26-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 158🌹  
11) 🌹. శివ మహా పురాణము - 356🌹 
12) 🌹 Light On The Path - 108🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240🌹 
14) 🌹 Seeds Of Consciousness - 305🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 180 🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 007🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 35 / Lalitha Sahasra Namavali - 35🌹 
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasranama - 35🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -158 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 7

*🍀 7 - 2. ఆత్మ తత్వము - జిజ్ఞాస ఎవరికుండునో అతడికే యోగవిద్య. యోగమునందు అవరోహణము, ఆరోహణము తెలుప బడినది. “నేను" అను ప్రజ్ఞ బుద్ధిలోనికి, మనస్సులోనికి (స్వభావములోనికి), యింద్రియముల లోనికి, శరీరములోనికి దిగి వచ్చుట అవరోహణము. మరల శరీరము యింద్రియము, మనస్సు దాటి బుద్ధిని చేరి అటుపై తానుగ నుండుట ఆరోహణము. మానవులు సహజముగ మనస్సు వరకు ఆరోహణము చేయగలరు. తమ స్వభావమును తాము దాటినపుడే బుద్ధిలోనికి ప్రవేశించుట జరుగును. ఈ శ్లోకమున 'జితాత్మనః' అను పదము ప్రారంభమున వాడబడినది. అనగా జయింపబడిన ఆత్మ అని అర్థము. ఇచ్చట స్వభావము పై జయమే చెప్పబడినది. 🍀*

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7


బుద్ధియందు ప్రవేశించినపుడు బుద్ధిమంతు డందురు. ఆలోచనల యందున్నపుడు ఆలోచనాపరు డందురు. ఆలోచనలు మనస్సు ద్వారా వచ్చు చుండును. 

మనస్సు ప్రధానముగ జీవించు చున్నపుడు మానవుడందురు. అట్లే అహర్నిశలు యింద్రియ పరితృప్తికై, యింద్రి యార్థముల కొరకు శమించువానిని కాముకు డందురు. కేవలము శరీర శ్రమయే చేయగలుగుట అను స్థితియందున్నపుడు శ్రామికుడందురు. ఆయా కక్ష్యలలో ప్రవేశించినపుడు ఆయా నామములు వాడుచున్నాము. కాని యివి యేమియు తాను కాదు.

ఒక గృహస్థు యింటియందున్నపుడు యజమాని. భార్యతో నున్నపుడు భర్త. పిల్లలతో నున్నపుడు తండ్రి. తల్లిదండ్రులకు కుమారుడు. అన్నదమ్ములకు సోదరుడు. కార్యాలయమున కేగి నపుడు అధికారి, గుమస్తా, ప్యూను యిత్యాదిగ గుర్తింపబడును. స్నేహితులు స్నేహితుడుగ గుర్తింతురు. ఇన్నిటి యందు తా నెవరు? తాను యజమానియా? అన్ని సన్నివేశముల యందు తాను యజమాని కాదు గదా! అట్లే తాను భర్తయా? తండ్రియా? సోదరుడా? అధికారియా? స్నేహితుడా? ఇవి ఏవియు తాను కాడు.

సన్నివేశమును బట్టి యజమాని, భర్త, సోదరుడు యిత్యాదిగ తెలియ బడుచున్నాడు. నీ వెవరవు? పై తెలిపిన మానవుడవా? శ్రామికుడవా? యజమాని, భర్త, సోదరుడు యిత్యాది స్థితియా? ఇవి యేవియు కావని, అన్నియు ఆయా సందర్భమును బట్టి తాత్కాలిక సత్యము
లని తెలియును. 

ఇవి కాక తా నెవరు? నీ వెవరవు అను ప్రశ్నకు, నేను అప్పారావు, సుబ్బారావు, సోమేశ్వరరావు అని తెలుపుచుందురు. అదికూడ నీవు పుట్టిన తరువాత పెట్టిన పేరేగాని, నీవు అంతకుముందు కూడ యున్నావు గదా! ఆ పేరు పెట్టకముందు నీ వెవరవు? "నే నున్నాను, నే నున్నాను" అనుచుందువే. నేనుండుట అనగా ఏమి? నీ వెట్లున్నావు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానము తెలుసుకొనవలెనను జిజ్ఞాస ఎవరికుండునో అతడికే యోగవిద్య.

