13) 🌹. శివ మహా పురాణము - 336🌹
14) 🌹 Light On The Path - 89🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 221🌹
16) 🌹 Seeds Of Consciousness - 285 🌹
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 160🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 16 / Lalitha Sahasra Namavali - 16🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 16 / Sri Vishnu Sahasranama - 16 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -136 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 21
*🍀. 19. బ్రహ్మము - బ్రహ్మముతో యోగము చెంది ముక్తుడైనటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. అతనికి బాహ్యస్పర్శ యిత్యాది యింద్రియ స్పర్శ లుండవు. వానియం దాసక్తియు యుండదు. బ్రహ్మము ప్రకృతికి కూడ అతీతమైన తత్త్వము. దాని యందు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు. 🍀*
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ।। 21 ।।
బ్రహ్మముతో యోగము చెంది ముక్తుడైనటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. అతనికి బాహ్యస్పర్శ యిత్యాది యింద్రియ స్పర్శ లుండవు. వానియం దాసక్తియు యుండదు.
బ్రహ్మము ప్రకృతికి కూడ అతీతమైన తత్త్వము. దాని యందు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు.
అతనికి దేహ సంబంధిత మగు సుఖములుగాని, యింద్రియపరమగు సుఖములుగాని, మనోభావములుగాని, అహంకార భావములుగాని యుండవు. అంతయు దైవముగనే యుండును. అందువలన బాహ్యస్పర్శ యందు ఆసక్తిని దాటిన వాడని వేరుగ చెప్పవలెనా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 336 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
85. అధ్యాయము - 40
*🌻. శివదర్శనము -1 🌻*
నారదుడిట్లు పలికెను -
హే విధీ! నీవు శివతత్త్వమును ప్రదర్శించే మహాప్రాజ్ఞుడవు. మిక్కిలి మనోరంజకము, మహాద్భుతమునగు శివలీలను వినిపించితివి (1). వీరుడగు వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి, కైలాస పర్వతమునకు వెళ్లినాడు గదా !ఓ తండ్రీ! తరవాత ఏమైనదో ఇప్పుడు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు సర్వదేవగణములు, మరియు మనులు పరాజితులై, రుద్రుని సేనలతే చితకకొట్టబడిన అవయవములు గలవారై నా లోకమునకు వచ్చిరి (3). స్వయంభువుడనగు నాకు సమస్కరించి పరిపరి విధముల స్తుతించి తమకు కలిగిన ఆపత్తును సమగ్రముగా నివేదించిరి (4). పుత్ర శోకముచే పీడితుడనై మిక్కిలి ఆదుర్దాతో దుఃఖముతో నిండిన మనస్సు గల నేను వారి మాటలను విని ఆలోచించితిని (5). ఇపుడు దేవతలకు సుఖము కలుగుటకై నేను చేయదగిన కర్తవ్యమేమి ? దక్షుడు మరల బ్రతికి ఈ యజ్ఞము పూర్తియగు ఉపాయమేది ? (6).
ఓ మహర్షీ! ఇట్లు నేను పరిపరి విధముల ఆలోచించితిని. కాని నాకు మనశ్శాంతి లభించలేదు. అపుడు భక్తితో విష్ణువును స్మరించగా, ఆ సమయమునకు తగిన జ్ఞానము కలిగినది (7). అపుడు దేవతలతో మరియు మునులతో గూడి నేను విష్ణులోకమునకు వెళ్లి నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి మా దుఃఖమును విన్నవించితిని (8). హే దేవా! ఈ యజ్ఞము పూర్ణమై ఆ యజమాని, సర్వ దేవతలు మరియు మునులు సుఖమును పొందు ఉపాయమును చేయుము (9). దేవదేవా! లక్ష్మీ పతీ! విష్ణో! నీవు దేవతలకు సుఖమునిచ్చువాడవు. దేవతలతో మునులతో గూడిమేము నిన్ను నిశ్చయముగా శరణు పొందియున్నాము (10). బ్రహ్మనగు నా ఈ మాటను విని శివస్వరూపుడగు ఆ లక్ష్మీపతి దైన్యముతో గూడిన మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (11).
విష్ణువు ఇట్లు పలికెను -
ఉన్నతిని గోరువారు తేజశ్శాలియగు వ్యక్తి విషయములో అపరాధమును చేయుట తగదు. అట్లు అపరాధమును చేయువారికి క్షేమము కలుగదు. వారి కోరిక నెరవేరదు (12). దేవతలందరు పరమేశ్వరుడగు శివుని యందు అపరాధమును చేసిరి. ఓ విధీ !వీరు శంభునకు యజ్ఞ భాగమునీయకుండిరి (13). మీరందరు గొప్ప ప్రసాద బుద్ధిగల ఆ శివుని కాళ్లను పట్టుకొని శుద్ధమగు మనస్సుతో ప్రసన్నుని చేయుడు (14).
