గీతోపనిషత్తు -136


🌹. గీతోపనిషత్తు -136 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 21

🍀. 19. బ్రహ్మము - బ్రహ్మముతో యోగము చెంది ముక్తుడైనటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. అతనికి బాహ్యస్పర్శ యిత్యాది యింద్రియ స్పర్శ లుండవు. వానియం దాసక్తియు యుండదు. బ్రహ్మము ప్రకృతికి కూడ అతీతమైన తత్త్వము. దాని యందు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు. 🍀

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ।। 21 ।।


బ్రహ్మముతో యోగము చెంది ముక్తుడైనటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. అతనికి బాహ్యస్పర్శ యిత్యాది యింద్రియ స్పర్శ లుండవు. వానియం దాసక్తియు యుండదు.

బ్రహ్మము ప్రకృతికి కూడ అతీతమైన తత్త్వము. దాని యందు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు.

అతనికి దేహ సంబంధిత మగు సుఖములుగాని, యింద్రియపరమగు సుఖములుగాని, మనోభావములుగాని, అహంకార భావములుగాని యుండవు. అంతయు దైవముగనే యుండును. అందువలన బాహ్యస్పర్శ యందు ఆసక్తిని దాటిన వాడని వేరుగ చెప్పవలెనా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021

No comments:

Post a Comment