11) 🌹. శివ మహా పురాణము - 357🌹
12) 🌹 Light On The Path - 109🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241🌹
14) 🌹 Seeds Of Consciousness - 306🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 181🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 008🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Lalitha Sahasra Namavali - 36🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasranama - 36🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -159 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 8
*🍀 8 - 1. యోగ కారకములు - ఇంద్రియములను జయించినవాడు, జ్ఞానమును గ్రహించినవాడు, నిత్య జీవితమున ఆ జ్ఞానమును నిర్వర్తించి విజ్ఞానముతో కూడి తృప్తుడైనవాడు, మట్టి బంగారము మొదలగు లౌకికములగు విలువలను దాటినవాడు- ఇట్టి సద్గుణములతో కూడినవాడు యోగి అని చెప్పబడుచున్నాడు. జ్ఞానము కేవలము శాస్త్ర జ్ఞానముగనే ఉండి పోరాదు. అది అనుభవజ్ఞానమై నిత్యజీవనమున భాసింపవలెను. 🍀*
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8
జ్ఞాన సముపార్జన మానవునకు నిత్యా నిత్య వస్తు వివేకము కలిగించును. శాశ్వతము, తాత్కాలికము అగు విషయములను విశదపరచును. తాత్కాలికములతో కూడినవాడు తన నిజస్థితిని కోల్పోయి, అశాశ్వతుని వలె రకరకముల భ్రమలకు లోనగును. జనన మరణములు నిజమునకు జీవుని యాత్రలో ఘట్టములే గాని, ఆద్యంతములు కావు.
జ్ఞానము కలిగియున్నను అది దిన చర్య యందు విజ్ఞానముగ భాసింపనిచో తాను మరణించునని భయము కలుగును. జ్ఞానము కేవలము శాస్త్ర జ్ఞానముగనే ఉండి పోరాదు. అది అనుభవజ్ఞానమై నిత్యజీవనమున భాసింపవలెను. అట్టి వానికి శాశ్వత విలువలయందు ఆసక్తి, అశాశ్వతమగు విషయములందు అనాసక్తి సహజముగ ఏర్పడును.
అట్టివాడే తృప్తుడుగ జీవించగలడు. ఏ విషయమందు తృష్ణ యుండదు. నిత్య జీవితమున కాలమును, దేశమును బట్టి దరిచేరు సన్నివేశముల యందు కర్తవ్యము మేరకు నిర్వర్తించి తృప్తిగ జీవించు చుండును. యజ్ఞార్థముగ వర్తించు చుండును. అనగ పరుల హితము కొరకే ప్రధానముగ జీవించును.
నిత్యానిత్యములు తెలిసినవానికి, తమ కర్తవ్య నిర్వహణ మున నిలచినవానికి స్థిరత్వముండును. ఆకర్షణలు, వికర్షణలు అతనిని భ్రమ భ్రాంతులకు లోను చేయవు. ప్రజ్ఞ నిశ్చలముగ నుండును. ఇంద్రియములు కూడ అతని ననుసరించియే యుండును గాని, ఇంద్రియార్థముల వైపు పరుగిడవు. కర్తవ్యమునకు, పరహితమునకు, దివ్యారాధనమునకు ఇంద్రియములు, మనస్సు సహకరించును.
శరీరము, ఇంద్రియములు అతనిపై ప్రభావము చూపలేవు. అతడే వాని పై ప్రభావము చూపుచు, జ్ఞాన విజ్ఞానముల యందు నిలచియుండును. అట్టి స్థితప్రజ్ఞునకు మట్టి బెడ్డ, రాయి, బంగారమునందు ప్రధానముగ ప్రజ్ఞయే గోచరించును. లోకమంతయు ప్రజ్ఞా విలాసమే అను భావముండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 359 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
93. అధ్యాయము - 05
*🌻. మేనాదేవి వరములను పొందుట - 2 🌻*
మేన ఇట్లు పలికెను -
ఓ దేవీ! నేనీనాడు నీ రూపమును ప్రత్యక్షముగా చూచితిని. నిన్ను నేను స్తుతింపగోరుచున్నాను. ఓ కాళీ! ప్రసన్నురాలవు కమ్ము (18).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేన ఇట్లు పలుకగా, సర్వులను మోహింపజేయు ఆ కాళీ దేవి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలదై బాహువులతో ఆమెను కౌగిలించుకొనెను (19). అపుడు మేనకకు గొప్ప జ్ఞానము కలిగెను. ఆమె తన ఎదుట నున్న కాళికను, శివుని భక్తితో ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (20).
మేన ఇట్లు పలికెను -
మహామాయ, జగత్తును పోషించు తల్లి, లోకములను తన సత్తచే ధరించునది, మహాదేవి, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు చండికను నమస్కరించు చున్నాను (21).
శాశ్వతా నందమును ఇచ్చునది, యోగ నిద్రా స్వరూపిణి, జగత్తులను కన్నతల్లి, నిత్య సిద్ధురాలు, శుభకరములగు పుష్పముల మాలను ధరించునది అగు మహామాయకు నమస్కరించుచున్నాను (22).
తల్లులకు తల్లి, నిత్యానందరూపిణి, భక్తుల శోకముల నశింపజేయునది, కల్పక్షయము వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపములో ప్రకటమగునది అగు దేవికినమస్కరించుచున్నాను (23).
యతీశ్వరుల సంసార బంధమును ఛేదించు జ్ఞానము నీవే. నావంటి వారలు నీ ప్రభావము నెట్లు గానము చేయగలరు?అథర్వవేదములోని హింసా ప్రయోగము నీ స్వరూపమే. నీవు నిత్యము నాకు అభిష్టములగు కోర్కెల నీడేర్చుము (24).
ఆకారము లేనివి, కంటికి కనబడనివి, నిత్యానిత్యములు అగు భూతసూక్ష్మముల నుండి ఈ పాంచ భౌతిక జగత్తు కూర్చబడుచున్నది. నిత్యరూపిణి వగు నీవే వాటి యొక్క నిత్యశక్తివై ఉన్నావు. నీవు త్రిగుణ సంయోగముతో గూడి ఆయా కాలముల యందు సర్వసమర్థమగు స్త్రీరూపములో అవతరించెదవు (25).
జగత్తులు నీ నుండి యే పుట్టినవి. జగత్తు లను పోషించు తల్లివి నీవే. నీవు సనాతనురాలవు. నీవు ప్రకృతికంటె ఉత్కృష్టురాలవు. పరబ్రహ్మ స్వరూపము నీ అను గ్రహము చేతనే తెలియబడుచున్నది ఓ తల్లీ! అట్టి శాశ్వతురాలవగు నీవు నా యందీనాడు ప్రసన్నురాలవు కమ్ము (26). అగ్ని యందలి తీక్ణమగు ఉష్ణశక్తి నీవే. సూర్యకిరణముల యందలి తపింపచేయు శక్తి నీవే. సర్వత్ర వ్యాపించి ఆహ్లాదింప జేయు వెన్నెల నీవే. ఓ చండీ! అట్టి నిన్ను నేను నమస్కరించి స్తుతించుచున్నాను (27).
స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాంధిచెదరు. ఊర్ధ్వ రేతస్కులగు యోగుల నిత్యశక్తివి నీవే. సర్వప్రాణులలోని ఇచ్ఛాశక్తి నీవే. విష్ణువు యొక్క మాయ కూడా నీవే (28). ఓ దేవీ! నీవు స్వేచ్ఛచే వివిధ రూపములను ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయు చున్నావు. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరములకు హేతువు. నీవే. నీకు అనేక నమస్కారములు. నీవీ నాడు నన్ను అను గ్రహించుము (29).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దుఃఖముల నుండి తరింపజేయు ఆ కాలికా దేవి ఇట్లు స్తుతింపబడినదై మేనకా దేవితో'వరమును కోరుకొనుము' అని పలికెను (30).
ఉమాదేవి ఇట్లు పలికెను -
హిమవంతుని ప్రియురాలవగు నీవు నాకు ప్రాణ ప్రియురాలవు. నీవు దేనిని కోరినా నేను నిశ్చితముగా నీయగలను. నేను ఈయలేనిది ఏదీ లేదు (31). మహేశ్వరి యొక్క అమృత సమమగు ఈ మాటలను విని, హిమవంతుని ప్రియురాలగు ఆ మేన మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను (32).
మేన ఇట్లు పలికెను-
హే శివే! నీకు జయమగు గాక! హే ప్రాజ్ఞే!హే మహేశ్వరీ! హే అంబికే! నేను నీచే ఈయబడే వరములకు యోగ్యురాలనైనచో, నేను ఒక శ్రేష్ఠమగు వరమును కోరెదను (33). ఓ జగన్మాతా! ముందుగా నాకు వందమంది పుత్రులు కలిగెదరు గాక! వారు దీర్గాయువులు, బలవంతులు, సంపన్నులు, జ్ఞానము గలవారు అగుదురు గాక! (34).
ఆ తరువాత సుందర రూపముతో, గుణములతో ఒప్పారునది, పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి ఆనందమును కలిగించునది, ముల్లోకముల యందు పూజింపబడునది అగు కుమార్తెను నేను కోరుచున్నాను (35). హే శివే! దేవ కార్యము కొరకై నీవు నా కుమార్తె వై జన్మించి, రుద్రుని భార్యవు కమ్ము. ఓ అంబికా! నీ లీలలను ప్రదర్శించుము (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 109 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 2 🌻*
417. C.W.L. – People are almost always lop-sided in their development. Some are strong in devotion, some in intellect, some along the line of work.
Each man, according to his temperament, is taken naturally along the line which is easiest for him, yet he must not forget that all-round development is necessary before he can reach Adeptship. The Adept is above all things an all-round man, and if we are putting Him before us as an ideal, we ,must do what we can to develop ourselves in various directions.
It is a fine thing to be full of devotion, but we must have knowledge along with it, because the man who is merely blindly devoted is of little use. The converse is true of those who advance by intellect. They must also take care to acquire devotion, otherwise their intellectual development will lead them astray.
It is better to develop along one line than not to develop at all, but while every man should pursue his own line, he should nevertheless remember that there are other lines. Often the tendency is to criticize other paths, and to feel that they may be less useful than our own. They would be less useful to us, perhaps, but are not at all so to those who are following them.
Wherever we may be at present in our development we shall certainly have to become balanced, so if now we appreciate only the idea of work we shall nevertheless presently have to realize the position of the man who advances by wisdom, and again that of him who progresses by devotion, and not allow ourselves to think them less immediately useful than we are. I am afraid that the people who advance by devotion are often a little intolerant of those who wish to study and to work.
They sometimes say: “All that you are doing belongs to the outer plane or to the purely intellectual side of things, whereas the heart side of everything is always the more important, and if you neglect that you can make no real progress.”
It is perfectly true that the heart side must be developed, but nevertheless there are those who advance best through definite work, and others who cannot evoke from themselves the best that is within them without careful study and full understanding.
418. Men sometimes feel drawn to the higher life, and devote themselves to contemplation only. There are occultists who hold that to be the best way, at least in the early stages. A man might say: “I must first develop myself in order that I may be able to serve. When I am an Adept I shall serve perfectly; I shall make no mistakes.”
But there is work to do at all levels, and the man who has qualified as an Adept has to work at very much higher levels than any we can reach; therefore if we wait until Adeptship is attained before we are willing to work for the world, a great deal of the lower work will in the meantime be left undone.
Our Masters are working chiefly on the nirvanic level, on the egos of men by the million. They are doing at that higher level what we could not do, but there is a very great deal to do on the lower planes which we can do.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 5 🌻*
31. ఈ యథార్థ సంసారజీవనవిధానం కర్మయొక్క రచన. దానిని విమర్శనాదృష్టితో చూడటం విమర్శకారిత్వం. తను అందులో ఎందుకు లీనంకావాలి? అది తనను అనుభవించటం లేదు. తనెందుకు దానిని అనుభవించాలి? తాను యథార్థస్థితిలో సాక్షివలె చూడాలి.
32. అప్పుడు అది బంధనహేతువు కాదు. అది ఈతడిని ఏమీ చేయలేదు. కీర్తి, అపకీర్తి, విమర్శ, ప్రశంశ, రావటం, పోవటం, ధనం రావటం, పోవటం ఇవన్నీ కూడా తాను అనుభవించేదికాదు. అనుభవించినా తాదాత్మ్యతతో కాదు. అది వేరి, తాను వేరు.
33. “నేను నేనే! నాతోనే నేనుంటాను. నేణు ఇంక దేనితోనూ ఉండను. దేనియందూ నాకు సంగబుద్ధి లేదు. నాకు నాయందే సంగబుద్ధి” అని ఉండాలి. ప్రకృతిని చూచి భయపడి పారిపోవలసిన అవసరంలేదు. సంసారానికి భయపడి ఎక్కడికి పారిపోయినా, మనస్సులో అనుసరిస్తూనే ఉంటుంది సంసారం. నమసు ఇక్కడే ఉంతుంది. ఇది మనసులోకి వచ్చి ప్రవేశిస్తుంది.
