దేవాపి మహర్షి బోధనలు - 43


🌹. దేవాపి మహర్షి బోధనలు - 43 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 30. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻


నేను భారతదేశమున నుండగా నా సపర్యలకై ఒక సేవకుడు నియమితుడయ్యెను. అతని పేరు బగలూ. అతడు వ్యక్తిగతముగ నాకు కావలసిన సదుపాయములను, సౌకర్యములను అప్రమత్తుడై జాగ్రత్తగా చూచుకొను చుండెడివాడు. అతడు వయస్సున వృద్ధుడు. తెల్లని పొడుగాటి గడ్డము అతని కుండెడిది. అతడు నా దగ్గరుండగా యితరుల నెవరినీ నా పనులను చేయుటకు అనుమతించెడి వాడు కాదు.

అతనికి నాయందు గల శ్రద్ధ, వాత్సల్యము, నాకాశ్చర్యము కలిగించు చుండెడివి. ప్రాతఃకాలము నుండి రాత్రి నిద్రించువరకూ నా పరిరక్షకుడుగా నన్ను కాపాడుచుండెడివాడు.

ఒకరోజు ముంబళ గ్రామమున నున్న నా నివాస గృహము యొక్క పై అంతస్తు వసారా నుండి రహదారిలో పోవుచున్న హిందువులనూ, మహమ్మదీయులను, పఠానులను, శిక్కులను, రాజపుత్రులను, ధనవంతులను, పేదలను, స్త్రీలను, పురుషులను, పిల్లలనూ చూచు చుంటిని.

రహదారి యందలి జనప్రవాహము అంతులేక సాగు చుండగా నాలో భావ పరంపర లుద్భవించినవి. వీరందరికీ ఏసుక్రీస్తు గురించి తెలియదుకదా! వీరెట్లు ఉద్దరింపబడగలరు? క్రీస్తు ప్రేమతత్వ మందనిదే వీరికి తరణోపాయమేమి కలదు? వీరికి క్రీస్తు మార్గమును తెలుపుట ఎట్లు? అను భావ పరంపరలు తీవ్రముగ నన్ను వెంటాడినవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

No comments:

Post a Comment