శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 221 / Sri Lalitha Chaitanya Vijnanam - 221


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 221 / Sri Lalitha Chaitanya Vijnanam - 221 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥

🌻 221. 'మహావీర్యా' 🌻

మహత్తరమగు వీర్యము కలది శ్రీలలిత అని అర్థము.

వీర్యమనగా తేజస్సు అని, సామర్థ్యమని, శుక్రమని అర్థము కలదు. సృష్టి నిర్మాణమునందు శ్రీమాత సామర్థ్యము తెలియును. ఊహింప నలవికాని విధముగ మహత్తరమగు సృష్టి గావించినది. కోటానుకోట్ల జీవులు, కోటానుకోట్ల అభిరుచులు, స్వభావములు, నడకలు ప్రకృతి వలె నెవరు ఊహించగలరు. ఏమైనను మేధస్సునకు సహితము అందని విషయము సృష్టి నిర్మాణము.

శ్రీమాత సామర్థ్యము నకు ఆమె సృష్టి నిర్మాణమే తార్కాణము. శ్రీమాత తేజస్సు కూడ అట్టిదే. ఆమె తేజస్సే సూర్య మండలమున, సవితృ మండలమున, ఆదిత్య మండలమున ప్రకాశించు

చున్నది. ఆమె తేజస్సే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగ వెలుగుచు నున్నది.

త్రిమూర్తుల యందు భాసించునది ఆమె తేజస్సే. అచేతన, సచేతన రూపము లన్నిటియందు ఆమె తేజస్సే ప్రకాశించు చున్నది. అదే విధముగ శ్రీమాత సృజనాత్మక వీర్యము అన్ని జీవుల యందు భాసించి సృష్టిని పెంపొందించుచు నున్నది.

సామర్థ్యము, తేజస్సు, వీర్య సంపద, ఎచ్చోట కన్పడిననూ అది శ్రీమాత అస్థిత్వమే అని తెలియవలెను. అందులకే ఆమె మహావీర్య.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 221 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā-vīryā महा-वीर्या (221) 🌻

There are several meanings for the word vīrya. Generally it means courage, power, lustre, dignity, energy, etc. She is the reservoir of all these qualities and She provides these qualities to Her devotees depending upon the depth of devotion.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

No comments:

Post a Comment