beads gives all the aforementioned results combined together. This rosary is best of the best one.
A rosary of 100 beads is best, of 50 beads is better, or even if 54 beads are there that is also fine. At least the rosary should have minimum 27 beads. A rosary of 25 beads is the lowest and is not preferable.
If the 100 beads rosary is used, one should chant AkaradiKShakarantam
(from a to z), and at the "La" syllable one should make it as lightning, by following Anuloma Pratiloma methods should establish a rosary of alphabets/varnas (Varnamala).
The rosary used for japa should never be shown to anyone. One who does Japa using the rosary made of varnas (Varnamala) he gains all the merits of Purascharana purti at once in one shot itself.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 62 / Sri Lalitha Sahasra Nama Stotram - 62 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 115, 116 / Sri Lalitha Chaitanya Vijnanam - 115, 116 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |*
*భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖*
*🌻115. 'భద్రప్రియా'🌻*
మంగళమగు విషయములయందు ప్రియము కలది శ్రీలలిత. భద్ర మనగా మంగళము. పవిత్రత గల వస్తువు లన్నియూ మంగళ ప్రదములే. పసుపు, కుంకుమ, గంధము, ఇతర సుగంధ ద్రవ్యములు, కళ, కాంతి, అందము గల వస్తువులు శ్రీలలితకు ప్రియము కలిగించగలవు. ఇవి అన్నియూ లక్ష్మీ ప్రదములు. వాని యందు ఆమె ప్రియముగా వసించి యుండును.
ఈ కారణముగనే, శ్రీదేవిని పూజించుటకు పసుపు, కుంకుమ, సుగంధము, సుపుష్పములు (మంచి వాసన గల పువ్వులు; సువాసన లేని పువ్వులతో పూజింపరాదు) అగరు వత్తులు, నేతి దీపములు, ఘుమఘుమలాడు వంటకములు, పట్టు వస్త్రములు, బంగారు నగలు, ఆభరణములు, రత్నములు ఆదిగాగల కాంతివంతమైన వస్తువులు శ్రీ లలితాదేవి పూజా సమయమున వాడుదురు.
ఖనిజములయందు, వృక్షజాతియందు, జంతువులయందు, మానవులయందు, శ్రీ లలితకు ప్రియమగునవి చాల కలవు. వాని వినియోగము ఆమెకు ప్రియము కలిగించగలదు. ఎచ్చట పవిత్రత యుండునో అచ్చట శోభ యుండును. శోభ అంతయూ శ్రీదేవి అస్తిత్వము.
ఏనుగులలో భద్రజాతి ఏనుగులని కలవు. ఈ ఏనుగులన్న శ్రీదేవికి అత్యంత ప్రీతి. దేవాలయములందు ఈ జాతి ఏనుగులను
పోషించుట అను సంప్రదాయము ఈ కారణముగనే ఏర్పడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 115 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Bhadrapriyā भद्रप्रिया (115) 🌻*
She likes the act of benefaction. She is keen to shower Her blessings on Her devotees. Devotees are those who try to attain Her by any of the means discussed earlier. The act of benefaction is done by Her sacred feet.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 116 / Sri Lalitha Chaitanya Vijnanam - 116 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |*
*భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖*
*🌻116. 'భద్రమూర్తి🌻*
మంగళప్రదమైన రూపము కలది. శ్రీలలిత రూపము అత్యంత మంగళకరమైనది. అందము అతిశయించు రూపమది. జగత్తునే మోహింపజేయు రూపము.
అట్టి దిట్టిదని వర్ణింపరానిది. నఖశిఖ పర్యంతము అత్యంత మాధుర్యమును వర్షింపజేయు రూపము. మొదటి యాభైనాలుగు నామములు ఆమె రూపమును కీర్తించినవిగా ఈ సహస్రనామమున యున్నవి.
ఈ నామములను చక్కగ ఉచ్చరించుచు, ఆమె రూపమును దర్శించు వారికి సర్వము మంగళప్రదమై నిలచును. ఆమె సర్వమంగళ, నిరాకారయైనను, నిరుపమానమైన సుందరాకారమున దర్శనమిచ్చి అనుగ్రహంపగలదు.
దేవతారూపము హృదయమున ప్రతిష్ఠించుకొని అంతర్ముఖమున ఆరాధించుట సర్వసౌభాగ్యములకు మూలమై యున్నది.
