శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 91 / Sri Lalitha Chaitanya Vijnanam - 91

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 50 / Sri Lalitha Sahasra Nama Stotram - 50 🌹
ప్రసాద్ భరద్వాజ 


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 91 / Sri Lalitha Chaitanya Vijnanam - 91 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |

కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ‖ 36 ‖


🌻 91. 'కులసంకేత పాలినీ'🌻

సదాచార సంకేతములను పాలించునది శ్రీదేవి అని అర్థము. కులమనగా వంశమని సామాన్య అర్థము. వర్ణమని మరియొక అర్థము.

ముందు నామమున కులమును మూడు విధములుగ నిర్వచించుట జరిగినది. కుళామృతమును గురించి తెలుపబడినది. ఇపుడు కుల సంకేతము గురించి తెలుపబడుచున్నది. కుల సంకేత మనగా సదాచారము వలన అంతఃకరణ శరీరము నందు పొందు దివ్యానుభూతులు మరియు దివ్యబోధనలు. అనుభూతి, బోధనము ఉపాసకునికి అంతరంగమున జరుగుచుండుట తెలిసిన విషయమే.

ఉపాసనా యంత్రము లేక విగ్రహము, దానికి వినియోగించు పూజాద్రవ్యములు, వుపాసించువాని మనస్సు, ఉపాసన వలన కలుగు దర్శనములు- ఇవి అన్నియు కలిసి కుల పుస్తకము అని కల్ప సూత్ర మందు తెలుపబడినది. సదాచారమున ఉపాసన చేయువాడు ఉపాసనను రహస్యముగ వుంచును.

ఉపాసనా మార్గమున కాని, సాధనా మార్గమున కాని నడచు చున్నవారు తమ మార్గమును కాని, సాధనను కాని బహిరంగము చేయరాదు. రహస్యముగ నుంచుకొనవలెను. వేశ్యలవలె బహిరంగ ప్రదర్శనములు జరుపరాదు. ప్రకటితము చేయరాదు. కుల పాతివ్రత్యము వలె దీక్షగ సాధన చేసుకొనువారు అంతరంగ విషయములను బహిరంగముగ ప్రకటింపరు. సాధకుడు కులస్త్రీవంటి వాడు.

అతడు సంగమము కోరు పురుషుడు పరమ పురుషుడే. సంగమ అనుభూతులు తెలుపుట వేశ్యావృత్తియే. అందువలననే "కుల పుస్తకమును దాచవలెను” అను వాక్యము సత్సాధకుల కీయబడినది. వారి ఉపాస్య దైవమును గూర్చి గాని, ఉపాసనా ద్రవ్యములను గూర్చి గాని, ఉపాసనా విధానమును గూర్చి గాని, దర్శనములు, బోధనలు గూర్చిగాని ప్రకటితము చేయరాదు. ఇవి అన్నియు కులసంకేతములు. చైతన్య రూపములు, వీనిని శ్రీదేవి పాలించుచు నుండును. అందువలన ఆమె 'కులసంకేతపాలిని'.

యోగమార్గమున కుండలినీ చైతన్యము సుషుమ్న మార్గమున చొచ్చి, షట్చక్రములందు పయనించి, సహస్రార కమలముచేరి అమృత రసమును వర్షించుటకు పై తెలుపబడిన నియమము అత్యవసరము. ఈ నామమునకు సద్గురువు పరశురాముడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 91 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 91. Kulasaṅketa-pālinī कुलसङ्केत-पालिनी (91) 🌻

In this nāma kula means race or family. She guards the secrecy of the kula or the family of Her worshippers.

Everything that belongs toHer is highly secretive in nature. For example Her Pañcadaśī and ṣodaśī mantra-s, Her kāmakalā form, Her kuṇḍalinī form, the ritual worship called navāvarana pūja etc. Out of all this, her kāmakalā form and Pañcadaśī mantra are highly secretive in nature.

The secrecy is on account of two factors. One is that such mantra-s should not be elaborately discussed because, if they fall in the wrong hands, by mastering such mantra-s they could harm the society.

Secondly, Her physical and kāmakalā forms are highly intimate in nature and hence cannot and should not be described in detail. But if they are continued to be kept as secrets, those who really want to understand the inherent meanings of such descriptions may not have the opportunity to know them.

Hence, an attempt is being made in this book about providing certain details that are very essential to interpret a nāma. This nāma says that She Herself protects these secrets from those who are not worthy of knowing them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment