✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - 5 🌻
417. ఆత్మ యొక్క చైతన్యము, మానసిక సంస్కారముల యందు చిక్కుబడి మానసిక శరీరము ద్వారా ఆ సంస్కారముల అనుభవమును పొంది తీరును.
418. మనస్సు యొక్క భౌతిక లక్షణములు:-
వాంఛలు, మానాసికోద్వేగములు, తలంపులు.
419. మనసుయొక్క ప్రబల లక్షణములు :- వాంఛలు
420. మనోమాయ ప్రపంచమందలి మానసిక చైతన్యముగల ఆత్మలు, సూక్ష్మ ప్రపంచము యొక్క అద్భుత శక్తులందు ఎరుక లేకుందురు. ఆకారణము చేత శక్తులను ప్రదర్శించలేరు.
421. ఆధ్యాత్మిక మార్గములో అయిదవ భూమిక వరకు బుద్ధి కౌశలము చేతను, అంతర జ్ఞానముల యదార్థత వల్లను, భగవంతుడు ఉన్నాడని తెలిసికొందురు. వీరి ఆత్మ విశ్వాసము సరయిన జ్ఞానముపై ఆధారపడి యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Nov 2020
No comments:
Post a Comment