శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 127, 128 / Sri Lalitha Chaitanya Vijnanam - 127, 128

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 68 / Sri Lalitha Sahasra Nama Stotram - 68 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 127, 128 / Sri Lalitha Chaitanya Vijnanam - 127, 128 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 127. 'శ్రీకరీ' 🌻

“శ్రీ”ను కలిగించునది శ్రీలలిత అని అర్థము.

శ్రీ అనగా లక్ష్మి లేక సంపద, వైభవము. శ్రీ అనగా సకల విద్యలలో అధిదేవత అయిన సరస్వతి. శ్రీ అనగా సకల శక్తి స్వరూపిణి అయిన పార్వతి.

శ్రీలలిత నారాధించువారికి ఈ మూడును వరుసగ సంక్రమించగలవు. ఇవి కలవాడు పరిపూర్ణ ఐశ్వర్యవంతుడు. కేవలము శ్రీకృష్ణునియందే వీనిని దర్శించగలము.

అతని యందు లక్ష్మి, సరస్వతి, పార్వతులు పరిపూర్ణముగ వసించి యుండిరి. సంపదలయందుగాని, విద్యలయందుగాని, శక్తిసామర్థ్యముల యందు గాని శ్రీకృష్ణుని సాటి ఎవ్వరునూ లేరు. అతడు అవతరించిన లలితా మూర్తియే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 127 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Śrīkarī श्रीकरी (127) 🌻

Śrī means all types of prosperity. It also means wealth, happiness, beauty, attraction, auspiciousness, etc. Since She is the embodiment of all these qualities and also endows these qualities on Her devotees,

She is known as Śrīkarī. Viṣṇu Sahasranāma 611 is Śrīkarā which means the giver of wealth to His devotees.

In fact, there is no difference between Viṣṇu and Lalitāmbikā. Viṣṇu is also known for auspiciousness etc. There is brother- sister relationship and Viṣṇu is elder to Lalitāmbikā.

Other nāma-s in this Lalitā Sahasranāma confirm this. They are 267. Govinda rūpinī, 298. Nārāyanī, 893. Viṣṇu-rūpinī, etc. Śrīkarā’s sister is Śrīkarī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 128 / Sri Lalitha Chaitanya Vijnanam - 128 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖

🌻 128. 'సాధ్వీ' 🌻

అనన్యసామాన్యమైన పాతివ్రత్యము కారణముగ శ్రీలలితను సాధ్వీ అని పిలుతురు.

పాతివ్రత్యులకు పార్వతీదేవియే అధిష్టాన దేవత. ఆమె పూర్వ జన్మమున సతీదేవి. “సతి, సాధ్వీ, పతివ్రత అని అమరకోశమున సతీదేవిని ఉదహరింతురు. ఆమెయే మరల జన్మించి, మరల శివుని కొఱకై తపస్సుచేసి శివుని చేరినది.

భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు వేరొక పురుషునితో భర్త సంబంధము లేకపోవుటచే ఆమె పతివ్రత. ముందు జన్మములందు పొందిన భర్తనే జన్మ జన్మలకు పొందుట పాతివ్రత్యమని పురాణములు తెలుపుచున్నవి.

పాతివ్రత్య విషయమున పార్వతీదేవినే స్మరించుటకు శంకరులీ విధముగా తెలిపినారు. "సరస్వతీ అనుగ్రహముగల కవులందరునూ సరస్వతీపతులే. ధనముగలవాడెల్ల లక్ష్మీపతియే కాని పార్వతీదేవి విషయమట్లు కాదు. మహాదేవులకు తప్ప, ఆమె ఎవ్వరికినీ వశము కాదు”. అట్లు అనన్య సామాన్యమైన పతివ్రత అయిన పార్వతిని 'సాధ్వి' అని పిలుతురు.

పర్వతరాజునకు పుట్టినప్పుడు కూడ తాను శివునే వివాహ మాడుదునని ప్రకటించి లోకముల నాశ్చర్యపరచిన మహాసాధ్వి ఆమె.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 128 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Sādhvī साध्वी (128) 🌻

She is chaste (please refer nāma 709). When someone has huge wealth he is called Lakṣmī pati, meaning husband of Lakṣmī, Śrī Mahā Viṣṇu.

Pati is generally used to refer husband of a woman. In ancient Sanskrit pati was used to mean a good sign, good fortune, prosperity, success, happiness Lakṣmī resides in the chest of Viśnu. Lalitāmbikā and Śiva are attached to each other so deeply, the one without the other cannot even carry out their duties.

Saundarya Laharī (verse 96) explains this nāma. “Oh! Foremost among the chaste! How many are the poets who do not court Brahma’s wife (meaning knowledge). Who does not become the lord of Lakṣmī with only some riches? But, except Śiva nobody can attain you.”

The interpreters intend to say that nobody can claim Lalitāmbikā like other Gods and Goddesses as She is beyond comparison with them. The problem in the interpretation arises with the Sanskrit word ‘pati’ which generally means husband.

But there are other meanings for this word such as master, lord, owner, possessor etc. Therefore pati in this context does not mean husband but refers to a person who owns wealth or who has knowledge and wisdom, or who has mastered the art of speech. This verse is a poetic parlance.

Lalitāmbikā is called as chaste because, She always remains with Śiva. She considers Śiva as pati deva which means a wife who regards her husband as divine.

This is the right explanation for this nāma as She was created by Śiva and therefore She considers Śiva as Her divine husband. ‘Pati vedanaḥ’ means Śiva. Vedanaḥ means perception or knowledge and pati vedanaḥ means possessor of knowledge.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020


No comments:

Post a Comment