దేవాపి మహర్షి బోధనలు - 44


🌹. దేవాపి మహర్షి బోధనలు - 44 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 30. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻


అంతలో వెనుక నుండి వాత్సల్య పూరితముగా ఒక హస్తము నా కుడి భుజముపై పడినది. శరీరము గగుర్పాటు చెందినది. వెనుకకు తిరిగి చూచితిని.

నా సేవకుడు బగలూ చిరునవ్వుతో, వాత్సల్యముతో ధైర్యముగా వెనుకనుండి నా భుజముపై తన హస్తము నిడుట నా కాశ్చర్యము కలిగించినది. అతడు అతిక్రమించి ప్రవర్తించినాడను భావన క్షణమాత్రము కలిగి అదృశ్యమైనది. బగలూ ఆప్యాయముతో యిట్లనెను.

“అమ్మా! ఈ దేశములో కోట్లాది ప్రజలు లక్షలాది సంవత్సరముల నుండి జీవించుచున్నారు. మీ ఆంగ్లేయులు ఈ దేశమునకు రాక పూర్వమునుండి కూడా వీరు సమగ్రమైన జీవనము కలిగి యున్నారు. తరింపు కూడా చెందుచునే యున్నారు. నిన్నూ-నన్నూ ప్రేమించిన దైవము సృష్టి ప్రారంభము నుండీ జీవులను ప్రేమించుచునే యున్నాడు.

దైవము యొక్క ప్రేమమార్గము దైవమునకు క్రొత్త కాదు, జిజ్ఞాసులగు జీవులకునూ క్రొత్త కాదు. ప్రేమ మార్గము క్రొత్తగా నేర్పడినది కాదు, అది సనాతనము. అది యీ దేశమున సనాతనముగా నున్నది.

మరల నా గురుదేవులు దేవాది మహర్షి ఈ రూపమున భారతదేశమున నా సేవకుని వలె నన్ను పరిరక్షించుచూ, నా అజ్ఞానపు పొరలను దగ్ధము చేసినారు. అతని సాన్నిధ్యమునకు సదా కృతజ్ఞురాలను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

No comments:

Post a Comment