శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 220 / Sri Lalitha Chaitanya Vijnanam - 220


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 220 / Sri Lalitha Chaitanya Vijnanam - 220 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥


🌻 220. 'మహైశ్వర్యా' 🌻

ఈశ్వరత్వము, వైభవము కలది శ్రీమాత అని అర్థము. ఆమె మహేశ్వరి. అతడు మహేశ్వరుడు, వారిపై స్వామిత్వము వహించు వారెవ్వరూ లేరు. వారే సమస్తమునకు స్వామిత్వము కలిగి

యున్నారు. బ్రహ్మర్షులు, యోగీశ్వరులు, మహర్పులు, యోగులు, ఋషులు, జ్ఞానులు అట్టి ఈశ్వరత్వమునే వాంఛింతురు. అట్టివారికి కూడ శివ, శక్తులే స్వామిత్వము వహింతురు.

కేవలము ఈ శబ్దమే గాక మహత్తరమగు సంపద కలవారు శివా శివులు. వారి వైభవము, విభూతి ఇంత అని ఎవరూ తెలుపలేరు. శివుని విభూతికి సమానమైన సంపద సృష్టియందు లేదని పురాణములు తెలుపుచున్నవి. సామాన్యముగ విశిష్టమగు భోగు లుందురు, కాని వారు యోగుల కానవసరములేదు.

అట్లే విశిష్ట మగు యోగు లుందురు, వారికి భోగవైభవ ముండక పోవచ్చును. యోగ భోగములు పరిపూర్ణముగ నున్నవారే ఐశ్వర్యవంతులు. అదియే పరిపూర్ణ ఆనందము నిచ్చును. అట్టి ఐశ్వర్యవంతులకు కూడ నాయకి శ్రీమాత. కావున ఆమె మహైశ్వర్య.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 220 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahaiśvaryā महैश्वर्या (220) 🌻

She depicts the all pervading attribute of the Brahman, the manifestation of universe. This is called vibhūti, the supra normal splendour of the Brahman. She is the svātantryaya śakti (the power of autonomy, the Absoslute freedom, vimarśa śakti) of Śiva and She manifests the universe through this power.

Kṛṣṇa says in Bhagavad Gīta (X.18, 19), “there is no limit to my magnitude. I am the universal Self seated in the heart of all beings; so I alone am the beginning and middle and also the end of all beings.”

Iśvaryā means wealth, the wealth in the form of Her grace.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

No comments:

Post a Comment