హృదయ పీఠమున దివ్యకాంతులతో కూడిన రూపము స్థిరపడి ఆరాధింప బడినపుడు ఆరాధనకు బుద్ధిలోక ప్రవేశము అప్రయత్నముగ కలుగును. భక్తి, జ్ఞానము, యోగము, వైరాగ్యముల ద్వారా జీవుడు చేరు ప్రథమ గమ్యమే బుద్ధిలోకము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 116 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Bhadramūrtiḥ भद्रमूर्तिः (116) 🌻*
She is an embodiment of auspiciousness (nāma 200). This is because she is also addressed as Śrī Śiva (nāma 998) which means auspiciousness.
The Brahman alone is auspicious. Therefore, She is addressed here as the Brahman. Viṣṇu Sahasranāma also says maṅgalānām ca maṅgalaṃ meaning the best amongst the auspices. Her very form is auspicious.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 18 🌴*
18. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస: పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్ ||
🌷. తాత్పర్యం :
తేజోపూర్ణములైన సర్వములందు తేజ:కారణుడతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞానవిషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై యున్నాడు.
🌷. భాష్యము :
సూర్యుడు,చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే (దేవదేవుడే) కారణు. ఆధ్యాత్మికజగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు. దేవదేవుని తేజము అచ్చట విస్తరించియుండుటయే అందులకు కారణమనియు వేదవాజ్మయమున తెలుపబడినది.
కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతికజగమునందు మహాతత్త్వముచే (భౌతికాంశములు) కప్పుబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మికజగత్తున ఏమాత్రము అవసరముండవు.
భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతికజగత్తు నందు స్థితిని కలిగిలేదని స్పష్టమగుచున్నది.
ఆధ్యాత్మికకాకాశమున అత్యంతదూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై యున్నాడు. ఈ విషయమును వేదములు సైతము నిర్ధారించియున్నవి.
“ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8) అనగా సూర్యుని వలె నిత్యకాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతికజగత్తు అంధకారమునకు ఆవల నున్నాడు”.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 473 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 18 🌴*
18. jyotiṣām api taj jyotis
tamasaḥ param ucyate
jñānaṁ jñeyaṁ jñāna-gamyaṁ
hṛdi sarvasya viṣṭhitam
🌷 Translation :
He is the source of light in all luminous objects. He is beyond the darkness of matter and is unmanifested. He is knowledge, He is the object of knowledge, and He is the goal of knowledge. He is situated in everyone’s heart.
🌹 Purport :
The Supersoul, the Supreme Personality of Godhead, is the source of light in all luminous objects like the sun, moon and stars. In the Vedic literature we find that in the spiritual kingdom there is no need of sun or moon, because the effulgence of the Supreme Lord is there.
In the material world that brahma-jyotir, the Lord’s spiritual effulgence, is covered by the mahat-tattva, the material elements; therefore in this material world we require the assistance of sun, moon, electricity, etc., for light. But in the spiritual world there is no need of such things. It is clearly stated in the Vedic literature that because of His luminous effulgence, everything is illuminated.
It is clear, therefore, that His situation is not in the material world. He is situated in the spiritual world, which is far, far away in the spiritual sky. That is also confirmed in the Vedic literature.
Āditya-varṇaṁ tamasaḥ parastāt (Śvetāśvatara Upaniṣad 3.8). He is just like the sun, eternally luminous, but He is far, far beyond the darkness of this material world.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు - 85 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀 23. ఇంద్రియ యజ్ఞము - దైవమునకు సమర్పణ చెంది ఇంద్రియముల నుండి పొందు అనుభూతిని దైవ సంకల్పముగ స్వీకరించుట యొక యజ్ఞము. ఇంద్రియముల ద్వారా, ఇంద్రియార్థముల నుండి పొందు అనుభూతిని దైవముగ చూచినప్పుడు సంయమము దక్కును. 🍀*
*📚. 4. జ్ఞానయోగము - 26 📚*
*శ్రోత్రాదీ నింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |*
*శబ్దాదీ న్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి || 26*
చూచునది, వినునది, వాసన చూచునది, రుచి చూచునది, స్పృశించునది దైవమే అని భావన చేసి జీవించినచో అది ఇంద్రియ యజ్ఞము కాగలదు. దైవమునకు సమర్పణముగ ఇంద్రియార్థములు, యింద్రియములందు హోమ చేయబడుచున్నట్లుగా ఈ యజ్ఞము నిర్వర్తింపబడును. తత్కారణముగా, దైవము యింద్రియముల ద్వారా కూడ, రసోపేతముగ అనుభవింపబడును.
ఇంద్రియ నిగ్రహము :
పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచప్రాణములు. ఇట్లు నాలుగు పంచారములతో కూడినది శరీరము. పంచప్రాణము లాధారముగ మిగిలిన పంచారములు పనిచేయుచు నుండును. ప్రాణ మాధారముగనే దేహ మేర్పడు చున్నది. ఇందు జీవుడు త్రిగుణాత్మకుడై జీవించు చుండును.
త్రిగుణముల కావల దైవముండును. దైవమే ప్రాణముగను, ప్రజ్ఞగను వుండును. దైవము త్రిగుణముల నుండి ప్రతిబింబింపగ జీవుడేర్పడును. కావున జీవుడు త్రిగుణములకు బద్ధుడై దైవమందించు ప్రాణ, ప్రజ్ఞ లాధారముగ తనదైన జీవితము జీవించు చుండును.
తానొకడున్నాడను భావమున జీవించు చుండును. అతడు జీవిత మనుభవించుటకు దేహమాధారమై యుండును. దేహము లేనిదే జీవుడే అనుభూతియు పొందలేడు. అట్టి దేహమందు తన్మాత్రలు, ఇంద్రియములు త్రిగుణాత్మకుడగు జీవుని బాహ్యముతో సంబంధము కలిగించి అనుభూతుల నొసగును.
ఇంద్రియములు, తన్మాత్రలు లేనిదే జీవు డే అనుభూతియు చెందలేడు. తన్మాత్రలనగా వినుట, చూచుట, స్పర్శించుట, రుచి చూచుట, వాసన చూచుట అను ప్రజ్ఞలు. ఈ ప్రజ్ఞలు పని చేయుటకు వాహనములుగ లేక వాహికలుగ లేక యంత్రములుగ ఐదింద్రియము లున్నవి.
అవియే పై వరుసలో చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు ఐదు ప్రజ్ఞలున్నను, ఐదు వాహికలు లేనిచో అనుభూతి లేదు. అనగా వినుట యను ప్రజ్ఞ చెవి లేనిచో పనిచేయదు. చెవి యున్నను వినుట లేనిచో అది అలంకారప్రాయమే. ఇట్లు ఇంద్రియములు, తన్మాత్రలు ఒకదాని నొకటి నాధారము చేసుకొని జీవుని కనుభూతి నిచ్చుచున్నవి.
అనుభూతి సుఖానుభూతి కావచ్చును, దుఃఖానుభూతి కూడ కావచ్చును. సుఖ దుఃఖములు, బాధ ఆనందములు. ఇట్టి ద్వంద్వానుభూతులు జీవునకు కలుగుచుండును. కొన్ని శబ్దములు విన్నచో ఆనందముగ నుండును. అట్లే కొన్ని శబ్దముల వలన బాధ కలుగును. ద్వంద్వముల కతీతమైనటువంటిది భగవత్ తత్త్వము.
దానిని పొందవలెనన్నచో చెవి ద్వారా విను రెండు రకముల విషయము లందును, కన్ను ద్వారా చూచు రెండు రకముల విషయములు, అట్లే మిగిలిన యింద్రియముల ద్వారా పొందు ద్వంద్వముల యందు దైవమును చూచుట ఒక యజ్ఞము. ఇంద్రియముల ద్వారా, ఇంద్రియార్థముల నుండి పొందు అనుభూతిని దైవముగ చూచినప్పుడు సంయమము దక్కును.
అట్లు దక్కుటవలన విషయముల యందలి ద్వంద్వములు హోమము చేయబడి దైవము నిలచును. ఇంద్రియములను, శబ్దాది విషయములను హోమము చేయుట యనగా నిదియే. దైవమునకు సమర్పణ చెంది ఇంద్రియముల నుండి పొందు అనుభూతిని దైవ సంకల్పముగ స్వీకరించుట యొక యజ్ఞము. అంతియేగాని ముక్కు, చెవి, కనుగుడ్లు పెరకి హోమము చేయుట కాదు.
