భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 138
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 138 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 17 🌻
560. భగవల్లీల:-
పరాత్పర పరబ్రహ్మ స్థితిలో నున్న భగవంతుడు, తాను శాశ్వతుడు అనంతుడు అయియున్ననూ, తన అనంత శాశ్వత అస్తిత్వమందుగాని తన స్వీయ అనంత స్వభావమందుగాని ఎఱుక లేకున్నప్పుడు.... తన అనంత ఆదివిలాసము కారణముగా తన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములైన అనంత శాశ్వత స్వభావత్రయమందు అనుభూతి కలవానిని చేసినది.
561.భగవంతుడు ఎప్పుడును తన అనాది స్థితియైన పరాత్పరస్థితియందు ఎరుక లేకుండెను.కాని నూతనముగా సంపాదించిన శాశ్వత అనంత చైతన్యముతో తన పరాత్పరస్థితియందు జాగరూకుడై యున్నాడు.
562.చివరకు చైతన్యమే భగవంతుని, తన స్వీయ సత్యమును తెలిసికొనునట్లు చేసినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment