✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 5 🌻
646. మానవుడు దైవత్వ సిద్ధిని బడయుటకును, అటుపిమ్మట సాధారణ చైతన్యమును తిరిగి పొంది సద్గురువగుటకును కూడా, సద్గురువు యొక్క సహాయమే అవసరము.
647. సద్గురువు జ్ఞాన సూర్యుడగుటచే, తాను సంకల్పించినచో ఎవరికైనను రెప్పపాటు కాలములో మోక్షమును ప్రసాదించగలడు.
648. సద్గురువు నుండి నిస్సంగమును పొందినవాడు పరిపూర్ణుడగును.
649. సద్గురువు ఆరోగ్యముగా గాని, లేక అనారోగ్యముగా నున్నట్లు గాని సామాన్య మానవునకు కనపడును. కానీ నిజముగా సద్గురువు ద్వంద్వాతీతుడు కాబట్టి ద్వంద్వము లు అతని అనంతత్వమును స్పృశించనేరవు. ద్వంద్వానుభవము లన్నియు మాయ అని సద్గురువునకు తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Feb 2021
No comments:
Post a Comment