వివేక చూడామణి - 16 / Viveka Chudamani - 16


🌹. వివేక చూడామణి - 16 / Viveka Chudamani - 16 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బంధనాలు - 1 🍀


69. సంసార బంధనాల నుండి విముక్తి పొందుటకు మొదటి మెట్టు:- నశించే ఈ ప్రాపంచిక సుఖ దుఃఖములకు రోసి ప్రశాంత స్థితిని పొంది, తనను తాను అదుపులో ఉంచుకుని, సహనముతో శాస్త్రానుసారముగా అన్ని విధములైన యజ్ఞయాగాదుల వంటి కర్మల నుండి విముక్తి పొందవలెను.

70. గురువు యొక్క బోధనలు విని తదనుగుణంగా దీర్ఘమైన అడ్డంకులు లేని ధ్యానములో నిమగ్నమై సత్యాన్ని తెలుసుకోవాలి. అపుడు జ్ఞానవంతుడైన సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితికి చేరి, నిర్వాణ స్థితి యొక్క ఆనందమును ఈ జీవితములోనే పొందగలడు.

నిర్వికల్ప సమాధి స్థితిలో సాధకుడు, చేసేవానికి, చేయబడినదానికి భేదములేదని అంతా ఒక్కటే అని, మానసిక స్థితులన్ని తొలగిపోగా తాను ఆత్మలో కలసిపోవును. అదే అత్యున్నత ఎఱుక స్థితి. అట్టి స్థితిని సాధకుడు ఇతర సంబంధాలతో అతీతంగా మాటలకు అందని రీతిలో చేరగలడు. అది అవ్యక్తమైన ఆ

నంద స్థితి అని, అదే స్వచ్ఛమైన ఎఱుక స్థితి అని, నిర్వాణమని చెప్పబడినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 16 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj


🌻 Attachments - 1 🌻


69. The first step to Liberation is the extreme aversion to all perishable things, then follow calmness, self-control, forbearance, and the utter relinquishment of all work enjoined in the Scriptures.

70. Then come hearing, reflection on that, and long, constant and unbroken meditation on the Truth for the Muni. After that the learned seeker attains the supreme Nirvikalpa state and realises the bliss of Nirvana even in this life.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2021

No comments:

Post a Comment