🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 / Sri Gajanan Maharaj Life History - 108 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 20వ అధ్యాయము - 3 🌻
ఆ ముని ఈవిషయాలన్నీ గుర్తుచేయడం లక్ష్మణును కలవరపెట్టి ఈ మనిషి ఎవరా అని అతను ఆలోచనలో పడ్డాడు. లక్ష్మణ వినయంగా అతనికి వంగి నమస్కారం చేసాడు. అతను అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. లక్ష్మణ ఇంటికి తిరిగివచ్చి తనయొక్క సాధారణ నడవడి ప్రారంభించి, ప్రతిసంవత్సరం పుణ్యతిధి జరపడం మొదలు పెట్టాడు.
శ్రీ మహారాజు అవధూత జైరాంఖేడ్కరును మునివస్త్రాలలో రోహిత్ గ్రామందగ్గర కలిసారు. ప్రభుత్వ రెవిన్యు అధికారి అయిన మాధవ మార్తాండ జోషీ ఒకసారి కాలంబ కాసుర్ గ్రామ భూమి సర్వేకి వచ్చాడు. అతను శ్రీగజానన్ మహారాజు భక్తుడు అవడంవల్ల, ఆరోజు గురువారం అవడంవల్ల సాయంత్రం దర్శనంకోసం షేగాం వెళ్ళలని అతనికి అనిపించింది. అందువల్ల అతను తన గుమాస్తా కుతుబుద్దీన్ను షేగాం వెళ్ళేందుకు ఎడ్లబండి తయారు చెయ్యమని చెప్పాడు.
కుతుబుద్దీన్ వినయంగా, వాతావరణం మబ్బుగా ఉందనీ, మాన్ నది మట్టినీళ్ళతో పొంగుతోందని అన్నాడు. అతని అభ్యర్ధన విస్మరించి, జోషీ బండిలోకి ఎక్కి కుతుబుద్దీన్ ను షేగాం నడిపించమని అన్నాడు. ఆబండి నదిలో దిగాక, వాళ్ళు అది దాటకముందే, ఆబండిలోకి అకస్మాత్తుగా నీళ్ళు తోసుకువచ్చాయి. మెరుపులతో తుఫాను ప్రారంం అయి మాన్ నది వరదతో పొంగింది. పెద్దవాన, తుఫానువల్ల చెట్లు, రైతుల గుడిసెలు పెకళించ బడ్డాయి. కుతుబుద్దీన్ భయపడి అటువంటి పరిస్థితులలో తమచావు తధ్యం అని అన్నాడు.
జోషీ కూడా భయపడి తమను ఈ వినాశనం నుండి కాపాడవలసిందిగా శ్రీ మహారాజను ప్రార్ధించాడు. చేతులు కట్టుకుని ఓగజాననా దయచేసి మమ్మల్ని రక్షించండి. మీరుతప్ప వేరే ఎవరూ మమ్మల్ని రక్షించలేరు. మునీశ్వరులు తమచేతులతోనే ఒక మునుగుతున్న ఓడను రక్షించారని పురాణాలలో చెప్పబడింది. మీరుకూడా ఒకగొప్ప యోగి, దయచేసి వచ్చి మమ్మల్ని ఈ వరదలనుండి రక్షించండి అని అన్నాడు.
బండిలోకి నీళ్ళు చొరబడేటప్పటికి, ఎడ్లుకూడా భయపడ్డాయి, జోషీ తనగుమాస్తాను ఆకళ్ళాలు వదలి శ్రీమహారాజును సహాయతకోసం ప్రార్ధించమని అన్నాడు. అప్పడు అతను శ్రీమహారాజుతో, ఓశక్తివంతమైన మహారాజ్ మాజీవితాలు మీచేతిలో ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నాడు.
అలా అంటూ ఆఎడ్ల కళ్ళాలు విడిచిపెట్టి, ఇద్దరూ కళ్ళుమూసుకున్నారు. అప్పడు ఒక అద్భుతం ఒరిగింది. ఆబండి క్షేమంగా నదిని దాటి అవతల గట్టుమీద నిలబడింది. అదిచూసి వారిద్దరూ, శ్రీమహారాజు శక్తికి ఆనందించారు. ఆవిధంగా వాళ్ళు ఆవరదతో పొంగుతున్న నదినుండి కాపాడబడ్డారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 108 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 20 - part 3 🌻
It was due to the fact that Shri Gajanan Maharaj had appeared in their dream, and had advised them to go to you for prasad. Have you forgotten all this? All these references by the sage confused Laxman and he was wondering as to who this man could be. Laxman respectfully bowed before the sage, who suddenly disappeared then and there.
He returned home, resumed his normal behavior, and started celebrating Punya Thithi every year. Shri Gajanan Maharaj also met Avadhoot Jairam Khedkar at Rohit village in the dress of a sage. Madhao Martand Joshi, a Government Revenue Officer, once came to Kalamb Kasur village for land survey.
It was Thursday, and being a devotee of Shri Gajanan Maharaj, he felt like going to Shegaon in the evening for Maharaj’s Darshan. He, therefore, told his peon, Kutubuddin, to get the bullock cart ready for going to Shegaon. Kutubuddin most humbly told him that the weather was cloudy and the 'Maan' river was getting flooded with muddy water.
Ignoring his request, Joshi got in the cart and asked Kutubuddin to drive to Shegaon. The cart entered the river and suddenly the water rushed in it before they could cross over. A storm accompanied by lightening started and the 'Maan' river got flooded. Pouring of heavy rains uprooted the farmer's huts.
Kutubuddin got frightened and said that in such conditions their death was certain. Joshi too got scared and started praying to Shri Gajanan Maharaj to save them from the calamity.With folded hands Joshi prayed, “O Gajanana! Kindly save us. Nobody, except you, can save us now.
It is said in Puranas that a sage had saved a sinking ship by his hand; you too are a great saint, kindly come and save us from this flood. When water entered the cart, the bullocks too got frightened. Joshi told the peon to leave the reigns and pray Shri Gajanan Maharaj for help.
Then he said to Shri Gajanan Maharaj , “O All Powerful Maharaj! Our lives are in your hands; do as you like. Saying so the reigns of the bullocks were thrown away and both of them closed their eyes. Then a miracle happened; the cart safely crossed the river and was seen standing on the other side of it. Looking to that, both were happy to experience the authority of Shri Gajanan Maharaj .
They were thus saved from the flooded river. Joshi reached Shegaon at night, prostrated before the Samadhi of Shri Gajanan Maharaj and attended the evening procession. Next day Joshi offered a lot in charity and gave some money to Shri Balabhau for the feeding of Brahmins, as per his vow. Since Joshi had some urgent work to attend, he left Shegaon soon.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Nov 2020
No comments:
Post a Comment