విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 146, 147 / Vishnu Sahasranama Contemplation - 146, 147


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 146, 147 / Vishnu Sahasranama Contemplation - 146, 147 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻146. అనఘః, अनघः, Anaghaḥ🌻

ఓం అనఘాయ నమః | ॐ अनघाय नमः | OM Anaghāya namaḥ

అఘం న విద్యతేఽస్య ఈతనికి ఏయొకదోషమును లేదు; ఏ పాపమూ లేనివాడు.

:: ఛాందోగ్యోపనిషత్ - అష్టమ ప్రపాఠకః, సప్తమః ఖండః ::

య ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్య కామ స్సత్యసఙ్కల్ప స్సోఽన్వేష్ట వ్యస్స విజిజ్ఞాసితవ్య స్స సర్వాంశ్చ లోకా నా ప్నోతి సర్వాంశ్చ కామా న్య స్తమాత్మాన మనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ ॥ 1 ॥

ఆత్మ పాపరహితమైనది, ముసలితనము లేనిది, మరణము లేనిది, దుఃఖము లేనిది, ఆకలి దప్పికలు లేనిది. ఆయాత్మ సత్యకామమును, సత్య సంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను శ్రద్ధగా వెదకి తెలిసికొనవలెను. ఈ రీతిగా తెలిసికొన్నవాడు అన్ని లోకములను, అన్ని కోరికలను పొందుచున్నాడని ప్రజాపతి చెప్పెను.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము (110) ::

మ. పరమాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందు గల్పించుఁ దాఁ

బరిరక్షించును ద్రుంచునట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్‌.

పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలమైన జ్ఞానం కలవాడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, నిత్యుడూ అయిన ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 146🌹

📚. Prasad Bharadwaj


🌻 146. अनघः, Anaghaḥ🌻

OM Anaghāya namaḥ

Aghaṃ na vidyate’sya Gha means sin. Anagha means sinless.

Chāndogyopaniṣat - Part VIII, Chapter VII

Ya ātmā’pahatapāpmā vijaro vimr̥tyurviśoko vijighatso’pipāsa ssatya kāma ssatyasaṅkalpa sso’nveṣṭa vyassa vijijñāsitavya ssa sarvāṃśca lokā nā pnoti sarvāṃśca kāmā nya stamātmāna manuvidya vijānātīti ha prajāpati ruvāca. (1)

:: छांदोग्योपनिषत् - अष्टम प्रपाठकः, सप्तमः खंडः ::

य आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपास स्सत्य काम स्सत्यसङ्कल्प स्सोऽन्वेष्ट व्यस्स विजिज्ञासितव्य स्स सर्वांश्च लोका ना प्नोति सर्वांश्च कामा न्य स्तमात्मान मनुविद्य विजानातीति ह प्रजापति रुवाच ॥ १ ॥

The ātmā or soul which is free from sin, free from old age, free from death, free from grief, free from hunger, free from thirst, whose desires come true and whose thoughts come true - That it is which should be searched out. That it is which one should desire to understand. He who has known this Self from the scriptures and a teacher and understood It, obtains all the worlds and all desires.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 6

Viṣuddhaṃ kevalaṃ jñānaṃ pratyaksamyagavasthitam,

Satyaṃ pūrṇamanādyantaṃ nirguṇaṃ nityamadvayam. (39)

:: श्रीमद्भागवत - द्वितीयस्कन्धे षष्ठोऽध्यायः ::

विषुद्धं केवलं ज्ञानं प्रत्यक्सम्यगवस्थितम् ।

सत्यं पूर्णमनाद्यन्तं निर्गुणं नित्यमद्वयम् ॥ ३९ ॥

He is pure, being free from all contamination of material tinges. He is the Absolute Truth and the embodiment of full and perfect knowledge. He is all-pervading, without beginning or end, and without rival.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 147 / Vishnu Sahasranama Contemplation - 147 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻147. విజయః, विजयः, Vijayaḥ🌻

ఓం విజయాయ నమః | ॐ विजयाय नमः | OM Vijayāya namaḥ

విజయ స్వరూపుడు; విజయమునిచ్చువాడు. బ్రహ్మణోవా ఏతత్ విజయే మహీయధ్వమితి (కేనోపనిషద్ చతుర్థః ఖండః) "ఆ బ్రహ్మము యొక్క మహిమ వలననే మీకు విజయము సిద్ధించెను." విజయతే జ్ఞాన, వైరాగ్యైశ్వరత్వాది గుణములచే విశ్వమును విశేషముగా అతిశయించువాడు లేదా విజయించువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 147 🌹

📚 Prasad Bharadwaj

🌻147. Vijayaḥ🌻

OM Vijayāya namaḥ

Manifestation of Victory itself. He who bestows Victory. Brahmaṇovā etat vijaye mahīyadhvamiti (Kenopaniṣad Chapter IV) "Indeed through Brahman's victory you have gained greatness!" Vijayate He excels the world by reason of His qualities of Jñāna, Aiśvarya and Vairāgya i.e., Knowledge, excellence and dispassion.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020

No comments:

Post a Comment