తుది మొదలు లేనిదే ధైర్యం


🌹. తుది మొదలు లేనిదే ధైర్యం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀


తుది మొదలు లేనిదే ధైర్యం. అప్పుడు ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. దానితో మీరు ఎలాంటి సరిహద్దులు లేని అనంతాన్ని దర్శించగలరు.

లాంఛనప్రాయమైన మర్యాదలన్నీ పరస్పర అహాలకు సహకరించేవే. ఎందుకంటే, అవన్నీ అబద్ధాలే.

ఉదాహరణకు, ‘‘మీరు పెద్దవారు కాబట్టి, ముందు మీరే చెప్పండి’’అనగానే ‘‘మీరు చాలా అనుభవజ్ఞులు, మీముందు మేమెంత’’అంటారు. ఇలా ఒకరినొకరు లాంఛనప్రాయంగా పొగుడుకుంటారు. అంతేకానీ, వారు నిజంగా అలాంటివారు కారు. కాబట్టి, అలా లాంఛనప్రాయమైన మర్యాదల ముసుగులో నాగరికంగా కనిపించే నాటకాలను మనం ఆడుతూనే ఉంటాము.

కానీ, వాస్తవమైన మీ అహం మీకు ఎప్పుడూ అడ్డుగోడలా కనిపిస్తూనే ఉంటుంది. అయినా మన నాటకాలు కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల కాలక్రమంలో ఆ గోడ రోజురోజుకూ మరింత మందంగా తయారవుతూ, చివరకు మనకు ఏదీ కనిపించకుండా చేస్తుంది.

ఆ గోడ మీ చుట్టూ ఉన్నట్లు మీకు తెలిసిన వెంటనే ఒక దూకుతో దానిని వదిలించుకుని బయటపడింది. అందుకు మీరు చెయ్యవలసినదల్లా ‘‘ఎలాగైనా బయటపడాలి’’ అనే నిర్ణయం తీసుకోవడమే.

కాబట్టి, వెంటనే మీరు మీ అహాన్ని పోషించడం మానండి. దానితో అది కొన్ని రోజుల్లోనే మరణిస్తుంది. ఎందుకంటే, అది మనుగడ సాగించాలంటే దానికి ఎప్పుడూ మీ పోషణ, మీ ఆలంబన చాలా అవసరం.

అనేక భయాలుంటాయి. కానీ, అవన్నీ ఒకే భయానికి చెందిన శాఖలు మాత్రమే. ఎందుకంటే, భయం ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు పేరే మృత్యువు. మీ భయాలన్నీ దానికి చెందినవే. కానీ, ఆ విషయం మీకు ఏమాత్రం తెలియదు. ప్రతి భయం మృత్యువుకు సంబంధించినదే. భయం కేవలం ఒక నీడ మాత్రమే.

మీరు దివాలా తీసినప్పుడు అది పైకి కనిపించకపోవచ్చు. కానీ, ఒక పక్క మీరు నిజంగా డబ్బులేదని భయపడుతూనే, చివరికి చనిపోయేటంతగా మీరు మరీ బలహీనులవుతూ ఉంటారు. చావు నుంచి ఏమాత్రం తప్పించుకోలేమని అందరికీ కచ్చితంగా తెలిసినప్పటికీ, రక్షణకోసం వారు కేవలం డబ్బునే పట్టుకుని వేలాడతారు.

అయినా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటారు. అది మీకు ఏమాత్రం తీరిక లేకుండా చేస్తుంది. అలా అది మిమ్మల్ని ఒక రకమైన అచేతనంలోకి, ఒక రకమైన మత్తులోకి నెట్టేస్తుంది. కాబట్టి, తాగుబోతులున్నట్లుగానే ‘‘పనిబోతులు’’ కూడా ఉంటారు.

వారు నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారే కానీ, ఏ పని చెయ్యకుండా ఉండలేరు. సెలవులంటేనే వారు భయపడతారు. ఏ పని చెయ్యకుండా వారు నిశ్శబ్ధంగా ఉండలేరు. అందుకే ఉదయం చదివిన వార్తాపత్రికనే వారు మళ్ళీ చదవడం ప్రారంభిస్తారు. అలా వారు ఏదో ఒక పనిచేస్తూ ఉంటారు. అది వారికి, మృత్యువుకు మధ్య ఒక తెరలా అడ్డుగా ఉంటుంది. కానీ, వారు చేస్తున్న పని ముగిసిపోగానే మళ్ళీ మృత్యుభయం వారిని వెంటాడుతుంది.

ఇతర భయాలన్నీ కేవలం మృత్యుభయానికి చెందిన శాఖలు మాత్రమే. ఎందుకంటే, మీ భయానికి మూలకారణం తెలిస్తే, ఆ భయం పోయేందుకు ఏదో ఒకటి చెయ్యవచ్చు.

మీ భయానికి మూలకారణం మరణమే అని తెలిసినప్పుడు ఆ భయాన్ని పోగొట్టేందుకు కేవలం మరణం లేని చైతన్యాన్ని మీ అనుభవంలోకి తీసుకురావడమొక్కటే అందుకు పరిష్కార మార్గం. అది తప్ప ఏది చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. డబ్బు, హోదా, అధికారం- ఇలాంటివేవీ మృత్యువుకు ఎలాంటి బీమా కల్పించలేవు.

కేవలం గాఢమైన ధ్యానమొక్కటే మీ శరీరము, మనసు మరణిస్తాయని, మీరు వాటిని అధిగమించిన వారని మీకు తెలిపే ఏకైక సాధనం. మీకన్నా ముందు ఇక్కడ ఉన్నది, మీ తరువాత కూడా ఇక్కడ ఉండేది మీ జీవిత మూలాధారమైన మీ కేంద్రమొక్కటే.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021


No comments:

Post a Comment