యోగమునందు అవరోహణము, ఆరోహణము తెలుప బడినది. “నేను" అను ప్రజ్ఞ బుద్ధిలోనికి, మనస్సులోనికి (స్వభావములోనికి), యింద్రియముల లోనికి, శరీరములోనికి దిగి వచ్చుట అవరోహణము. 

మరల శరీరము యింద్రియము, మనస్సు దాటి బుద్ధిని చేరి అటుపై తానుగ నుండుట ఆరోహణము. మానవులు సహజముగ మనస్సు వరకు ఆరోహణము చేయగలరు. తమ స్వభావమును తాము దాటినపుడే బుద్ధిలోనికి ప్రవేశించుట జరుగును. 

ఈ శ్లోకమున 'జితాత్మనః' అను పదము ప్రారంభమున వాడబడినది. అనగా జయింపబడిన ఆత్మ అని అర్థము. ఇచ్చట స్వభావము పై జయమే చెప్పబడినది. 

తన స్వభావమును తాను జయించుటకు వలసిన సూత్రములన్నియు ముందు అధ్యాయములో తెలుపబడినవి. వాటిని పాటించినపుడు స్వభావము పై జయము కలుగును. అట్టివానికే ప్రశాంతి కలుగును. మనస్సులో నున్నపుడు అప్పడప్పుడు శాంతి కలుగవచ్చును. శాంతి వేరు, ప్రశాంతి వేరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 358 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
93. అధ్యాయము - 05

*🌻. మేనాదేవి వరములను పొందుట - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

దుర్గాదేవి అంతర్థానమై, దేవగణములు తమ గృహములకు వెళ్లిన తరువాత ఏమయ్యెను?(1) మేనా హిమవంతులు తీవ్రమగు తపస్సును చేసిన తీరు ఎట్టిది ? తండ్రీ! ఆయనకు మేన యందు కుమార్తె ఎట్లు జన్మించెను? ఆ వృత్తాంతమును చెప్పుము (2).

బ్రహ్మఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణ పుంగవా! దేవశ్రేష్ఠా! ఆ గొప్ప చరితమును వినుము. భక్తిని పెంపొందించే ఆ చరితమును శంకరునకు భక్తితో నమస్కరించి చెప్పెదను (3). కుమారా! విష్ణువు మొదలగు దేవతల గణము ఉపదేశించి వెళ్లిన తరువాత ఆ పర్వతరాజు, మేనతో కలిసి గొప్ప తపస్సును చేసెను (4). 

ఆ దంపతులు రాత్రింబగళ్లు ఉమాశంకరులను స్మరిస్తూ. భక్తితో నిండిన మనస్సుతో ప్రతిదినము చక్కగా ఆరాధించిరి(5). హిమవంతుని ప్రియురాలగు ఆ మేన ప్రీతితో దేవిని పూజించెను. శివుని కూడ మిక్కిలి ప్రీతితో పూజించెను. మరియు శివా శివుల సంతోషము కొరకై ఆమె నిత్యము బ్రాహ్మణులకు దానములను చేసెను (6).

సంతానమును గోరు ఆ మేన చైత్ర మాసము నందారంభించి ఇరవై ఏడు సంవత్సరములు ప్రతి దినము శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించెను (7). ఆమె అష్టమినాడు ఉపవాసమును చేసి, మరునాడు నవమి యందు గానములను చేసెను. ఆమె ఓషది ప్రస్థనగరములో గంగా తీరము నందు మట్టితో ఉమయొక్క మూర్తిని చేసి, మోదకములు, అన్న పిండములు, పాయసము, గంధము పుష్పములు ఇత్యాది అనేక పూజాద్రవ్యములను సమర్పించి ఆరాధించెను (8,9). ఆమె ఒకప్పుడు ఆహారమును తీసుకోకుండా, మరియొకప్పుడు వ్రతమును పాలించునదై, మరియొకప్పుడు గాలిని భుజించి, ఒకప్పుడు జలమును మాత్రమే త్రాగి ఆరాధించెను (10).

గొప్ప తేజశ్శాలిని యగు ఆ మేన ఉమపై మనస్సును లగ్నము చేసి, ఇరవై ఏడు సంవత్సరములు ప్రీతితో గడిపెను (11). జగత్స్వరూపిణి, జగన్మాత, శంకరపత్ని యగు ఉమ ఇరవై ఏడు సంవత్సరముల తరువాత మిక్కిలి ప్రీతురాలాయెను (12). 

పరమేశ్వరి యగు ఆ దేవి ఆమె గొప్ప భక్తికి మిక్కిలి సంతసించి ఆమెను అను గ్రహించుట కొరకై ఆ మేనా దేవి యెదుట సాక్షాత్కరించెను (13). ప్రకాశించే అవయవములతో గూడి తేజో మండల మధ్యములో నున్న ఆ దేవి మేన యెదుట ప్రత్యక్షమై చిరునవ్వుతో నిట్లనెను (14).

దేవి ఇట్లు పలికెను -

ఓ మహాసాధ్వీ! నీ మనసులోని కోర్కెను వెల్లడించుము. ఓ హిమవత్పత్నీ! నీ తపస్సుచే నేను చాల ప్రసన్నురాలనైతిని (15). ఓమేనా! నీవు దేనిని గొరి తపస్సును, వ్రతములను, సమాధిని అనుష్ఠించితివో ఆ సర్వమును నేను నీకు ఈయగలను (16). అపుడా మేనక తన ఎదుట ప్రత్యక్షమైన కాళీదేవిని చూచి, నమస్కరించి, అపుడిట్లనెను (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 108 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 1 🌻*

 413. 20. Seek it not by any one road. To each temperament there is one road which seems the most desirable. But the way is not found by devotion alone, by religious contemplation alone, by ardent progress, by self-sacrificing labour, by studious observation of life. None alone can take the disciple more than one step onwards. All steps are necessary to make up the ladder.

414. A.B. – Rule 20 is the comment by the Chohan on the three short aphorisms 17 to 19, which were considered in the last chapter. It tells us that a man has not to develop only on that line where he finds the least resistance, but must unfold his powers on every line before he reaches the universal goal of usefulness. 

His aim is to be a perfect instrument of the Good Law, and no man can become that unless he grows along every line. Each type or temperament must therefore supply what is lacking in itself before perfection can be achieved. 

Humanity reaches the goal not by devotion, nor by religious contemplation, nor by self-sacrificing labour, nor by observation and deep thought alone. Ultimately we shall all need to have all these things, but while on the way people are limited by their temperaments, and for a long time to come the work of each disciple in helping humanity is likely to be limited chiefly to one of these ways.

415. It is clear why we must master all the ways. As men advance they must draw nearer together, must become welded into an organic whole. So if a man possessed great power of religious contemplation, but very little of the other powers it would be of little use for him to come into contact with a man possessing chiefly the quality of self-sacrificing labour. 

He could not meet him on that ground, and that would limit his usefulness. So it is desirable that while the disciple is striving to perfect himself on his special line of work, is seeking to learn everything about something, he should at the same time not neglect to learn something about everything, so as to be able to make full contact with people of different temperaments with whom he must work.

416. The key-note is balance; we must be able to work to some extent on all lines. Toleration also is wanted, that we may be able to help all. We must see each man’s way as right for him – as one of the roads leading onwards it has to be recognized as good. 

We must have respect for all types of people, and until we are able to help them all ourselves we should try to guide those whom we cannot help, to others who can help them, and not disparage the roads on which they are going, and seek to turn them into our own.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 4 🌻*

24. పురుషోత్తముడు అని పరమేశ్వరుడికి పేరు. షడ్వింశతి తత్త్వమని సాంఖ్యదర్శనం చెప్పినదానిని – ప్రతి మహర్షీ చెప్పాడు. యోగము చెప్పని ఋషిలేడు. ఋషులందరూ చెప్పారు. అంటే, అది(ప్రకృతి) ఉన్నది కాబట్టి చెప్పారు. 

25. ప్రకృతిని కాదని ఎవరనగలరు? ప్రకృతి పురుషుణ్ణి చూడదు. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? అహంకారం. జీవాహంకారం వరకూ ఉండే ప్రకృతి, పరుడైన పురుషుణ్ణి చూస్తుందా? ప్రకృతి ప్రకృతినే చూస్తుంది. ఆ లోపల అంతరాత్మలో ఉండే పరమపురుషుడు ప్రకృతిని చూస్తూ ఉంటాడు. 

26. కానీ ఆ అంతరాత్మ యందుండేటటు వంటి పురుషుడు అని చెప్పబడే జీవి, ప్రకృతిని చూస్తున్నంత సేపూ తనను తాను చూచుకోదు. మోక్షము, ముక్తి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ పురుషుడు యథార్థంగా నిస్సంగుడే! కాని అతడు, ప్రకృతిని చూచే స్థితిలో భోక్తవలె ఉండటంచేత, అన్నిటికీ అతీతమై నిరంజనుడైన వాడైనప్పటికీ, అతడు దీనిని చూచి దీని యందు శ్రద్ధ వహించి ఉండటంవలన, తనను తాను చూడటం మరచిపోయాడు. కాబట్టే బద్ధుడైపోయాడు. స్వస్వరూపజ్ఞానం తెలుసుకుని ముక్తుడు ప్రకృతినుంచి విడిపోవాలి.

27. ఇది అనిత్యమైనటువంటిది. నిత్యము, అనిత్యము కూడా కానిది. అనిత్యత్వము నిత్యంగా కలిగిన ప్రకృతి ఇది. క్షణక్షణమూ ప్రతీ వస్తువు కూడా ఉన్నట్లు కనిపించి నశించిపోతోంది. ఇటువంటి అనిత్యత్వం నిత్యంగా ఉంది. నిత్యమైన అనిత్యవస్తువుల యందు తాదాత్మ్యత పొందటం చేత, ఈతడు ఎప్పుడూ అనిత్యుడు అవుతూనే ఉన్నాడు. ఎప్పుడూ మరణం పాలు పడుతున్నాడు. 

28. మృత్యువు వచ్చి, తాను అమర్త్యుడననే తన స్వస్వరూప స్తిథి జ్ఞాపకం రావటం లేదు. మృత్యువు లేనివాడు మృత్యువును అనుభవిస్తున్నాడు. దానియందు ఆత్మారోపణం. అది తనను ఏమీ చెయ్యటంలేదు. తానే దానిలో ప్రవేశించాడు.

29. సంగీతం పాడేవాడు, నాట్యం చేస్తున్నవాడూ మనను చూస్తున్నారా? మనం కదా వాళ్ళను చూస్తున్నాం! కాని, వాళ్ళు మనలో బుద్ధిపూర్వకంగా ప్రవేశిస్తున్నారా! ఎవరు ఎవరియందు తాదాత్మ్యత పొందారు అనేది ప్రశ్న. మనం ప్రకృతియందు తాదాత్మ్యతపొందినా, ప్రకృతి మనలో ప్రవేశించలేదు. ప్రవేశించజాలదు. దానికి ఇందులో ప్రవేశంలేదు. పురుషుణ్ణి ప్రకృతి చూడదు. 

30. అలాగే ప్రకృతివిషయంలో తాదాత్మ్యత లేకుండా దానిని చూదవచ్చు. అందులో, ఇది ప్రకృతి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సుఖము, ఇది నిన్నటి దుఃఖము, ఇదే రేపు మళ్ళీ సుఖము – ఇలా దానిని విశ్లేషణ చేయవచ్చు. తాదాత్మ్యత పొందనక్కరలేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 305 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 154. The conviction that the 'I am' and the world never existed can happen only to 'Parabrahman' (The Absolute). 🌻*

As you abide in the 'I am' after fully understanding it or earnestly doing the 'Sadhana' (practice) as prescribed by the Guru, a moment comes when you transcend the 'I am'. On this happening both the 'I am' and the world disappear and you enter the Absolute or 'Parabrahman' state. 

Only in this state will you have the conviction that the 'I am' and the world never existed. The Guru is in that state, he has gone beyond the 'I am' and this world, he is only using the 'I am' or his 'being' to communicate with anybody who comes to him.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 180 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 2 🌻*

అవతారయుగము :-
682. అవతారయుగమందు సత్యస్థితిలో పరమాత్మ B స్థితియందున్న అనంత చైతన్య సృష్టిలో సరాసరి భూమిమీద మానవునిగా పురుషరూపములో ప్రత్యక్షమగుచున్నది. భగవంతుడు యీ విధముగా సరాసరి భూమికి దిగుటకు సామాన్యముగా అవతరించుట యందురు. ఇట్లు అవతరించిన భగవంతుడే అవతార పురుషుడు.

683. అవతారయుగము 700సం. నుండి 1400సం. వరకు ఉండును. అవతార యుగములో పదునొకండు కాలము లుండును. ప్రతి కాలమందును ఐదుగురు సద్గురువులుందురు. అవతార యుగాంత్యమున అనగా పదునొకటవ కాలమందు అవతార పురుషుడుండును.

684. పదునొకండవ కాలమందలి సద్గురువులు ఐదుగురు దివ్యత్వము మానవరూపంలో అవతారపురుషునిగా భూమికి దింపెదరు. వారి ప్రమేయము లేనిదే, భగవంతుడెన్నడును అవతరించడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 007 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 7 🌻*

07. అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే ||

తాత్పర్యము : కాని ఓ బ్రాహ్మణోత్తమా ! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.

భాష్యము : లేదు

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 35 / Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।*
*శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥ 🍀*

🍀 86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - 
కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.

🍀 87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - 
శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 35. kaṇṭhādhaḥ-kaṭi-paryanta-madhyakūṭa-svarūpiṇī |*
*śakti-kūṭaikatāpanna-kaṭyadhobhāga-dhāriṇī || 35 || 🌻*

🌻 86 ) Kantatha kadi paryantha Madhya koodaiga swaroopini - 
  She whose portion from neck to hips is Madya koota

🌻 87 ) Sakthi koodaiga thapanna Kadyatho bhaga dharini -   
She whose portion below hips is the Shakthi koota

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasra Namavali - 35 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 3వ పాద శ్లోకం*

*🍀. 35. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః।*
*అపాంనిధి రథిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః॥ 🍀*

అర్ధము :

 🍀 318) అచ్యుత: - 
ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)

🍀 319) ప్రధిత: - 
ప్రఖ్యాతి నొందినవాడు.

🍀 320) ప్రాణ: - 
అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.

🍀 321) ప్రాణద: - 
ప్రాణ బలము ననుగ్రహించువాడు.

🍀 322) వాసవానుజ: - 
ఇంద్రునకు తమ్ముడు.

🍀 323) అపాంనిధి: - 
సాగరమువలె అనంతుడైనవాడు.

🍀 324) అధిష్టానం - 
సర్వమునకు ఆధారమైనవాడు.

🍀 325) అప్రమత్త: - 
ఏమరు పాటు లేనివాడు.

🍀 326) ప్రతిష్ఠిత: - 
తన మహిమయందే నిలిచియుండువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 35 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Karkataka Rasi, Aslesha 3rd Padam*

*🌻. 35. acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇadō vāsavānujaḥ |
apāṁnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ || 35 || 🌻*

🌻 318. Acyutaḥ: 
One who is without the six transformations beginning with birth.

🌻 319. Prathitaḥ: 
One who is famous because of His works like creation of the worlds etc.

🌻 320. Prāṇaḥ: 
One who as Hiranyagarbha endows all beings with Prana.

🌻 321. Prāṇadaḥ: 
One who bestows Prana, that is, strength, on Devas and Asuras and also destroys them by withdrawing it.

🌻 322. Vāsavānujaḥ: 
One who was born as younger brother of Indra (Vasava) in His incarnation as Vamana.

🌻 323. Apāṁ nidhiḥ: 
The word means collectivity of water or the ocean.

🌻 324. Adhiṣṭhānam: 
The seat or support for everything.

🌻 325. Apramattaḥ: 
One who is always vigilant in awarding the fruits of actions to those who are entiled to them.

🌻 326. Pratiṣṭhitaḥ: 
One who is supported and established in His own greatness.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment