🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 86 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 08 🌻
367. మార్గములో నున్నవారు భూమికలను గురించి వివరింతురు. కాని తమకు ఆవలనున్న భూమికల గురించి చెప్పలేరు.
368. ప్రపంచము నుండి నిస్సంగమును పొందినవాడు సాధకుడగును.
369. మొదటి భూమిక:---
ఇచ్చట స్థూల ఇంద్రియములు సూక్ష్మ ఇంద్రియములు ఏకకాలమందే పనిచేయును.
370. భౌతిక చైతన్యముగల ఆత్మ,సూక్ష్మగోళ మందలి మొదటి భూమికలో పాక్షికముగా స్థూల ఇంద్రియములతో సూక్ష్మ సంస్కారములను అనుభవించును.
వినుట:--- వెలుపలి చెవులతో సూక్ష్మ భూమిక యందలి
గంధర్వగానమును వినును.
చూచుట:--- వెలుపలి నేత్రములతో అదే భూమిక యందలి లీలలను చూచును.
ఆఘ్రాణించుట:--- వెలుపలి ముక్కతో, అదే భూమిక యందలి
పరిమళమును వాసన చూచును.
371. అమర గానము భూమికిలన్నింటిలో వేర్వేరుగా వినిపించును.
372. ఉన్నతతర భూమికల అనుభవములో స్థూల ఇంద్రియముల యొక్క వినుట, చూచుట, ఆఘ్రాణించుట నిరూపయోగము. అచ్చట వినుచున్నది వేరే చెవి, చూచుచున్నది వేరే కన్ను, ఆఘ్రాణించునది వేరే ముక్కు. వెలుపలి ఇంద్రియములైన కన్ను-ముక్కు-చెవులకు ప్రతిరుపముగా అంతర నేత్రము, అంతర నాసికము, అంతర కర్ణము ఉన్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Oct 2020
No comments:
Post a Comment