🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 17 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
11. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి
మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస
🌻 27. 'నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి 🌻
శ్రీ దేవి సంభాషణ యందలి మాధుర్యము త్రిశక్తులలో నొకరైన
సరస్వతీ దేవియొక్క 'కచ్ఛపి' యను వీణానాదమును తిరస్కరించు
నట్లుండునని భావము.
వాయిద్యములలో వీణ ఉత్తమోత్తమమైనది. ఉత్తమోత్తమ వీణలు నారదుని మహతి, విశ్వవసువు బృహతి, తుంబురుని కళావతి, సరస్వతీ దేవియొక్క కచ్ఛపి వీణ ప్రథమ స్థానమున నుండును. వ్రేళ్ళ తాకిడితో ఆ వీణ నుండియే సమస్త స్వరములు, అక్షరములు పుట్టుచున్నవి.
వర్ణముల స్పష్టత కచ్ఛపీ వీణకే కలదని పెద్దలు చెప్పుదురు. అట్టి స్పష్టత, స్వర మాధుర్యము వ్యక్తము చేయు కచ్చపీ వీణానాదము కంటే కూడా శ్రీ దేవి సంభాషణములు మధురాతి మధురముగా
నుండునని ఈ మంత్రము ప్రతిపాదించు చున్నది.
శ్రీ దేవి పలుకులను వినగలుగు భాగ్యమే భాగ్యము. అంతర్ముఖునకు అట్టి అవకాశము ఏర్పడగలదు. శ్వాసయందలి లయ, తాళముల ద్వారా నాదము చేరి, అట్టి నాదము ఆధారముగ గంధర్వలోకము స్పృశించినచో శ్రీ దేవి సంభాషణా మాధుర్యము నెరుగుట కవకాశ మేర్పడును. నారద తుంబురు లట్టివారు. ఇటీవలి కాలమున శ్రీ త్యాగరాజు మహాశయులు అట్టి భాగ్యము ననుగ్రహింపబడినారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 27 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 27. Nija-sallāpa- mādurya- vinirbhartsita- kacchpī निज-सल्लाप-मादुर्य-विनिर्भर्त्सित-कच्छ्पी (27) 🌻
Sarasvatī’s veena (veena is musical instrument with strings) is called kachapi.
It produces a superb melody, in the hands of Sarasvatī Devi, the goddess for fine arts. The voice of Lalitai is more melodious than Sarasvatī’s veena.
Saundarya Laharī (verse 66) says: “While Vāni (Sarasvatī) is singing with veena about the various glorious deeds of Śiva and you begin to express words of appreciation, nodding your head, Sarasvatī quickly covers Her veena in its case.
The sweetness on the strings of the veena is ridiculed by the soft melody of your eulogistic words.”
The explanation provided to the earlier nāma is applicable here too. She attracts the ignorant by the melody of Her voice.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 28 / Sri Lalitha Chaitanya Vijnanam - 28 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
11. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి
మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస
🌻 28. 'మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస 🌻
శ్రీదేవి చిరునవ్వు కాంతి ప్రవాహము ఎల్లలు లేనిదగుటచే
కామేశ్వరుని మనస్సు కూడ అందు మునుగుచున్నదని భావము. కామేశ్వరుని మనస్సు నుండి సంకల్పము వెలువడి శ్రీదేవి ఉద్భవించినది.
శ్రీదేవి సహజముగ కాంతి స్వరూపము. ఆ కాంతియే త్రిగుణాత్మక సృష్టికి ఆధారము. సృష్టి సంకల్పమును నిర్వర్తించుటకు సృష్టికాంతిలో కామేశుని మనస్సు ఇముడును.
అతని సహకారముచే సృష్టి నిర్వహణము శ్రీదేవి నిర్వర్తించును. అట్లు పరమశివుడు సహకరించుటయే కాంతి యందుముగుట. శివ సంకల్పమును తన కాంతియంది ముడ్చుకొని శ్రీదేవి లోకములను, లోకేశులను, లోకస్థులను ఏర్పాటు చేయును.
వీరందరి యందును శివు డంతర్లీనముగ నుండగ శక్త్యాత్మకము, రూపాత్మకము అయిన సృష్టిని అమ్మ నిర్వర్తించును. శివ శక్తుల కార్యక్రమములను, సకల సృష్టి నిర్వహణము జరుగుచున్నది.
కామేశ్వరుని మానసము పొంది చిరునవ్వు కాంతులతో వెలయుచున్న శ్రీదేవిని ఈ నామము ద్వారా ధ్యానింపవలెను. శ్రీదేవి చిరునవ్వు యందలి దర్పము పరమశివుని మానసము తనయందు యముడుటయే. ఆ చిరునవ్వులోని కాంతి ఆమె ఈశ్వరత్వమునకు చిహ్నము.
సకల సృష్టికిని ఆమె ఈశ్వరి. ఆమెకు పరమశివుడు ఈశ్వరుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 28 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 28. Mandasmita- prabhāpūra- majjatkāmeśa-mānasā मन्दस्मित-प्रभापूर-मज्जत्कामेश- मानसा (28) 🌻
Smita means smile and mandasmita means a special benevolent smile. Kāmeśa is Śiva. When Lalitai is sitting on the left thigh of Śiva, they are known as Kāmeśvara and Kāmeśvarī. This form is different from their Ardhanārīśvara form. Śiva is immersed in that beautiful special smile of Lalitai.
Kāma also means bindu, a dot. Bindu is a part of kāmakalā bija (īṁ ईं). This bīja has two bindu-s, each representing the sun and the moon. The bindu refers to ego. Kāma and kalā both mean desire.
Mind is the cause for desire. When the mind of Śiva Himself is influenced by the smile of Kāmeśvarī, it only speaks about Her glory.
She attracts ignorant men by Her smile and offer them salvation by infusing wisdom.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
09 Oct 2020
No comments:
Post a Comment