శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 193 / Sri Lalitha Chaitanya Vijnanam - 193
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 193 / Sri Lalitha Chaitanya Vijnanam - 193 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖
🌻 193. 'దుష్టదూరా' 🌻
దుష్టత్వమునకు, దుష్టత్వము కలవారికి దూరముగా నుండునదే శ్రీమాత అని అర్థము.
లోకహాని కలిగించు పనులు, అట్టి పనులను చేయువారు శ్రీమాత అనుగ్రహము పొందలేరు. శ్రీమాత శిష్టులనెట్లునూ అభివృద్ధి గావించుచుండును. దుష్ట చేష్టల నరికట్టుచుండును. ఆమెకు పక్షపాత బుద్ధి లేదు. దుష్టులను అరికట్టును. శిష్టులను రక్షించును. దుష్టు లింకనూ పతనము చెందకుండ కాచును. తమ వృద్ధికై తాము పాటుపడువారు శ్రీమాత అనుగ్రహ పాత్రులు.
తమ వృద్ధికి, ఇతరుల వృద్ధికి పాటుపడువారు విశేష అనుగ్రహమును పొందుదురు. తమ వృద్ధికై ఇతరులను దోచుకొను వారు, హింసించువారు, దుఃఖములను కలుగజేయువారు శ్రీమాత
అనుగ్రహమునకు పాత్రులు కాలేరు. దుష్టులు వేరు. దుర్బలులు వేరు. దుర్బలురను శ్రీమాత
బ్రోచును. వారిది బలహీనతయే కాని దుష్టత్వము కాదు. జీవులు తమ తమ బలహీనతలను అధిగమించుటకే దైవారాధన.
శ్రీమాత అట్టివారిని అనుగ్రహించు చుండును. పరిమితత్వమే బలహీనత, అట్టి బలహీనత వలన ఏర్పడుచున్న దుఃఖములనుండి రక్షింపబడుటకు భక్తులు ఆరాధన చేయుదురు. వారికి చేయూత నిచ్చుట తన కర్తవ్యముగా శ్రీమాత భావించును.
మదించి అతిక్రమించుచూ, ఇతరులకు కష్టము, నష్టము, దుఃఖము కలిగించుట దుష్టత్వము. అట్టివారు కూడ శ్రీమాతను ఆరాధించుటకు ప్రయత్నింతురు. అట్టివారికి శ్రీమాత దూరముగ
నుండును. అనగా వారియెడల సుప్తయై ఉండును.
దుష్టులకైననూ బలము శక్తి స్వరూపిణియైన శ్రీమాత నుండి లభించును కదా! అట్టి శక్తితో వారు దుష్కార్యములు చేయుచున్నప్పుడు వారిని క్రమముగా శక్తిహీనులను చేయును. పదవియందున్నవారికి పదవీచ్యుతి కలుగును.
ధనవంతులు దరిద్రులగుదురు. వారి శరీర ఆరోగ్యము నశించి తీరని రోగములకు గురియగుదురు. వారియందలి ఆమె శక్తి వారినుండి దూరము చేయుట ఈ నామమునకు అర్థము. మాట పడిపోవుట, కదల లేకుండుట, కళ్ళు పోవుట ఇత్యాదివన్నియూ వానికి తార్కాణము. అట్టి సమయమున జీవులు తక్షణమే శక్తిహీనులగుడురు, శ్రీమాత దూరమగుట సహింపరాని దురదృష్టము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 193 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Duṣṭadūrā दुष्टदूरा (193) 🌻
She is far away from sinners. Duṣṭa means spoilt and corrupted and they do not even think about Her. They can never attain Her. This implies that they cannot have liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment