ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 115, 116 / Sri Lalitha Chaitanya Vijnanam - 115, 116 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖
🌻115. 'భద్రప్రియా'🌻
మంగళమగు విషయములయందు ప్రియము కలది శ్రీలలిత. భద్ర మనగా మంగళము. పవిత్రత గల వస్తువు లన్నియూ మంగళ ప్రదములే. పసుపు, కుంకుమ, గంధము, ఇతర సుగంధ ద్రవ్యములు, కళ, కాంతి, అందము గల వస్తువులు శ్రీలలితకు ప్రియము కలిగించగలవు. ఇవి అన్నియూ లక్ష్మీ ప్రదములు. వాని యందు ఆమె ప్రియముగా వసించి యుండును.
ఈ కారణముగనే, శ్రీదేవిని పూజించుటకు పసుపు, కుంకుమ, సుగంధము, సుపుష్పములు (మంచి వాసన గల పువ్వులు; సువాసన లేని పువ్వులతో పూజింపరాదు) అగరు వత్తులు, నేతి దీపములు, ఘుమఘుమలాడు వంటకములు, పట్టు వస్త్రములు, బంగారు నగలు, ఆభరణములు, రత్నములు ఆదిగాగల కాంతివంతమైన వస్తువులు శ్రీ లలితాదేవి పూజా సమయమున వాడుదురు.
ఖనిజములయందు, వృక్షజాతియందు, జంతువులయందు, మానవులయందు, శ్రీ లలితకు ప్రియమగునవి చాల కలవు. వాని వినియోగము ఆమెకు ప్రియము కలిగించగలదు. ఎచ్చట పవిత్రత యుండునో అచ్చట శోభ యుండును. శోభ అంతయూ శ్రీదేవి అస్తిత్వము.
ఏనుగులలో భద్రజాతి ఏనుగులని కలవు. ఈ ఏనుగులన్న శ్రీదేవికి అత్యంత ప్రీతి. దేవాలయములందు ఈ జాతి ఏనుగులను
పోషించుట అను సంప్రదాయము ఈ కారణముగనే ఏర్పడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 115 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhadrapriyā भद्रप्रिया (115) 🌻
She likes the act of benefaction. She is keen to shower Her blessings on Her devotees. Devotees are those who try to attain Her by any of the means discussed earlier. The act of benefaction is done by Her sacred feet.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 116 / Sri Lalitha Chaitanya Vijnanam - 116 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖
🌻116. 'భద్రమూర్తి🌻
మంగళప్రదమైన రూపము కలది. శ్రీలలిత రూపము అత్యంత మంగళకరమైనది. అందము అతిశయించు రూపమది. జగత్తునే మోహింపజేయు రూపము.
అట్టి దిట్టిదని వర్ణింపరానిది. నఖశిఖ పర్యంతము అత్యంత మాధుర్యమును వర్షింపజేయు రూపము. మొదటి యాభైనాలుగు నామములు ఆమె రూపమును కీర్తించినవిగా ఈ సహస్రనామమున యున్నవి.
ఈ నామములను చక్కగ ఉచ్చరించుచు, ఆమె రూపమును దర్శించు వారికి సర్వము మంగళప్రదమై నిలచును. ఆమె సర్వమంగళ, నిరాకారయైనను, నిరుపమానమైన సుందరాకారమున దర్శనమిచ్చి అనుగ్రహంపగలదు.
దేవతారూపము హృదయమున ప్రతిష్ఠించుకొని అంతర్ముఖమున ఆరాధించుట సర్వసౌభాగ్యములకు మూలమై యున్నది.
హృదయ పీఠమున దివ్యకాంతులతో కూడిన రూపము స్థిరపడి ఆరాధింప బడినపుడు ఆరాధనకు బుద్ధిలోక ప్రవేశము అప్రయత్నముగ కలుగును. భక్తి, జ్ఞానము, యోగము, వైరాగ్యముల ద్వారా జీవుడు చేరు ప్రథమ గమ్యమే బుద్ధిలోకము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 116 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Bhadramūrtiḥ भद्रमूर्तिः (116) 🌻
She is an embodiment of auspiciousness (nāma 200). This is because she is also addressed as Śrī Śiva (nāma 998) which means auspiciousness.
The Brahman alone is auspicious. Therefore, She is addressed here as the Brahman. Viṣṇu Sahasranāma also says maṅgalānām ca maṅgalaṃ meaning the best amongst the auspices. Her very form is auspicious.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
No comments:
Post a Comment