✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లైట్ బాడీ యాక్టివేషన్ 🌻
🌟. "లైట్ బాడీ యాక్టివేషన్" అంటే మానసిక, భౌతిక, భావోద్వేగ ఆధ్యాత్మిక శరీరాల అభివృద్ధి. ఇదంతా కూడా భూమి యొక్క గ్రిడ్ ల సవరణ ద్వారా జరుగుతుంది. "గ్రిడ్స్" అనేవి జామెట్రికల్ స్ట్రక్చర్ ను కలిగి ఉంటాయి. అలాగే మన దేహంలో కూడా ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ 12 డైమెన్షన్స్ కు సంబంధించిన ఎనర్జీతో యాక్టివేట్ అవుతుంది.
✨. మానవ దేహంలోని విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తితో కలిసి అనంత విశ్వంలో మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్ తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. హైయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడం వలన మనలో విద్యుత్ ప్రవాహం ద్వారా మనలో దాగి ఉన్న డేటాను (DNAలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని)ఎన్ కోడ్ చేసి మన అభివృద్ధికి సహాయపడుతుంది. మనల్ని హైయ్యర్ సెల్ఫ్ స్ధాయికి ఎదిగేలా చేస్తుంది.
✨. మన లైట్ బాడీ యాక్టివేషన్ వలన మనల్ని విశ్వమూలాలతో ఏకీకృతం చేస్తుంది. మన యొక్క అణునిర్మాణం పునర్వ్యవస్థీకరింపబడుతుంది. శరీరాన్ని భారరహిత (తేలిక)పరిచి ఫ్రీగా ఉంచి విశ్వమూలంతో కనెక్ట్ చేస్తుంది. ఇలా చేయడానికి సహకరించే లైట్ బాడి యొక్క పవిత్ర జ్యామితిని "మెర్కాబా" అంటారు.
✨. శరీరంలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఆశక్తి స్పిన్ అవుతూ టెట్రాహైడ్రాన్(చతుర్భుజి) రూపంలో ప్రవేశిస్తూ శరీరంలోకి విస్తరిస్తుంది. మెర్కాబా అనేది ఒక ఖచ్చితమైన రేఖాగణిత క్షేత్రం. ఫలదీకరణ చేసిన పిండం (తల్లి నుండి అండం, తండ్రి నుండి శుక్రకణం)నే జైగోట్ అని పిలుస్తారు. ఈ జైగోట్ యొక్క మొదటి ఎనిమిది కణాల నమూనా అయిన ప్రైమోర్డియల్ సెల్ నే మెర్కాబా అని పిలుస్తారు.
✨. ఈ 8 కణాల స్థావరం మొదటి చక్రం అయిన మూలాధారంలో మానవ శరీరం యొక్క జ్యామితీయ క్షేత్రంలో ఉంటుంది. ఈ 8 కణాలు కూడా శరీరం చుట్టూ ఉన్న శక్తిక్షేత్రాలకూ మరి గ్రిడ్ లకూ అనుసంధానం చేయబడి కేంద్రబిందువులా ఉంటాయి. అందుకనే ఈ మెర్కాబా క్షేత్రం సృష్టియొక్క మాతృక (మ్యాట్రిక్స్). దీనినే "ఆత్మ యొక్క బ్లూప్రింట్" అని పిలుస్తారు. దీని వలనే భౌతిక శరీరం సూక్ష్మ శరీరాలు ఆత్మ యొక్క ప్రయోజనాలు జీవితం యొక్క ప్రయోజనాలు మానిఫెస్ట్ చేయబడతాయి.
✨. ఈ మెర్కాబా లైట్ బాడీ అనేది స్థలం, సమయం, కొలతలను మించిన ఒకానొక గొప్ప స్థితి. ఇది శరీరంలోని ప్రతి అణువుతోనూ కంపనాస్ధాయిని (ఫ్రీక్వెన్సీ) పెంచుకుని నిర్దిష్ట ప్రతిధ్వనిని ప్రతి కణంలో యాక్టివేట్ చేసుకొని దేవుని యొక్క పునరుత్పత్తి అంశంగా శరీరంలో కనెక్ట్ చేసుకుంటుంది.
✨. మనలో ఉన్న స్త్రీ- పురుష తత్వాలను ఏకం చేస్తుంది. కుడి మెదడు female energy (స్త్రీశక్తి) కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా మనిషికి యూనిటీ కాన్షియస్ నెస్ (ఐక్యతా సృహ) మరి నమ్మకం, ప్రేమ, కరుణ, స్నేహం అనే ఫీలింగ్స్ తో మనల్ని కనెక్ట్ చేస్తుంది.
✨. ఎడమ మెదడు పురుష శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. ద్వంద్వత్వ జీవితంవల్ల ఆత్మ అన్ని రకాల అనుభవాలను తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
✨. ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు ప్రయాణించాలి అంటే స్త్రీ పురుష శక్తుల కలయిక ద్వారా the law of one ఏకత్వపు సిద్ధాంతం ప్రకారం అసెన్షన్ వైపు ప్రయాణం చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
✨. ఈ అసెన్షన్ ప్రాసెస్ లో భౌతిక దేహం స్పిరిచ్యువల్ బాడీతో కలయిక ద్వారా లైట్ బాడీగా మారుతుంది. ఈ కలయిక ద్వారా హైయ్యర్ సెల్ఫ్ ఫిజికల్ బాడీలోకి అవరోహణ అవుతుంది. మన యొక్క జీవకణాలు కాంతి శక్తి తీసుకొని అభివృద్ధి చెంది ఆత్మచైతన్యంగా మార్పు చెందుతాయి. ఆత్మ యొక్క ప్రతి అవరోహణ భౌతిక కణాలలోని పరమాణు నిర్మాణాన్ని కాంతి పరమాణువులుగా మార్చడాన్నే లైట్ బాడీస్థితి అంటారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
09 Oct 2020
No comments:
Post a Comment