శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 60, 61 / Sri Lalitha Chaitanya Vijnanam - 60, 61

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 34 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 60, 61 / Sri Lalitha Chaitanya Vijnanam - 60, 61 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని

సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ

🌻 60. 'కదంబవనవాసినీ' 🌻

కదంబ వనమందు ఉండునది అని అర్థము. కదంబ మనగ వెలుగునీడలకు అతీతమైన చోటు. ద్వంద్వాతీత స్థితి.

అచట సుఖ దుఃఖములు లేవు. జయాపజయములు లేవు. రాగద్వేషాది ద్వంద్వ భావములకు చోటు లేదు. సురాసుర విభజన లేదు. ప్రజ్ఞ పదార్థ విభజన లేదు. రజస్తమస్సులు లేవు. మంచిచెడులు, ధర్మాధర్మములు లేవు. కేవల ముండుటయే ఉండును. ఉండుటయే గాని ఉన్నానను భావన లేదు. అట్టిది కదంబము. అది నిర్వికారస్థితి. అట్టి వన మొకటి మనయందును, సృష్టి యందును కలదు.

మనయందది సుషుమ్నయందలి హృదయ పద్మమునుండి ఆజ్ఞాపద్మము వరకు వ్యాపించియున్నది. సృష్టి యందలి బంగారము, వెండి ప్రాకారముల మధ్య భూమిగ ఏడు యోజనముల విస్తారము కలిగి యున్నది. పై విషయము భైరవ తంత్రమున తెలుపబడినది. ఈ వనమందు ఓంకారనాదము అనుశ్యుతముగ నాదించు చుండును.

తపస్విజనులగు సిద్ధులు ఈ వనమునందు ఉందురని ప్రతీతి. బహిరంగమున భూమిపై కూడ కడిమిచెట్ల వనమునందు నాదోపాసన చేయు ఆచార మొకటి యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 60 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 60. Kadaṃbavana-vāsinī कदंबवन-वासिनी (60) 🌻

She lives in the middle of kadaṃba trees whose flowers have divine fragrance. Her Cintāmaṇi graha is surrounded by a forest of kadaṃba trees. Nature’s greenery is mentioned here. By such narrations, Vāc Devi-s describe Her pṛthivī tattva, the Nature. She is also called Mother Earth.

There are about twenty five walls around Her Cintāmaṇi graha, each wall representing a tattva. This Kadaṃba vana (kadamba forest) is situated between the walls of gold (eighth wall) and silver (seventh wall).

It is interesting to note that all the goddesses of Śrī Cakra intersect each other in the place between seventh and eighth walls. There are twelve Vedic (solar) months corresponding to English calendar.

These twelve months are grouped under six ṛtu-s, each ṛtu consisting of two months. Each ṛtu is ruled by a god. These six gods along with their wives live in their palaces situated between third and eighth walls or forts of Śrī Pura.

In between the walls of gold and silver Mantrini Devi who is also called Śyāmala Devi has a palace where She resides. She is the authority of ninety bīja-s of Brahma Vidyā. Refer nāma 10.

Vāc Devi-s narrate how Lalitai controls even minute things. From the literal angle certain nāma-s may appear insignificant.

But each and every nāma of this Sahasranāma has inner and secretive meaning and also a bījākṣara. By and large, such secretive meanings are not disclosed to everyone. People knowing the secretive nature of this Sahasranāma are extremely rare to find.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 61 / Sri Lalitha Chaitanya Vijnanam - 61 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని

సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ

🌻 61. 'సుధాసాగరమధ్యస్థా' 🌻

సుధాసాగర మధ్యలో ఉండునది శ్రీదేవి అని అర్థము. సుధాసాగర మనగా అమృతముతో కూడిన సాగరము. ఈ సాగరము అమృతముచే ఆవరింపబడిన మహానగరము. ఇది బ్రహ్మాండముపై నున్నది. ఇదే సాగరము పిండాండమందు, సహస్రార పద్మ కేంద్రమునందు కలదు.

అది కూడ అమృత నగరమే. వీనియందు శ్రీదేవి వసించును. ఈ నగరములను లేక సాగరములను చేరిన జీవి శ్రీదేవి అనుగ్రహమును పొంది పునర్జన్మ రహితమైన స్థితిని పొందును. శాశ్వత మోక్షము నందును, సత్కర్మ, దేవి ఉపాసన సాధనములుగ జ్ఞానమును పొంది మోక్షము నందుండుట ఇందలి క్రమము.

శ్రీదేవి శివుని ఊరువులపై వసించునని, మేరు శిఖరముపై వసించునని, విద్యానగరమునందు వసించునని, బ్రహ్మాండము పైన ఉన్న చింతామణి గృహమందు వసించునని, పంచబ్రహ్మలతో కూడిన ఆసనమున వసించునని, మహాపద్మముల అడవి యందు వసించునని, కదంబ వనమున వసించునని, అమృత సాగరమున వసించునని తొమ్మిది నివాస స్థానములను శ్రీదేవి ఉనికిపట్టుగ లలితా సహస్రనామమున వర్ణింపబడి యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 61 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 61. Sudhā- sāgara- madhyasthā सुधा-सागर-मध्यस्था (61) 🌻

She resides in the middle of the ocean of nectar.

Sudhā means nectar, sāgara means ocean and madhyasthā means centre. Sudhā-sāgara is a place in sahasrāra. Just before sahasrāra, there is a place called soma cakra. When kuṇḍalinī reaches this soma cakra, due to the extreme heat, a liquid flows down through the throat (nāma 106).

This liquid is called sudhā as its viscosity and taste resembles nectar. This liquid is also called amrṭavarśinī. Amrṭam also means nectar. She being present in the middle of this soma cakra in the midst of ocean of nectar causes this nectar to flow into all the 72,000 (nāḍi-s) nerves of human body.

It is said that, if this nectar flows into our body, it does not cause death to the physical body. However this is possible only during advanced stage of kuṇḍalinī meditation. This is said to be the reason for long life of great sages.

Sudhā sindu also means the bindu in the centre of Śrī Cakra. This is mentioned in Saundarya Laharī (verse 8). This nāma attains great importance because it talks about amrṭavarśinī and the bindu.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹





Join and Share
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹

https://www.facebook.com/groups/465726374213849/


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom


Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam


JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra


Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/


🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA



29 Oct 2020

No comments:

Post a Comment