34. నిస్సంగత్వం, నిర్మోహత్వం ఈ సంసారంలో ఉండికూడా సాధ్యమే. ఏ వస్తువునందు తనకు ఉపరతి కలుగుతుందో – బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే నిర్గుణమైన బ్రహ్మవస్తువే కావచ్చు – దేనియందైతే అతడు శ్రద్ధ వహించి ఉంటాడో అక్కడికి వెళ్ళగలడు!
35. అట్టివారు (మహర్షులు) త్రిలోకసంచారులు అయ్యారు అంటే అర్థం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి నిర్గుణమైన బ్రహ్మలో లయం పొందుతారు కొద్దిసేపు. మళ్ళీ వస్తారు. శివధ్యానం చేస్తారు. కైలాస ప్రాప్తి కలుగుతుంది. కాసేపు విష్ణులోకానికి వెళతారు. మళ్ళీ మనుష్యుల్లో కొంతసేపు తిరుగుతారు. అంటే స్వతంత్రులు అని అర్థం. ఆనందస్వరూపులై ఉంటారు.
36. తపోలోక జనోలోక మహర్లోకాదులన్నీ కూడా కర్మలోకములు కావు. స్వతంత్రమైన జీవలక్షణం కలిగినవాళ్ళు ఆత్మపరిధిని పొంది అక్కడే ఉండవచ్చును. వాళ్ళకు ఆ లోకంలో స్థానాలున్నాయి. వారు నిరాశ్రయులు కారు. లోకానుగ్రహకాంక్షతో ఇతరులను ఉద్ధరించే లక్షణం కలిగి ఉంటారు.
37. యాజ్ఞవల్క్యుని భార్యలు ఆయనను అంత్యకాలంలో “జరా మృత్యువులు లేని మోక్షమార్గాన్ని తెలియచెప్పమన్నారు”. అందుకు ఆయన, “భర్త భార్యకు ప్రియుడు అంటాముకాని, ఆత్మకొరకే ప్రియుడు. అంటే, తనకొరకే ప్రియుడు అవుతున్నాడు. అంటే, భార్యను భర్త ప్రేమించటం తన ఆనందం కోసమనే, ఎవరూ ఎవరినీ, నిస్వార్థంగా ప్రేమించరు. తమకొరకే వాళ్ళను ప్రేమిస్తారు.
38. పుత్రమిత్రాదులనే కాక, సంస్తాన్నీకూడా ఆత్మప్రయోజన్మ్ కోసమనే ఎవరైనా ప్రేమిస్తారు. ‘అందుచేత, నాకొరకే, నేనే అంటున్నావు కదా! ఎవరీ నేను!’ వినేది, మననం చేసేది అంతా ఆత్మయే అని (ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో).
39. పరమాత్మ సకలానికీ కారణం. ఈ వేదశాస్త్రాలన్నీ ఆ పరమాత్మయొక్క నిట్టూర్పులే!. అజ్ఞానం చేత ఆత్మకు దేహేంద్రియాత్మకమైన జీవభావం కలిగిందని చెప్పాడు. ఆత్మజ్ఞానమే అమృతత్వమని వారికి బోధించి, తాను సన్యసించి వెళ్ళిపోయాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 306 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 155. To stabilize in the 'I am', which has no name and form, is itself liberation. 🌻*
As you come back to the 'I am' in its purest form, i.e. as it was in its nascent state, and get stabilized there you become devoid of name and form. The nascent 'I am' is common to all, does not belong to anybody and has no name or form.
You have been in this state in the very early stages of your life when you prevailed in the 'I am' only and knew nothing else. Apply your mind and try to recollect it and then try to live it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 181 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 3 🌻*
685. అవతార పురుషుడు 56 బ్రహ్మీభూతులలో ఒకడు మాత్రము కాదు .56 గురి కంటే కంటే అదనము.
686. అవతార యుగ మందు అప్పుడు, సజీవులై యున్న సద్గురువులే వీరిలో కుతుబ్-ఏ-ఇర్షాద్ పూర్తి బాధ్యత గల సద్గురువు తన ఉద్యోగ ధర్మమును కార్య భావమును విశ్వ వ్యవహారముల నిర్వహించు సంపూర్ణ బాధ్యతను అవతార పురుషునికి అప్పగించి తాను వైదొలగి, తాను బ్రతికి యున్నంత కాలము తక్కిన నలుగురు సద్గురువుల వలనే సద్గురు కార్యాలయమును నిర్వహించును.
ఒకేఒక అవతారము :-
687. ఎల్లకాలమందు అదే అవతారము లేక, ఒకే అవతారము (ఏకైక అవతారము) ఉండును. ఎందుచేతననగా శాశ్వతుడు అవిభాజ్యుడు అనంతుడు అద్వయుడు అయినా భగవంతుడు స్వయముగా మానవ రూపములో పురుషునిగా, భూలోకములో జన్మించినప్పుడు అతనిని అవతారమనియు, మెసైయ, ప్రవక్త, బుద్ధ, రసూల్, సాహెబ్-ఏ-జమానా, మొహమ్మద్ అనియు సర్వోన్నతుడైన పురాణం పురుషుడనియు అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 008 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 8 🌻*
08. భవాన్ భీష్‌మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయ: |
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తిస్తథైవ చ ||
తాత్పర్యము :
యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
భాష్యము :
దుర్యోధనుడు తన తరపు యోధుల గురించి, ప్రత్యేకించి ఓటమి ఎరుగని వారిపేర్లను తెలుపనారంభించె ను. అందు వికర్ణుడు, దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ, ద్రోణాచార్యుని తనయుడు. సౌమదత్త, బాహ్లికుల రాజు. కర్ణుడు, కుంతీపుత్రుడు, పాండురాజును వివాహమాడక ముందు పుట్టినవాడు. అలాగే కృపాచార్యుని కవల చెల్లెలు ద్రోణాచార్యుని భార్య.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 36. మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।*
*కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥ 🍀*
🍀 88. మూలమంత్రాత్మికా -
మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
🍀 89. మూలకూట త్రయకళేబరా -
మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
🍀 90. కులమృతైక రసికా -
కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
🍀 91. కులసంకేత పాలినీ -
కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 36. mūla-mantrātmikā mūlakūṭatraya-kalebarā |*
*kulāmṛtaika-rasikā kulasaṁketa-pālinī || 36 || 🌻*
🌻 88 ) Moola manthrathmikha -
She who is the meaning of Moola manthra (root manthra) or She who is the cause
🌻 89 ) Moola kooda thraya kalebhara -
She whose body is the three parts of the basic manthra i.e. pancha dasakshari manthra
🌻 90 ) Kulamruthaika rasika -
She who enjoys the ecstatic state of oneness of one who sees, sight and what is seen or She who gets pleasure in drinking the nectar flowing from the thousand petalled lotus below the brain.
🌻 91 ) Kula sanketha palini -
She who protects the powerful truths from falling into unsuitable people.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasra Namavali - 36 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 4వ పాద శ్లోకం - నిత్యం 108 సార్లు*
*🌻 36. స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః।*
*వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః॥ 🌻*
అర్ధము :
🍀 327) స్కంద: -
అమృత రూపమున స్రవించువాడు.
🍀 328) స్కందధర: -
ధర్మమార్గమున నిలుపువాడు.
🍀 329) ధుర్య: -
సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.
🍀 330) వరద: -
వరముల నొసగువాడు.
🍀 331) వాయువాహన: -
సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింప చేయువాడు.
🍀 332) వాసుదేవ: -
అంతటను నిండియున్నవాడు.
🍀 333) బృహద్భాను: -
ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
🍀 334) ఆదిదేవ: -
సృష్టి కార్యమును ప్రారంభించిన వాడు.
🍀 335) పురంధర: -
రాక్షసుల పురములను నశింప చేసిన వాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 36 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Karkataka Rasi, Aslesha 4th Padam*
*🌻 36. skandaḥ skandadharō dhuryō varadō vāyuvāhanaḥ |*
*vāsudevō bṛhadbhānurādidevaḥ purandaraḥ || 36 || 🌻*
🌻 327. Skandaḥ:
One who drives everything as air.
🌻 328. Skanda-dharaḥ:
One who supports Skanda or the righteous path.
🌻 329. Dhuryaḥ:
One who bears the weight of the burden of all beings in the form of birth etc.
🌻 330. Varadaḥ:
One who gives boons.
🌻 331. Vāyuvāhanaḥ:
One who vibrates the seven Vayus or atmospheres beginning with Avaha.
🌻 332. Vāsudevaḥ:
One who is both Vasu and Deva.
🌻 333. Bṛhadbhānuḥ:
The great brilliance.
🌻 334. Ādidevaḥ:
The Divinity who is the source of all Devas.
🌻 335. Purandaraḥ:
One who destroys the cities of the enemies of Devas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment