నమ్మకాన్ని కలిగించే ధ్యానం


🌹. నమ్మకాన్ని కలిగించే ధ్యానం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


ఒకవేళ నమ్మకం మీకు కష్టమనిపిస్తే మీరు మీ గత జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లాలి. ఆ జ్ఞాపకాలన్నీ పరమ చెత్త. మీ మనసు వాటితో నిండి బరువెక్కి పోయింది. దానిని శుభ్రం చేయాలంటే ముందు ఆ చెత్త బరువును దించుకోవాలి.

అందుకు మీరు పతిరోజు రాత్రి మీ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంత చిన్న నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే జరిగిన అనేక విషయాలను మన చైతన్యంలోకి ప్రవేశించకుండా మనం దాచేస్తూ ఉంటాం.

వాటిని మీ చైతన్యంలోకి ప్రవేశించనివ్వండి. అలా ప్రతిరోజు దానిపైన దృష్టి పెట్టి ఒక గంట ధ్యానం చెయ్యండి. అలా చేస్తున్నపుడు మీరు చాలా లోతుల్లోకి మీజ్ఞాపకాల లోతుల్లోకి వెళ్తున్నట్టు మీకు చాల ఆస్పష్టంగా తెలుస్తుంది. ఆ క్రమంలో మీరు నాలుగైదేళ్లు వయసులో ఉన్నపుడు జరిగిన విషయాలు మీకు జ్ఞాపకమొస్తాయి.

అంతకు మించి మీరు ముందుకు వెళ్లలేరు. ఐనా మీప్రయత్నాన్ని ఆపకుండా, మీ సాధనను కొనసాగిస్తే మీ రెండేళ్ల ప్రాయంలో జరిగిన విషయాలు గుర్తుస్తాయి. ఆ సాధనలో తల్లి గర్భంలో ఉన్నప్పటి జ్ఞాపకాలు తెలుసుకొన్నవారు, ఇంతకన్నా ముందుకెళ్లి గత జన్మలో ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించారో తెలుసుకొన్న వారు కూడా ఉన్నారు. తల్లి గర్భం నుంచి ఎంత కష్టపడి మీరు బయటపడ్డారో తెలుసుకోగలిగితే ఆ జ్ఞాపకం నుంచి మీరు బయటపడుతారు.

ఎందుకంటే దానిని మీరు దాదాపు పునర్జన్మగా భావిస్తారు. శిశువు పుట్టిన వెంటనే కొన్ని క్షణాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరియై ఏడుస్తారు. అపుడే ఆ శిశువుకు అన్ని దారులు తెరుచుకుంటాయి. ఊపిరాడడం, ప్రారంభమవుతుంది. సాధనలో మీరు కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు. అపుడు మీరు కూడా ఆ శిశువులా ముందుకు వెళ్లడం, వెనక్కి రావడం చేస్తూ ఉండాలి.

అపుడు ప్రతిరోజు మీ మనసులోని గత జ్ఞాపకాల బరువు తగ్గడం, దాని స్థానంలో నమ్మకం చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా మూడు నుంచి తొమ్మిది నెలల కాలంలో మనసు పరిశుద్ధమై మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇలా మీ జ్ఞాపకాలను మీరు తెలుసుకోగలిగితే వాటి నుంచి మీరు బయటపడుతారు.

చైతన్య రాహిత్యం మీకు బానిసత్వాన్ని సృష్టిస్తుంది. అవగాహన, మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి బయటపడేలా చేస్తుంది. అపుడే నమ్మకం కలిగేందుకు అవకాశముంటుంది.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2021

No comments:

Post a Comment