ఇంద్రియ నిగ్రహము కూడ దైవమును ఇంద్రియముల ద్వారా గ్రహించునప్పుడే కలుగును కాని, నిగ్రహించుటకు పాషాండ ప్రవర్తనములు పనికి రావు. పాషండ మార్గమున ప్రయత్నించు నిగ్రహములు రజోగుణ ప్రేరితములు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 282 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
67. అధ్యాయము - 22
*🌻. సతీ శివుల విహారము - 3 🌻*
వివిధ మృగముల గుంపులతో కూడి యున్నది, వందలాది సరస్సులతో నిండియున్నది, గణములన్నింటిలో గొప్పది యగు మేరు పర్వతము కంటె గూడ గొప్పది, సుందరమైనది అగు నా కైలాసమునందు నివసించగోరు చుంటివా?(50), ఈ స్థానములలో నీకు దేనిపై మనసు గలదో నాకు వెంటనే చెప్పుము. నీకు నేను అచట నివాసమును ఏర్పరచెదను (51).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శంకరుడిట్లు పలుకగా, అపుడు దాక్షాయణీ మహాదేవునితో తన మనస్సులోని మాటను ప్రకటించుచూ మెల్లగా ఇట్లనేను (52).
సతి ఇట్లు పలికెను -
నేను నీతో గూడి హిమవత్పర్వతమునందు మాత్రమే నివసించగోరెదను. ఆ మహాపర్వతమునందే శీఘ్రముగా గృహమును నిర్మించుము (53).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివుడా మాటను విని మిక్కిలి మోహమును పొందివాడై దాక్షాయణితో గూడి ఎత్తైన హిమవత్పర్వత శిఖరమునకు వెళ్లెను (54). సిద్ధాంగనలచట గుంపులుగా నుండిరి. పక్షులు కూడా అచటకు వెళ్లలేవు. సుందరమైనది, సరస్సులతో వనములతో ఒప్పారునది (55),
విచిత్ర రూపములు గల కమలములతో కూడియున్నది, రత్నముల విచిత్ర కాంతులతో ప్రకాశించునది, ఉదయించే సూర్యుని పోలియున్నది అగు ఆ శిఖరముపై శంభుడు సతీ దేవితో గూడి చేరెను (56). ఆ శిఖరముపై మేఘములు స్ఫటికము వలె తెల్లగ నుండెను. ఆ శిఖరము పచ్చిక బీళ్లతో, చెట్లతో, వివిధమైన రంగులు గల పుష్పములతో మరియు సరస్సులతో కూడి యుండెను (57).
చెట్లు కొమ్మల అగ్రములు పూలతో నిండి యుండెను. వాటి చుట్టూ భ్రమరములు తిరుగుతూ శబ్దము చేయు చుండెను. పద్మములు, వికసించిన నల్ల కలువలు సరస్సులలో నిండియుండెను (58). చక్రవాకములు, కలహంసలు, హంసలు, బాతులు, మదించిన సారస పక్షులు, క్రౌంచ పక్షులు, గరుడ పక్షులు ధ్వనులను చేయుచుండెను (59).
మత్త కోకిలలు మధురముగా కూయుచుండెను. ప్రమథ గణములు, కిన్నరులు, సిద్ధులు, అప్సరసలు, యక్షులు (60), విద్యాధర స్త్రీలు, దేవతాస్త్రీలు, కిన్నరస్త్రీలు అచట విహరించుచుండిరి. పర్వత వాసులైన ముత్తయిదువలు, కన్యలు అచట నివసించి యుండిరి (61).
విద్వాంసులచే వీణ, మృదంగ, పటహములు వాయించబడు చుండగా, అప్సరసలు ఉత్సాహముతో నాట్యమాడు ఆ శిఖరము శోభిల్లెను (62). అచట దేవతలు నిర్మించిన దిగుడు బావులలో నీరు పరిమళభరితమై నిండుగా నుండెను. అచటి లతా గృహములు నిత్యము వికసించిన పుష్పములతో శోభిల్లెను (63).
హిమవంతుని పురమునకు సమీపరములో ఈ విధముగా శోభిల్లే శిఖరమునందు వృషభధ్వజుడు సతీదేవితో గూడి చిరకాలము రమించెను (64). స్వర్గముతో సమానమైన ఆ స్థానము నందు శంకరుడు సతీదేవితో గూడి పదివేల దివ్య సంవత్సరముల కాలము ఆ నందముతో విహరించెను (65).
