🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మైత్రేయమహర్షి - 5 🌻
29. పాపకర్మలను కూడా తనలో లయంచేసుకున్నవాడు కృష్ణపరమాత్మ. మరి అటువంటి వాళ్ళను కూడా ఏ మహత్తుచేత తనలో లయంచేసుకున్నాడు! ఎటువంటి శక్తిచేత అట్లా చేసుకున్నాడు!
30. పరమాత్మ భావనతో వాళ్ళను తనలో లయంచేసుకున్నాడని అర్థం. అంతేకాని, కృష్ణభావంతో వాళ్ళను చంపితే వాళ్ళు మళ్ళీ పుడతారు. కృష్ణుడనే ఒక వ్యక్తి చంపినట్లయితే, యుద్ధంలో నిహతులైనవాళ్ళు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఎలాగ పుడతారో, అలాగ పుట్టవలసిందే కదా!
31. ‘శ్రీకృష్ణుడి చేతులలో’ చంపబడ్డ శిశుపాల దంతవక్త్రులుకూడా మళ్ళీ పుట్టవలసిందే! కాని అలా జరగలేదు. తనలో లయంచెందటం అంటే ఏమిటి? రాక్షసులనేటువంటి ఈ సమిధులను యజ్ఞంలో వ్రేల్చి పరమాత్మకు త్యాగం చేసాడు. కాబట్టి ఆ జీవులు పరమాత్మలో లయంచెందారు.
32. సాధనలు అనేది జడము. యజ్ఞంలో ఉపయోగించే సృక్సువములకు పుణ్యమ్రాంట్లుగా, కృష్ణుడనే బహుతికరూపానికికూడా ఫలం ఉండదు. తాను ఆత్మ స్వరూపుడై, సాక్షి మాత్రుడుగా ఉండాలి.
33. పరమాత్మ వస్తువు కూడా ఈ దేహంలో ఉండే వ్యక్తిచేత పనిచేస్తుంది. కర్మ నశిస్తుంది, కర్మఫలము నశిస్తుంది, కర్మఫలభోక్తలూ నశిస్తారు. ఎవరూకూడా మిగిలి ఉండరు. అంతాకూడా తాత్కాలికమే! నిత్యం కాదు, అనిత్యం. అట్లాంటి అనిత్యమైన కర్మకు ఫలమూ అనిత్యమైనదే.
34. ఈ విషయాలన్నీ మైత్రేయుడికి ఉపదేశించి, తనలో ఉండేటటువంటి జ్ఞానాంశను అతడిలో నిస్ఖిప్తంచేసాడు కృష్ణపరమాత్మ. కృష్ణాంశ, కృష్ణతత్త్వములోని అవతారరహస్యాన్ని ఇంకమరెవరికీ ఆయన ఇవ్వలేదు. మైత్రేయుడికే ప్రసాదించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
08 Feb 2021
No comments:
Post a Comment