శివగీత - 87 / The Siva-Gita - 87


🌹.   శివగీత - 87 / The Siva-Gita - 87   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఏకాదశాధ్యాయము

🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 1 🌻

శ్రీ భగవాను వాచ !


దేహాం తరగతిం స్వప్న - పరలోకగతిం తథా |
వక్ష్యామి నృప శార్దూల ! - మత్త శ్శ్రణు సమాహితః 1


భుక్త పీతం యదస్త్యత్ర - తద్ర సాదామ బంధనమ్ |
స్థూల దేహస్య లింగస్య - తేన జీవన ధారణమ్ 2


వ్యాధి నా జరయా వాపి - పీడ్యతే జాఠ రోనలః |
శ్లేష్మణా తేన భుక్తాన్నం - పీతం వాన పచత్యలమ్ 3


భుక్త పీత రర సాభావా - త్తదాశుష్యంతి ధాతవః |
భుక్త పీతర సేనైవ - దేహే లింపంతి ధాతవః 4


సమీకరోతి యత్తస్మా - త్సమానో నాయు రుచ్యటే |
తదా నీంతద్ర సాభావా - దామబంధన హానితః 5


శివుడా దేశించుచున్నాడు :

దేహాతర ప్రాప్తి పరలోక గమనమున గురించి చెప్పుదును ఆలకించుము. ఓ రామా! దత్త చిత్తుడవై వినుము. భుక్త - పీత - పదార్ధములు పక్వములై వాటి యొక్క రసముల నుండి స్థూలశరీరమునకు ప్రాణవాయు ధారణము గల్గుచున్నది.

వ్యాధి వలన కాని వృద్దాప్యములో గాని లేదా ఉత్పన్నమైన శ్లేష్మము చేత నేమి జఠరాగ్ని మందమై భుజించినట్లే ఆహారముగానే, తాగిన నీరునిగాని పచనము కాదు. భుక్త పీతములు పచనము కాకుండుటచేత వానిరసము లేకపోవుటవలన నాడులు ఎండిపోవును.

ఆహార పానీయములతోనే నాడు వృద్ది చెందును, దేహనాడులను సమానముగా చేయును కనుక సమాన వాయువను పేరుగలదయ్యెను. అప్పుడార సములేనికతమున పరస్పర సంయోగము స్థూలలింగ శరీరములకు దప్పుచున్నది.


పరిపక్వర పత్వేన - యథా గౌరవతః ఫలమ్ |
స్వయమేన పథత్యాశు - తథా లింగం తనోర్వ్రజేత్ 6

తత్తత్ స్థ్సానాదక పాకృష్య - హృషీకాణాం చ వాసనాః |
ఆధ్యా త్మికాధి భూతాని - హృత్పద్మే చైకతాం గతః 7

తదోర్ద్వగః ప్రాణవాయు - స్సంయుక్తో నవవాయుభిః |
ఊర్ద్వోచ్చ్వాసి భవ త్యేష - తధా తైనేక తాంగతః 8

చక్షుషోర్వాపి మూర్ద్నోవా - నాడీ మార్గం సమాశ్రిత: |
విద్యాకర్మ సమాయుక్తో - వాసనాభిశ్చ సంయుతః 9

ప్రజ్ఞాత్మానం సమాశ్రిత్య - విజ్ఞానాత్మోప సర్మతి |
యథాకుంభో నీయమానో - దేశాద్దేశాంతరం ప్రతి 10

స్వపూర్ణ ఏవ సర్వత్ర స - ఆకాశో సితత్రతు |
ఘటాకాశాఖ్యకాం యాఇ - తద్వల్లింగం పరాత్మనః 11


పండిన గుమ్మడి మొదలగు ఫలములు బరువు చేత తీగను విడిచి పడిపోవునట్లు దేహము నుండి ఈ లింగ శరీరము వీడి పోవుచున్నది.

ఇంద్రియముల యొక్క వాసనలు గలవాడై ఆధ్యాత్మికాది భౌతికములను ఐక్య మొందించుకొని ముక్క ప్రాణుడు మిగత తొమ్మిది వాయువులతో కూడి వానితో కలిసి ఊర్ద్వోచ్చ్వాసము కలవాడగును.

జ్ఞాన కర్మలతో కూడినవాడై పూర్వవు ప్రజ్ఞాను సారములగు ననుభవములతో ప్రజ్ఞానాత్మ ప్రేరితుడై నేత్ర నాడుల నుండి గాని శిరో మార్గమున గాని జీవుడు ఊర్ద్వముగా నుపసర్పణ మందును అంతనున్న యాకాశమునకు ఘటాకాశాది వ్యవహారమువలె పరాత్మునికి లింగ దేహములో ప్రవేశముతో జీవిత్వ వ్యవహారము (ఉపాధ భేదము చేత) కలుగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 87   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 11
🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 1
🌻

Sri Bhagawan said: I would tell you the details of after death state, listen carefully, O Rama! When the eaten food, drunken fluids are digested, from that stuff the gross body gains it's Prana.

Either due to disease, or due to old age, or due to excessive production of phlegm, intensity of Jataragni (digestive fire of belly) declines, and consumed food & fluids do not get digested. In that scenario in the lack of Rasa, the nadis become dry.

Nadis flourish due to food and water only. The essence which equalizes all nadis that is called as Samana vayu. When there is lack of Rasa there becomes an imbalance between the gross, and subtle bodies.

The way fruits get detached from the creepers after ripening and fall down, similarly, from the gross body this linga deham (subtle body) gets separated.

Together with the Vasanas of indriyas, the Mukhya Prana together with other nine vayus moves upwards, influenced with Jnana, karma and past experiences, either through the path of eyes, or through the path of head the Jiva rises upwards where the all pervading sky is called as Ghatakasa the Paratma enters the linga deham.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

No comments:

Post a Comment