శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 169 / Sri Lalitha Chaitanya Vijnanam - 169


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 169 / Sri Lalitha Chaitanya Vijnanam - 169 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖



🌻169. 'క్రోధశమనీ' 🌻

భక్తుల క్రోధమును శమింపజేయునది శ్రీదేవి అని అర్థము.

నిత్యమూ శ్రీమాత ఆరాధనము గావించువారి క్రోధమును, మాత్సర్యమును, లోభమును, అశుభభావనలను శ్రీమాత హరించును.

“నక్రోధో న చ మాత్సర్యం, నలోభా నా శుభామతిః |

భవంతి కృత పుణ్యానాం, భక్తానాం, శ్రీసూక్తం జపేత్సదా||"

శ్రీ సూక్తమందలి ఈ ఋక్కులు పై సత్యమును బోధించుచున్నవి. కోపము కలవాడు ఎన్ని సత్కార్యములొనర్చిననూ, వాని ఫలముల నాతడు పొందలేడని, తన కోపముతోనే ఫలములను

నాశనము చేసుకొనునని పురాణ గాధలు తెలుపుచున్నవి. క్రోధముతో కూడి ఎవడు యాగమొనర్చునో, ఎవ్వడు హోమము చేయునో, ఎవడు పూజించునో వాని ఫలము పచ్చి కుండ యందలి నీరువలె హరింప బడును.

కోపముగలవారికి శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువగ ఉండును. నందీశ్వరునిపై కోపముతో రావణుడు చేసిన శివతపస్సు ఫలించలేదు. పినతల్లిపై కోపముతో ధ్రువుడు చేసిన తపస్సు ఫలించ లేదు. కోపముతో భీష్మునిపై యుద్ధము చేసిన పరశురామునికి విజయము లభించలేదు.

అట్లే విశ్వామిత్రుని తపస్సు కూడ ఆయనను తిప్పలు పెట్టినది. క్రోధము స్వభావమున ఉన్నవారు క్రోధము ఉండరాదని, దానిని విసర్జించవలెనని ఎంత ప్రయత్నించిననూ, ఆ ప్రయత్నము కూడ విఫలమే అగుచుండును.

జీవులకు అరిషడ్వర్గ విషయమున బలహీనత యుండుట సహజము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము ఇవి అన్నియూ ఒక్కొక్కొ సమయమున ఒక్కొక్కటిగా స్వభావమునుండి విజృంభించి జీవుని వశము గావించు కొనుచుండును. తనకన్న బలమైన శత్రువును తాను జయించలేడు కదా! ఇట్టి సమయమున దైవారాధనమే శరణ్యము.

ఆరాధన వలన భక్తి, శ్రద్ధ, ఆర్ద్రత పెరుగుచున్నకొలది క్రోధాది బలహీనతలు శమించును. మరియొక మార్గము లేదు. అన్ని ప్రయోజనములకు భగవదారాధనమే శరణ్యమని పెద్దలు పరిశోధించి నిర్ణయించిరి. అట్టి భగవదారాధనమందు నిజమైన రుచి ఏర్పడిన వారికి పరిష్కారములు శీఘ్రమగును. జీవులు శమమును పొందుదురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 169 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Krodha-śamanī क्रोध-शमनी (169) 🌻

She destroys anger of Her devotees. Anger is one of the six deterrents (desire, anger, jealousy, confusion, pride and envy) to self-realization. It is said that any worship done with anger destroys the effect of such worship.

Kṛṣṇa cites the reasons for anger (Bhagavad Gīta II.63, 64) “while contemplating the objects of the senses, a person develops attachment to them and from such attachment desire develops, and from desire anger develops and from anger total dissolution arises…” This is the reason for considering sensory organs as evils. Kṛṣṇa also says that material mode of passion is responsible for all the sufferings.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2021

No comments:

Post a Comment