గీతోపనిషత్తు -114
🌹. గీతోపనిషత్తు -114 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముఖ్య సూత్రములు - 2 🍀
7. శరీరము, యింద్రియములు, మనసు, బుద్ధి, కర్తవ్య కర్మలు నిర్వహించుచుండుగ, చేతన యందలి సింహభాగము దైవ స్మరణమున నిలచుట కర్మసన్న్యాస యోగమై యున్నది.
8. పై తెలిపిన కర్మసన్న్యాస యోగమందు నిలచిన వానికి శాంతము స్థిరమై నిలచును.
9. పై విధముగ సన్యసించిన మనసు గల యోగి నవద్వార పురమగు శరీరమున సుఖముగ నుండును. అతని నుండి సర్వకార్యములు జరుగుచుండునే గానీ, చేయుచున్న ట్లతని కనిపించదు.
10. కర్మ, కర్తృత్వము, కర్మఫలము ప్రకృతి సంబంధితములు. పరమాత్మయందు లగ్నమైన చేతనగల జీవాత్మకు అవియంటవు. ఇతరులకు కర్మ చేయుచున్నామను భ్రమ యుండును.
11. పై విధమగు భ్రమ, భ్రాంతి ప్రకృతియం దిముడుటచే జీవాత్మ కేర్పడును. బ్రహ్మము స్మరణతో ప్రకృతిని దాటిన జీవాత్మ కివి యంటవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment