🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 77 / Sri Gajanan Maharaj Life History - 77 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 15వ అధ్యాయము - 2 🌻
దేశం కోసం శివాజీ సేవలు శ్రీరామదాసు స్వామి దీవెనల వల్ల సఫలం అయ్యయి కావున శ్రీతిలక్ రాజకీయ పోరాటం ఫలించడానికి శ్రీగజానన్ మహారాజు ఆశీర్వాదాలు ఉండాలి. కొంతమందికి ఈఆలోచన నచ్చలేదు. ఈ షేగాం అవలియా నగ్నంగా వచ్చి లోకమాన్యను కొట్టవచ్చు కూడా అన్నారు. కానీ ఇతరులు దీనికి అంగీకరించక శ్రీగజానన్ మహారాజు యొక్క పవిత్రపాదాలు ఆప్రదేశాన్ని దర్శించాలని పట్టుపట్టారు. ఆయన పిచ్చివాళ్ళ మధ్య పిచ్చివానిగా ప్రవర్తించినా, అక్కడకి చేరే పండితుల మధ్య అలా ప్రవర్తించరని వారు వాదించారు.
లోకమాన్య నిజంగానే గొప్పనేత అయితే శ్రీమహారాజు తప్పక ఈకార్యక్రమానికి వస్తారని వారిలో ఒకరు అన్నారు. కాబట్టి చాలామంది శ్రీమహారాజును ఆహ్వానించడానికి షేగాం వెళ్ళరు. వాళ్ళని చూసి.. నేను శ్రీశివాజీ జన్మదినోత్సవాలకు వచ్చి అక్కడచేరిన సంఘోద్ధారకుల పూర్తి సంతృప్తిమేరకు మంచిగా ప్రవర్తిస్తాను, తిలక్ చలా సరిఅయిన మరియు దేశోద్ధారణకు కృషిచేస్తున్న దేశనేత. రాబోయేకాలంలో ఇతనికి సరిసమానులు ఎవరూ ఉండరు, నేను తిలక్ ను, ఆళందికి చెందిన శ్రీనరసింహసరస్వతి శిష్యుడయిన అన్నాపర్వర్ధన్ ను కలిసేందుకు అకోలా వస్తాను అని శ్రీమహారాజు శ్రీఖాపరడేతో అన్నరు.
శ్రీమహారాజు వాళ్ళ ఆహ్వనాన్ని స్వీకరించినందుకు శ్రీఖాపరడే సంతోషంచాడు. బెరారు మాణిక్యం శ్రీమహారాజుకు అకోలాలో జరిగినదంతా తెలుసు అని అతను కొల్హాట్కర్ అన్నాడు. శ్రీమహారాజు తమ ఆహ్వనాన్ని స్వీకరించడం ఈకార్యక్రమానికి శుభసూచన. వారు శ్రీమహారాజుకు నమస్కరించి అకోలా వెనక్కి వెళ్ళిపోయారు. శివాజీ జయంతి మహోత్సవానికి ఇంకా ఎనిమిది రోజులు మిగిలి ఉన్నాయి, ప్రజలంతా తిలక్ అకోలా రాకకోసం ఎదురు చూస్తున్నారు.
ఈ కార్యక్రమం శక సంవత్సరం 1830 వైశాఖమాసంలో జరగవలసి ఉంది. దీనికోసం పెద్దషామియానా కట్టారు. ఈకార్యక్రమం అవవలసిన రోజు విదర్భ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యమయిన పండగరోజు అయిన అక్షయ తదియ. అయినా దూరదూరాలనుండి చాలామంది ప్రజలు శ్రీతిలక్ ను చూసేందుకు అకోలా చేరారు. వారికి శ్రీగజానన్ మహారాజుకూడా వస్తారని తెలిసి మరింత అనందం తోడయింది.
శ్రీమహారాజు వాగ్దానం ప్రకారం, సమయానికి చేరి వేదికమీద లోకమాన్యతిలక్, అన్నాపర్వర్ధన్, ఖాపరడే, దామళీ, కొల్హాట్కర్, భవే, వెంకటరావు దేశాయి మరియు కార్యక్రమ ఇతర నేతలతోపాటు కూర్చున్నారు. సభప్రారంభిక ఆహ్వన పలుకులతో ప్రారంభించబడ్డ తరువాత, సింహనాదంగల లోకమాన్యతిలక్ ఉపన్యసించేందుకు లేచి నిలుచున్నారు.
ఈరోజు చాలా పవిత్రమయిన రోజు, ఎవరయితే తనజీవితాన్ని దేశసేవలో ఖర్చుపెట్టారో అటువంటి గొప్పశివాజీ జన్మదినం. శ్రీరామదాసు స్వామి ఆశీర్వాదాలు, శివాజీ కీర్తిని దేశం అంతా వ్యాపింపచేస్తాయి. అదేవిధంగా శ్రీగజానన్ మహారాజు ఆశీర్వాదాలు ఈకార్యక్రమానికి ఉన్నాయి. మహానీయుడు అయిన శివాజీ జీవితం మరియు పనులవలే, ఈ నాటి సభకూడా సఫలీకృతం కావాలని నేను వాంఛిస్తున్నాను.
దేశానికి ఈరోజులలో ఇటువంటి సభలు, కార్యక్రమాలు అవసరం. స్వాతంత్రం అనే సూర్యుడు అస్తమించి, బానిసత్వం అనే చీకటి అన్నిప్రక్కలా వ్యాపించింది. స్వాతంత్రం లేని ఏదేశమయినా నిర్జీవిలాంటిది. కావున ప్రజలకు ఇటువంటి తరిఫీదు ఇవ్వడం అవసరం. ఇందువల్ల వాళ్ళకు స్వాతంత్రం కొరకు ప్రేమ పెరుగుతుంది.
కానీ ప్రస్తుత పరిపాలకులు ఈవిధమయిన తరిఫీదు ఇవ్వగలరా ? అని శ్రీతిలక్ అన్నారు. దేశపాలకులను ఉద్దేశించి అన్న ఈవిధమయిన ఎత్తిపొడుపు మాటలు విని శ్రీమహారాజు లేచి, నవ్వుతూ... వద్దు వద్దు అలా అనకు, ఇది ప్రభుత్వంనుండి నీనిర్భంధాన్ని ఆహ్వనిస్తుంది అని అన్నారు. అలా అంటూ శ్రీమహారాజు తన మామూలు భజన గణ గణ గణాతబోతే మొదలు పెట్టారు.
కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రజలు లోకమాన్య తిలక్ ను పొగిడి, జయజయకారాలు చేసారు. కానీ శ్రీమహారాజు భవిష్యవాణి, ఆ సంవత్సరమే నిజమయింది. శ్రీతిలక్ కలం 124 క్రింద నిర్భంధించబడ్డారు. ప్రభుత్వసత్తా దృష్టిలో ప్రతివారూ నిస్సహాయులే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 76 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 15 - part 2 🌻
They said that Shivaji's service to the nation succeeded due to the blessings of Shri Ramdas Swami, so the political fight of Shri Tilak should have the blessings of Shri Gajanan Maharaj for its success.
Some people did not like the idea and said that the ‘Avliya’ of Shegaon may come naked and even beat Lokmanya, but others did not agree and insisted that the sacred feet of Shi Gajanan Maharaj must touch that place.
They argued that He might behave like a mad man amongst the mad people, but not among the learned people gathering there.
One of them said that if Tilak was really a great leader, then Shri Gajanan Maharaj would definitely come for the function. So, most of them supported the suggestion to invite Shri Gajanan Maharaj for the function.
Thereupon, the group of leaders of the function went to Shegaon to extend the invitation to Shri Gajanan Maharaj. Looking at them, Shri Gajanan Maharaj looked towards Shri Khaparde and said, I will come and attend the birthday celebrations of Shri Shivaji and behave well to the entire satisfaction of the social reformers coming over there.
Tilak is the most able national leader working for the liberation of the country and will remain unparrelled in the future also. I will come to Akola to see Tilak and Anna Patawardhan, who is disciple of Shri Narsima Saraswati of Alandi.”
Shri Khaparde was glad that Shri Gajanan Maharaj had accepted the invitation. He said to Kolhatkar that Shri Gajanan Maharaj , the gem of Berar, could know everything that had happened at Akola, and the acceptance of the invitation by Shri Gajanan Maharaj was a good omen for the function.
They bowed before Shri Gajanan Maharaj and went back to Akola. Eight days were left for the great celebration of Shivaji Jayanti, and people were very eagerly waiting for the arrival of Tilak to Akola.
The function was to take place in the month of Vaisakh of Saka 1830, and for that a huge pandal was erected. lnspite of the fact that the day of the function was Akshya Tritia, an important religious festival for the people of Vidarbha, a lot of people from distant places gathered at Akola to see Shri Tilak.
They also knew that Shri Gajanan Maharaj too was to come for the function, and it added to their happiness. Shri Gajanan Maharaj reached in the time as promised, and sat on the dais along with Lokmanya Tilak, Anna Patwardhan, Khaparde, Damle, Kolhatkar, Bhave, Venkatrao Desai and the other leaders of the function.
The meeting was called to order and after an introductory speech, Shri Lokmanya Tilak, the lion orator, stood up to speak. He said, Today is the most auspicious day, as the great Shivaji, who spent his life in the service of the nation, was born on this day.
The blessings of Shri Ramdas Swamy helped spread the fame of Shivaji all over the country, so will be the blessings of Shri Gajanan Maharaj for this meeting. I wish that today's meeting should be successful like the great Shivaji's life and work.
The nation today needs such meetings and functions. The sun of independence has set and all around there is darkness of slavery. Any nation without independence is lifeless. It is, therefore, necessary to impart such training to the people, which will enhance their love for independence.
But can the present rulers give us such training?” Hearing these taunting words, directed towards the rulers of the country, Shri Gajanan Maharaj got up and smilingly said, No, No, No. Don't say that. It can invite your arrest by the Government.
” Saying so, Shri Gajanan Maharaj started chanting his usual bhajan, Gan Gan Ganat Bote!” The function concluded successfully and people cheered and praised the Lokmanya, but the prophecy of Shri Gajanan Maharaj came true the same year; Shri Tilak we arrested under section 124. In the face of the Government's strength everybody was helpless.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
09 Oct 2020
No comments:
Post a Comment