భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 114
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 114 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 19 🌻
తాదాత్మ్యము:-
478. భగవంతుడు,
భౌతిక ప్రపంచములో, దేహమయ్యెను.
సూక్ష్మ ప్రపంచములో, ప్రాణమయ్యెను.
మానసిక ప్రపంచములో, మనస్సయ్యెను.
విజ్ఞాన భూమికలో, భగవంతుడయ్యెను.
" దేవుడె నీవై నీవే దేవుడై
దివ్యత్వంబును పొందెదవు”
(మెహెర్ గీతావళి నుండి)
తాదాత్మ్యతలు, అహమ్
నేను భగవంతునను - సత్య అహమ్
మిధ్యాహమ్ - మాయ - అవిద్య
1. మనోముయ ప్రపంచం - నేను మనస్సును.
2. సూక్ష్మ ప్రపంచము - నేను శక్తిని
3. భౌతిక ప్రపంచం - నేను మానవుడిని
నేను ఎవరిని? - సహజ ఆహమ్
479. స్థూల సంస్కారములు---అన్నమయ దేహచైతన్యము --- భౌతిక లోకానుభవము.
సూక్ష్మ సంస్కారములు --- ప్రాణమయ దేహచైతన్యము --- సూక్ష్మ లోకానుభవము
మానసిక సంస్కారములు --- మనోమయ దేహచైతన్యము --- మానసిక లోకానుభవము.
480. ఆత్మకు -- స్థూల, సూక్ష్మ, కారణ దేహములు ప్రతిబింబములు.
481.స్థూల--సూక్ష్మ--కారణ దేహములు--
పరిమితి గలవి, రూపములు గలవి, నశ్వరమైనవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment