వివేక చూడామణి - 33 / Viveka Chudamani - 33


🌹. వివేక చూడామణి - 33 / Viveka Chudamani - 33 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. ఆత్మ స్వభావము - 1 🍀


124. ప్రస్తుతము నేను నీకు నిజమైన ఆత్మ స్వభావమును గూర్చి చెప్పబోవుచున్నాను. దానిని తెలుసుకొన్న వ్యక్తి సాంసారిక బంధనాల నుండి విముక్తిని పొందగలుగుతాడు.

125. అహంకారము యొక్క పూర్తి ఎఱుక శాశ్వతమై సత్యమును తెలియజేస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను దర్శించునపుడు అవి శరీరము యొక్క పంచకోశముల తత్వములను ఎఱుక పరుస్తాయి. అవి

1. అన్నమయ కోశము,

2. ప్రాణమయ కోశము,

3. మనోమయ కోశము,

4. విజ్ఞాన మయ కోశము,

5. ఆనందమయ కోశము.

వీటిలో మొదటిది శరీరమునకు సంబంధించినది. తరువాత మూడు కోశములు సూక్ష్మ శరీరమునకు సంబంధించినవి. మరియు చివరిదైన ఆనందమయ కోశము కారణమయ శరీరమునకు చెందినది. ఆత్మ ఈ ఐదు కోశములకు వేరైనది.

126. ఎఱుక స్థితిలో జరుగుచున్న విషయములన్నియూ ఎదైతే తెలుసుకొంటుందో అదే కలలలోనూ, గాఢ నిద్రలోనూ తెలుసుకొంటుంది. అది ప్రస్తుత స్థితి యొక్క ఎఱుక మరియు మనస్సులేని స్థితి. దాని పనులు అహం యొక్క గత భావనలే. అదేమిటంటే .......

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 33 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Nature of Soul - 1 🌻


124. Now I am going to tell thee of the real nature of the supreme Self, realising which man is freed from bondage and attains Liberation.

125. There is some Absolute Entity, the eternal substratum of the consciousness of egoism, the witness of the three states, and distinct from the five sheaths or coverings:

126. Which knows everything that happens in the waking state, in dream and in profound sleep; which is aware of the presence or absence of the mind and its functions; and which is the background of the notion of egoism. –This is That.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

No comments:

Post a Comment