ఆ శివుడు ఒకప్పుడు ఆ స్థానము నుంéడి మరియొక స్థానమునకు వెళ్లెడివాడు. సర్వదా దేవతలతో, దేవతాస్త్రీలతో సేవింపబడే మేరు శిఖరమునకు ఆయన మరియొకప్పుడు వెళ్లెను (66). సతీదేవి అనేక ద్వీపములను, ఉద్యానములను, వనములను, భూమండలమును అనేక పర్యాయములు దర్శించి, మరల అదే స్థలమునకు మరలి వచ్చి సుఖముగా రమించెను (67). శంభునకు పగలు రాత్రి భేదము ఎరుక లేకుండెను. ఆయన పరబ్రహ్మ ధ్యానమును వీడి మనస్సును సర్వదా సతియందు నిలిపి, ఆమెను ప్రేమించెను (68).
అదే తీరున సతీ దేవి సర్వదా మహాదేవుని ముఖమునే చూచెడిది. మహాదేవుడు కూడా అన్ని వేళలా అన్నింటియందు సతీముఖమునే దర్శించెను (69). ఈ విధముగా ఆ ఉమా పరమేశ్వరులు ఒకరితో నొకరు కలిసి యుండి ప్రేమ భావన యను జలములతో అనురాగమనే వృక్షమును వర్ధిల్ల జేసిరి (70).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో ఉమాపరమేశ్వర విహార వర్ణనమనే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 38 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 3 - THE FIRST RULE
*🌻KILL OUT AMBITION - Work as those work who are ambitious - 18 🌻*
175. It may be only an illusion but it is a very powerful one – that high philosophical view that whether you get anything now or in a million years does not matter. I feel it matters to me; therefore I think it must matter to other people, and if we could get them to take the earlier opportunity of advancing, we should be doing a very great thing for them.
What difference it makes in the long run to the Logos in whom all this is moving, I cannot tell, but it is very likely His wish that we should evolve and if He wishes that to be done, then also He must wish that it should be done as soon as may be.
We are clearly carrying out His will if we try to press onward along the Path which leads to full unity with Him, and if we help others along that Path, so I cannot sea that it is all the same whether people enter the stream in this world period, or this chain period, or wait till the next. I shall do all I can to help people to enter it in this one.
176. Perhaps another test would be as to whether we are willing to take any work that is His work – whether we are willing to help high and low alike.
To Him there is neither high nor low in the matter of progress, though some part of His scheme may be at a higher and another part at a lower point in that progress. It is very much like the turning of a wheel; some part of it is approaching the top as it turns, but all of it alike is moving along as the wheel turns. Our work is to help the whole forward, to push any part of the wheel.
The life at all levels is the divine life; it is more unfolded at some stages than at others – more unfolded in the human than in the animal, in the animal than in the vegetable, in the vegetable than in the mineral – but the life is the divine life everywhere, and if we are helping forward any part of that we are helping the divine plan.
That which is higher or lower is the form in which the life is cast; the form permits- of greater or lesser unfoldment, but the life is one life. That certainly must be part of His point of view, which is very different from our outlook – the idea that all life is in reality the same; there is no high nor low from that point of view, because the whole is moving together.
That does not alter the fact that there may be some in whom the life is more unfolded, who are capable of giving greater assistance, and others who may be capable only of a lower grade of assistance; the point is that those who find that what they can do best would commonly be called lower work should not be in the least disheartened, because they also are pushing the same wheel – they are helping the unfoldment of the same divine life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 170 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భరద్వాజ మహర్షి - 1 🌻*
జ్ఞానం:
01. భరద్వాజ మహర్షి సప్తర్షులలో ఒకరు. పరమ ప్రశాంతచిత్తుడు. ఆయన తపస్సు చేసిన ఆశ్రమానికి ‘భరద్వాజ తీర్థ’మని పేరువచ్చింది. బృహస్పతి, వదినగారు అయిన మమతను మోహించాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న మమత గర్భంలోని శిశువు బృహస్పతి యొక్క వీర్యాన్ని తన్నివేశాడు. “నా వీర్యం వల్ల పుట్టిన ఈ పిల్లవాడిని నీవే పెంచుకో” అన్నాడు బృహస్పతి. అంటే ఆమె, “పాపం వల్ల పుట్టిన వాడు వీడు. కాబట్టి నేను పెంచను” అన్నది. ఆ విధంగా ఇద్దరి చేత వదిలి పెట్టబడిన వాడు కాబట్టి అతడికి ‘ద్వాజుడు’ అని పేరు వచ్చింది.
