భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 181


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 181 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 3 🌻


685. అవతార పురుషుడు 56 బ్రహ్మీభూతులలో ఒకడు మాత్రము కాదు .56 గురి కంటే కంటే అదనము.

686. అవతార యుగ మందు అప్పుడు, సజీవులై యున్న సద్గురువులే వీరిలో కుతుబ్-ఏ-ఇర్షాద్ పూర్తి బాధ్యత గల సద్గురువు తన ఉద్యోగ ధర్మమును కార్య భావమును విశ్వ వ్యవహారముల నిర్వహించు సంపూర్ణ బాధ్యతను అవతార పురుషునికి అప్పగించి తాను వైదొలగి, తాను బ్రతికి యున్నంత కాలము తక్కిన నలుగురు సద్గురువుల వలనే సద్గురు కార్యాలయమును నిర్వహించును.

ఒకేఒక అవతారము :-

687. ఎల్లకాలమందు అదే అవతారము లేక, ఒకే అవతారము (ఏకైక అవతారము) ఉండును. ఎందుచేతననగా శాశ్వతుడు అవిభాజ్యుడు అనంతుడు అద్వయుడు అయినా భగవంతుడు స్వయముగా మానవ రూపములో పురుషునిగా, భూలోకములో జన్మించినప్పుడు అతనిని అవతారమనియు, మెసైయ, ప్రవక్త, బుద్ధ, రసూల్, సాహెబ్-ఏ-జమానా, మొహమ్మద్ అనియు సర్వోన్నతుడైన పురాణం పురుషుడనియు అందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




27 Feb 2021

No comments:

Post a Comment