సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
🌻 203. 'సర్వమయీ' 🌻
సర్వమూ తానై యున్నది శ్రీదేవి అని అర్థము. పై నామమున తెలిపిన ఈశత్వము హద్దు లేనిదై సృష్టి యంతయూ వ్యాపించి యుండును. సృష్టి రూపము ఆమె రూపమే. అందలి కోటానుకోట్ల జీవుల రూపము కూడ ఆమెయే.
అందు వర్తించు పంచభూతములు ఆమెనుండి పుట్టినవే. ఆయా జీవుల స్వభావము లన్నియూ వారి యందలి త్రిగుణములు సంమిశ్రమమై యుండగ అట్టి త్రిగుణములామె నుండి పుట్టినవే. ఆ జీవుల అస్థిత్వము కూడ ఆమెయే.
ఇట్లు అంతయూ ఆమెయే అయి వుండగ అట్టి అద్భుత దర్శనము కలిగి నపుడు సర్వమయీ అను నామము సత్యమై నిలచును. ప్రత్తి ఆధారముగ అనేకానేక వస్త్రములు, దుస్తులు, ఇతర వస్తువులు ఏర్పడుచున్నవి. ఈ వివిధత్వము కలిగిన సమస్త వస్తువులకు ప్రతియే ఆధారము కదా! ప్రతియే లేనిచో దుస్తులేమియు లేవు.
ప్రత్తియే ఇట్లు రూపాంతరము చెందినది. ఇది తెలియుట సులభము కాని సత్యలోకము నుండి భూలోకము వఱకూ చైతన్యమే త్రిగుణములుగను, జీవులుగను, జీవ రూపములుగను అల్లుకొని యున్నదని తెలియుటకు శ్రద్ధ కావలెను. దర్శన మగుటకు భక్తి కావలెను. భావన చేయుటకు ఓర్పు కావలెను. స్వభావము నిర్మలము కావలెను. అపుడే సర్వమయీ తత్త్వము తెలియనగును.
భువన మంతయూ రెండు వందల ఇరువది నాలుగు (224) లోకములుగ తంత్రము తెలుపుచున్నది. దీనిని 'భువనాధ్వము' అందురు. అట్లే శబ్దము 52 అక్షరములుగను, వర్ణములుగను తెలుపబడుచున్నది. దీనిని 'అక్షరాధ్వము' అందురు. మూలవిద్య నుండి పుట్టిన ఏడు కోట్ల మహా మంత్రములు శ్రీదేవి రక్తముగ తెలుపబడినది. దీనిని 'మంత్రాధ్వము' అందురు.
ఈ మంత్రముల గుంపులను శ్రీదేవి మాంస రూపముగ తెలుపుదురు. దీనిని 'పదాధ్వము' అందురు. పంచభూతములు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచ ప్రాణములు, పంచాంగములు, జీవుడు, దేవతల ఉచ్చారణముగ శబ్దము నుండి ఏర్పడినవి. దీనిని 'తత్త్వాధ్వము' అందురు. ఇట్లు పంచాధ్వములుగ శ్రీదేవియే వ్యాప్తి చెంది యుండుటచేత సర్వమునూ ఆమెయే అని తెలియనగును.
సర్వమయీ అనగా ఐదు మార్గములుగ శివ స్వరూపమును తెలుపుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 203 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Sarva-mayī सर्व-मयी (203) 🌻
She exists in all forms, the omnipresent nature of the Brahman. It would be appropriate to say that She exists in all the souls. Without soul, life cannot exist.
As discussed earlier, soul is different from the Brahman. Coming together of soul and the Brahman is creation, sustenance and dissolution. Sarva could also mean the thirty six tattva-s or principles, discussed later in this book.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Feb 2021
No comments:
Post a Comment