02. పురాణాలలో ఉన్న ఒక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎంత పెద్దవాడయినా ఎంతటి తప్పుచేసినా దాపరికం లేకుండా చెపుతాయి. Honest reporting. వాళ్ళు పరమ పూజ్యులు అని చెప్పదలచుకుంటే వాళ్ళ తప్పులన్నీ దాచి ఉంచి రాయాల్సివస్తుంది. కాని అలాకాక, పురాణం వాళ్ళు చేసిన తప్పులతోపాటు వాళ్ళమహత్తుకూడా చెపుతుంది.
03. ఒక ఉద్బోధం ఏమిటంటే, ఎంతటి తపస్సంపన్నులయినా, దేవతలైనా జ్ఞానంలేని సమయంలో దోషకరమైన పనులుచేసే అవకాశం ఉంది. అందుకని మనుష్యులు జాగ్రదవస్థలో ఉండాలని మనకు ఉద్బోధం అది.
04. అజ్ఞానం అనేది ఎవరినయినా పట్టుకోవచ్చు. ఇంద్రుణ్ణి అయినా, బృహస్పతి అయినా, దేవతలయినా ఎవరినయినాకూడా అది ఆవరించవచ్చు. జాగ్రత్తగా ఉండమని బోధిస్తుంది పురాణం. దాంట్లో ఉన్న అంతరార్థం చాలా విశేషమయింది.
05. పురాణాలను సమర్ధించడం, అన్వయించటం అంత సులభంకాదు. అందుకు స్థూలదృష్టి రెండూ కూడా ఉండాలి. రామాయణం చరిత్రయే. పురుషోత్తముడి చరిత్ర. మానవ మాత్రుడై పుట్టిన భగవంతుడు ఎన్ని కల్యాణ గుణములు కలిగిన వాడో అది అలా తెలుసుకుంటేనే మనకు లాభం. అందులోనే మాధుర్యం ఉంటుంది.
06. అంతేకాని, రాముడంటే కేవలం ఆత్మ-సీత అంటే ప్రకృతి అనే తాత్వికార్థంమాత్రమే చెబితే, సామాన్యుడికి అందులో నిత్యజీవనానికి అవసరమయ్యే స్ఫూర్తి ఏమీ కలుగదు. అందువల్ల గాథను గాథగానే చెప్పాలి, తాత్వికార్థాన్ని ఆ భూమికలో అలాగే ఉంచాలి. అది వివరించేటప్పుడు అలాగే అన్వయించాలి. ఆ తాత్వికదృష్టితోకూడా మనం సమన్వయించి చెప్పటమే ఉచితం తప్ప, కేవలం తాత్వికదృష్టివలన ఉపయోగం లేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 234 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 83. Who would have witnessed the message 'I am', if your prior state of non-beingness had not been there?🌻*
The very answer to such a question, if asked with a deep intensity, can land you into the Absolute state instantly. Prolonged, earnest meditation on the 'I am' holds the potential for such an occurrence.
Even if you cannot actually experience this, through pure verbal understanding you can see that there has to be 'someone' that witnesses or knows the 'I am'- otherwise the 'I am' would never have come to be.
Meditation on the 'I am', which is the 'Sadhana' (practice), holds the key to knowing and becoming that 'someone'.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 109 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 14 🌻*
*మార్గములో సద్గురువు యొక్క దర్శకత్వము ఏల అవసరము?*
459. సద్గురువు సహాయము లేకుండా, మార్గములో పయనించువారు, మార్గములో గోచరించెడు తేజోవంతమైన--భ్రాంతి జనకములైన--దుస్తరములైన--వింత దృశ్యములలో చిక్కుకొని వాటి నుండి తప్పించుకొని బయటికి రాలేరు. అట్టి ప్రమాదములకు లోను కాకుండా సద్గురువు కాపాడుచుండును.
460. ఆధ్యాత్మిక మార్గం భౌతిక గోళమునకు, సత్య గోళ మనకు వంతెన వంటిది.
ఆరవ భూమికలో__ సత్పురుషుడు:-- మానవుడు, మానవునిగా భగవంతుని ప్రతి వారిలో ప్రతి దానిలో చూచును. ఇది ఆధ్యాత్మిక పంచభూత లలో రెండవది.
*మానవుని ఆధ్యాత్మిక వికాసము*
*గుణైక్యము:--*
ఆరవభూమికలో ఇంకనూ ఆత్మను వదలక పట్టి యున్న భౌతికగోళ సంబంధమైన భౌతిక లక్షణములు సూక్ష్మగోళ సంబంధమైన సూక్ష్మ లక్షణములు కాంతి హీనమైనట్లు పూర్తిగా తొలగిపోయి కరిగిపోవును. మానవుని ఆధ్యాత్మిక వికాసములో ఇది నాలుగవది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 73 / Sri Vishnu Sahasra Namavali - 73 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*మూల నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*
*🍀 73. స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|*
*పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః || 73 🍀*
🍀 679. స్తవ్యః -
సర్వులచే స్తుతించబడువాడు.
🍀 680. స్తవప్రియః -
స్తోత్రములయందు ప్రీతి కలవాడు.
🍀 681. స్తోత్రం -
స్తోత్రము కూడా తానే అయినవాడు.
🍀 682. స్తుతిః -
స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
🍀 683. స్తోతా -
స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
🍀 684. రణప్రియః -
యుద్ధమునందు ప్రీతి కలవాడు.
🍀 685. పూర్ణః -
సర్వము తనయందే గలవాడు.
🍀 686. పూరయితా -
తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.
🍀 687. పుణ్యః -
పుణ్య స్వరూపుడు.
🍀 688. పుణ్యకీర్తిః -
పవిత్రమైన కీర్తి గలవాడు.
🍀 689. అనామయః -
ఏ విధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 73 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Moola 1st Padam*
*🌻73. stavyaḥ stavapriyaḥ stōtraṁ stutiḥ stōtā raṇapriyaḥ |*
*pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇya kīrti ranāmayaḥ || 73 || 🌻*
🌻 679. Stavyaḥ:
One who is the object of laudations of everyone but who never praises any other being.
🌻 680. Stava-priyaḥ:
One who is pleased with hymns.
🌻 681. Stotraṁ:
A Stotra means a hymn proclaiming the glory, attributes and names of the Lord.
🌻 682. Stutiḥ:
A praise.
🌻 683. Stōtā:
One who, being all -formed, is also the person who sings a hymn of praise.
🌻 684. Raṇapriyaḥ:
One who is fond of fight for the protection of the world, and for the purpose always sports in His hands the five weapons, the discus Sudarshana, the mace Kaumodaki, the bow Saranga, and the sword Nandaka besides the conch Panchajanya.
🌻 685. Pūrṇaḥ:
One who is self-fulfilled, being the source of all powers and excellences.
🌻 686. Pūrayitā:
One who is not only self-fulfilled but gives all fulfillments to others.
🌻 687. Puṇyaḥ:
One by only hearing about whom all sins are erased.
🌻 688. Puṇyakīrtiḥ:
One of holy fame. His excellences are capable of conferring great merit on others.
🌻 689. Anāmayaḥ:
One who is not afflicted by any disease that is born of cause, internal or external.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సూక్ష్మ శరీర యానం 🌹*
✍️ భట్టాచార్య
సూక్ష్మ శరీర యానం అద్భుతమైనది. సూక్ష్మ శరీరం అనగా లింగ శరీరం లేదా subtle body. "యానం" అనగా ప్రయాణం. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడమే...సూక్ష్మ శరీర యానం. సూక్ష్మ శరీర యానం వేరు. స్థూల శరీర యానం వేరు. స్థూల శరీర యానం మనందరికీ నిత్య జీవితంలో అనుభవమే. ఇక్కడ మరల teleportation అనే విషయం మరొకటి ఉంది. ఈ "టెలీ పోర్టేషన్" అంటే...ఈ పాంచ భౌతిక దేహం యావత్తు, మనో వేగంతోనో లేదా ఊహకు అందని మరో వేగంతోనో...ఇటు కన్యా కుమారి అగ్రం నుండి హిమాలయాలలోని ఒకానొక గుహలో ఉండడం...క్షణాల్లో జరిగి పోవడం...సిద్ధ యోగులకు మాత్రమే సాధ్యమయ్యే పని.
మన దేశ పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ...ఈ టెలీ పోర్టేషన్, సూక్ష్మ శరీర యానాలు...సుప్రసిద్ధాలు.
ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం. పరమోన్నత యోగ,తాంత్రిక సిద్ధులు సాధించిన వారికి ఈ "టెలీ పోర్టేషన్" కరతలామలకమే. సూక్ష్మ శరీర యానం కూడా ఒక గొప్ప సిద్ధి. ప్రాణాయామము, తంత్ర సాధన, యోగ సాధన చేసేవారికి ఈ సిద్ధి కరతలామలకమే. ఈ సిద్ధి ఈ రోజు, సాధక లోకంలో వినియోగించ బడుతున్నప్పటికీ , భౌతిక వాదులకు, మనస్సు స్థితి గతులను ఇంకా అర్థం చేసుకోలేని మూఢులకు.....ఈ సూక్ష్మ శరీర యానం కొరకరాని కొయ్య.
ఈ సిద్ధులు, కేవలం ఎంతో పురోగమించిన వాళ్ళలో మాత్రమే...ఈ శక్తులు పాక్షికంగా కూడా, ఐచ్ఛికంగా ఉంటాయి.
"సూక్ష్మ శరీర యానం" ఒక దివ్యమైన తీర్థ యాత్ర. మధుర మైన తీర్థ యాత్ర. ఈ యాత్రకు సిద్ధ పడేవారే, ఈ సూక్ష్మ శరీర యానానికి అర్హులు.
సూక్ష్మ శరీర యానం అనేది, ప్రాచీన కాలం నుండి అనేక రహస్య సమాజాలలో ఉన్నది. ఇది ఒక రహస్య తాంత్రిక విధానంగా భావించేవారు. ఆధునిక కాలంలో "theosophists" (దివ్య జ్ఞానులు)...ఈ పద్ధతిని "ashtral projection" గా అభివర్ణించారు. ఈ సూక్ష్మ శరీర యానం... కలలు, ధ్యాన పద్ధతుల ద్వారా కూడా జరుగుతుందని,మరికొన్ని సార్లు...ఈ పయనం...భావాతీత స్థితిలో కూడా జరుగుతుందని...విశ్వసిస్తారు. అయితే, ఈ సూక్ష్మ శరీర యాన విషయం,టెలీ పోర్టేషన్ విషయాల్లో...చాలా గూఢమైన అనుభవాలున్నాయి. ఈ భౌతిక ప్రపంచానికి...ఇలాంటి అనుభవాలు...అంత వేగం వెల్లడి కావు. ఒక రకంగా చెప్పాలంటే, సూక్ష్మ శరీరము...ఈ భౌతిక శరీరాన్ని వదలి సూక్ష్మ తలాల్లోకి వెళుతుంది. ఈ సూక్ష్మ శరీర యానాన్ని Out of Body Experiences....అనికూడా అంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే, యోగ శాస్త్రాన్ని...అనుభవంలోకి తెచ్చుకున్నవారిలో కనిపిస్తుంది.
శవాసన, యోగనిద్ర, ఉన్నత స్థాయి ధ్యాన సాధనల్లో...ప్రారంభంలో, సాధకునికి, లింగ శరీరం(సూక్ష్మ శరీరం) దగ్గర గానే ఉండును. అభ్యాసం చేసే కొలది...ఈ సూక్ష్మ శరీరానికి, జడ శరీరానికి...దూరం పెంచ వచ్చును. ఇంకా సాధనలో పురోగతి చెందే కొద్దీ, ఈ సూక్ష్మ శరీరాన్ని, సంకల్ప మాత్రం చేత...విశ్వం లోని ఏ ప్రాంతానికైనా పంపవచ్చును. ఈ సూక్ష్మ శరీర వ్యవహారాలు, సంకల్ప మాత్రం.....చేత జరుగును. ఈ సూక్ష్మ శరీరము దేశ, కాల, వర్తమానములకు అతీతము. ఈ అవస్థలో భూత,భవిష్యత్, వర్తమానములు....ఒకే సమయంలో అనుభవాన్నిస్తాయి.
ఈ అవస్థలో, వర్తమానములో...భూత-భవిష్యత్తులు, లయించి ఏక మాత్ర కాలంగా భాసించును.
సూక్ష్మ శరీర యానంతో, భౌతిక ప్రపంచాన్ని వదలి పెట్టి, మనం ఇతర తలాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆయా తలాల్లో ఉన్న వారితో భాషించవచ్చు కూడా.
కొన్ని యోగ సాంప్రదాయాలలో, సూక్ష్మ శరీర యానం అనేది.....సిద్ధులలో ఒకటి. అష్ట ప్రధాన సిద్ధులు వేరు. ఈ సూక్ష్మ శరీరయానం అష్ట గౌణ సిద్ధులలో ఒకటి కావచ్చు. ప్రాణాయామము, ధ్యానము, మంత్ర సాధన...చేస్తున్న యోగులలో ఈ "సూక్ష్మ శరీర యానం" అనే సిద్ధి ప్రకటితం కావచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment