శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 35 / Sri Devi Mahatyam - Durga Saptasati - 35


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 35 / Sri Devi Mahatyam - Durga Saptasati - 35 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 10

🌻. శుంభ వధ - 2 🌻


15. విల్లు విజువబడడంతో దైత్యనాథుడు బల్లెం తీసుకున్నాడు. ఆ బల్లెం అతని చేతిలో ఉండగానే దానిని దేవి చక్రంతో ఛేదించింది.

16. అంతట ఆ రాక్షసరాజాధిరాజు ఖడ్గాన్ని, వంద చంద్ర బింబాలతో చిత్రించబడి మెరుస్తున్న డాలును, తీసుకొని దేవిపైకి ఉరికాడు.

17. అతడు అలా వేగంగా వస్తుండగానే చండిక ఆ ఖడ్గాన్ని, సూర్యకిరణాల వంటి ప్రకాశం గల అతని డాలును, తన వింటితో వాడి అమ్ములను ప్రయోగించి ఛేదించింది.

18. గుట్టాలు చంపబడి, ధనుస్సు విరవబడి, సారథి లేక, ఉండడంతో ఆ రక్కసుడు భయంకర ఇనుపగుదిని తీసుకుని అంబికను చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు.

19. ఆమె పైకి ఉరికి వస్తున్న అతని ఇనుపగుదిని వాడి అమ్ములతో విరుగొట్టింది. అప్పుడు, అతడు పిడికిటిని ఎత్తి ఆమె పైకి పరుగెత్తాడు.

20. దేవి హృదయంపై ఆ దైత్యశ్రేష్ఠుడు ఆ పిడికిటి పోటుతో కొట్టాడు. దేవి కూడా తన అరచేతితో అతని వక్షఃస్థలంపై కొట్టింది.

21. ఆ అరచేతిదెబ్బ తిని ఆ దైత్యరాజు భూమిపై పడిపోయాడు. కాని వెంటనే అతడు మళ్ళీ లేచాడు.

22. అతడు దేవిని పట్టుకొని ఎత్తుగా ఎగిరి ఆకాశ ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కూడా చండిక నిరాధార అయ్యి అతనితో పోరుసల్పింది.

23. అంతట ఆకాశంలో ఆ దైత్యుడు చండిక ఒకరితో ఒకరు అత్యపూర్వ విధంలో సిద్ధులకు, మునులకు ఆశ్చర్యం కలిగేలా (బాహు) యుద్ధం చేసారు.

24. మిక్కిలి దీర్ఘకాలం అతనితో (బాహు) యుద్ధం చేసిన పిదప అంబిక అతనిని ఎత్తి గిరగిరత్రిప్పి భూమిమీదికి విసిరివేసింది.

25. అట్లు విసరివేయగా, భూమిపై పడి, ఆ దుష్టాత్ముడు పిడికిటిని ఎత్తి చండికను చంపడానికి వేగంగా పరిగెత్తాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 35 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 10

🌻 The Slaying of Shumbha - 2
🌻

15. And when the bow was split the lord of the daityas took up his spear. With a discus, the Devi split that (spear) also in this hand.

16. Next the supreme monarch of the daityas, taking his sword bright like the sun and shining shield bearing the images of a hundred moons, rushed at the Devi at that moment.

17. Just as he was rushing forward, Chandika split his sword with sharp arrows shot from her bow, as also his shield as bright as the solar rays.

18. With his steeds slain, with his bow broken, without a charioteer, the daitya then grasped his terrible mace, being ready to kill Ambika.

19. With sharp arrows, she split the mace of Shumbha, who was rushing at her. Even then, raising his fist, he rushed swiftly at her.

20. The daitya-king brought his fist down on the heart of the Devi, and the Devi also with her palm smote him on his chest.

21. The daitya-king, wounded by the blow of her palm fell on the earth, but immediately he rose up again.

22. Seizing the Devi, he sprang up and mounted on high into the sky. There also Chandika, without any support, fought with him.

23. Then the daitya (Shumbha) and Chandika fought, a never before, with each other in the sky in a close contact, which wrought surprise to the Siddhas and sages.

24. Ambika then, after carrying on a close fight for a vary long time with him, lifted him up, whirled him around and flung him down on the earth.

25. Flung thus, the evil-natured (Shumbha) reaching the earth and raising his fist, hastily rushed forward desiring to kill Chandika.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment