🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 26 🍀
ఏక తత్త్వ నామ దృఢ ధరీ మనా!
హరీసీ కరుణా యేఈల్ తుఝ!!
తే నామ్ సోపారే రామకృష్ణ గోవింద్!
వాచేశీ సద్గద్ జపే ఆధీ!!
నామా పరతే తత్ నాహీరే అన్యథా!
వాయా ఆణికా పంథా జాశీ ఝణీ!!
జ్ఞానదేవా మౌన్ జపమాళ్ అంతరీ!
ధరోనీ శ్రీహరీ జపే సదా!!
భావము :
ఓ మనసా.! నామము ఏక తత్త్వము, కావున దానిని ధృఢముగ పట్టినచో నీకు శ్రీహరి కరుణ లభించగలదు. నాలుకతో పాడడానికి అన్నింటికంటే సులభ సాధనము రామకృష్ణ గోవింద అనే నామాలు. ఈ నామములను ఎల్లప్పుడు జపించు చుండవలెను.
నామానికి మించిన తత్త్వము వేరుగ ఏమీ లేదు. కావున అనవసరముగ ఇతర పంథములను అనుసరించకుము. అంతరాత్మ యందు శ్రీహరిని పట్టుకొని మౌనముగ జపము చేయుచున్నానని జ్ఞానదేవులు తెలుపు చున్నారు.
🌻. నామ సుధ -26 🌻
ఏక తత్త్వము దేవుని నామము
దృఢతరమున మనసున నిలుపుము
శ్రీహరి కరుణను నోచుకొనుము
ఆత్మానందమున పరవశించుము
రామకృష్ణ గోవిందనామము |
పలుకుటకది బహుసరళము
నాలుకనుంచుము ఎల్లకాలము
ఆలసింపక జపము చేయుము
హరినామానికి మించిన తత్వము
లేదు అన్యము సాధన శూన్యము
ఇతర పంథము దుఃఖ మూలము
అనవసరము వ్యర్థ మార్గము
జ్ఞానదేవుని సాధన మౌనము |
అంతరంగమున నామ జపము
పట్టుకొనెను శ్రీహరి నామము
జపము చేసెను ఎల్లకాలము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2021
No comments:
Post a Comment