ఆ దేవుడు కోపించినచో సమస్త జగత్తు నశించును. ఆయన శాసించినచో లోకపాలకుల జీవితము వెంటనే సమాప్తమగును. యజ్ఞము ధ్వస్తమగును (15).మిక్కిలి దుష్టుడగు దక్షునిచే తప్పు మాటలను పలికి ఆయన హృదయము గాయపరుచబడినది. ప్రియురాలి తోడు లేని ఆ దేవుని వెంటనే క్షమార్పణను కోరుడు (16). ఓ బ్రహ్మా శంభుడు శాంతించి సంతసించుటకు ఇదియే ఏకైకమగు గొప్ప ఉపాయమని నేను తలంచెదను. నేను సత్యమునే పలుకుచున్నాను (17).
నేను గాని, నీవు గాని, ఇతర దేవతలు గాని, మునులు గాని, ఇతర ప్రాణులుగాని ఆయన తత్త్వమును, ఆయన బల పరాక్రమముల సీమలను ఎరుంగజాలగు (18). స్వతంత్రుడు, పరుడు, పరమాత్మయగు ఆ శివునకు విరోధియగు పరమ మూర్ఖునకు ఉపాయమును ఎవరు చెప్పనిచ్చగించెదరు ? (91).
ఓ బ్రహ్మా !నేను కూడ మీ అందరితో గూడి శివుని ధామమునకు వచ్చెదను. నేను కూడ శివుని యందు నిశ్చితముగా అపరాధమును చేసితిని. ఇపుడు క్షమార్పణను చెప్పెదను (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 89 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 7 🌻*
348. That is difficult, truly, because when that is perfectly done it means that the man is looking down from the ego upon this lower world. Even the use of the lower mind will give much of that power, although we get it perfectly only in the causal body.
The lower mind can exercise discrimination, and if we use it from the higher standpoint and do not allow it to be clouded by personal feeling, it is a very fine and beautiful thing when fully developed. We are rather proud of our intellectual development in this fifth sub-race of the fifth root race, which emphasizes this discriminating work of the lower mind, but what we call intellect is only a very small thing as compared with that which is to develop in the course of the next round, which will be that really devoted to intellect.
We are proud of the achievements of the lower mind, and not without a certain amount of reason; it has done wonderful work in science and invention.
But only those who are able to look forward into the future and have also seen the Masters, who are men of the future, realize what we shall be perhaps in the course of a few thousands of years. I can bear witness that our highest intellectual activity now is but child’s play compared to what it will be in the future, so it is clear that there is a splendid vista opening before us.
349. What the ordinary person calls his mind is exclusively the lowest part of it. In his mind there are four subdivisions, consisting of matter of the seventh, sixth, fifth and fourth sub-planes of the mental plane respectively, but practically he is using matter of the lowest or seventh sub-plane only.
That is very near to the astral plane; therefore all his thoughts are coloured by reflections from the astral world, and so they are much mixed with emotion, feelings and desires. Very few people can deal with the sixth sub-plane as yet.
Our great scientific men certainly use it a good deal, but unfortunately they often mingle with it the matter of the lowest sub-plane and then they become jealous of other people’s discoveries and inventions. If they can rise to the fifth sub-plane they are already getting much more free from the possibility of astral entanglement.
If they can raise themselves to the fourth sub-plane, which is the highest part of the mental body, they are then in the very middle of the mental plane, and next to them is the causal body. They are then far away from the possibility of having their thoughts affected by astral vibrations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 221 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జైమినిమహర్షి - 6 🌻*
31. ‘అదానదోషాత్ భవేద్దరిద్రః‘, అంటే దానం చేయకపోవటం వలననే దరిద్రుడవుతాడు. మామూలుగా ఈ శ్లోకాన్ని అందరం చదువుతాము. దానం చేయకపోవటంచేత మనుష్యుడు దరిద్రుడవుతున్నాడు. ‘పునరేవ దరిద్రః పునరేవ పాపీ‘. దానం చేయకపోతే దరిద్రుడు అవుతాడు. దారిద్య్రంవలన మళ్ళీ పాపంచేస్తాడు. ఇలా ఉన్నారు మనుష్యులు. అందుకే, ఉన్నవాడు దానం చేసుకోవాలి. దారిద్య్రంలో ఉన్నప్పుడు ఏం దానం చేయగలరు? అందువల్ల దానంచెయ్యాలనిచెప్పి హితబోధలు, హితవాక్యాలు మనకు చాలా ఉన్నాయి.
32. షడర్శనములలో జైమిని ‘పూర్వమీమాంస’ ఉంది. అందులో ప్రభాకర, భాట్టములనే రెండుమతాలున్నాయి. వాటిలో ఒకరికి అయిదు ప్రమాణాలు, మరొకరికి ఆరు ప్రమాణాలు ఉన్నాయి. “మిరందరూ అనుకుంటున్నటువంటి సర్వజ్ఞుడనేవాడు, మహోత్తమ లక్షణాలు కలిగినవాడు, జగత్తుకు ప్రభువైనవాడు – విభుడు, నిత్యుడు, చిదాత్మకుడు మొదలైన లక్షణాలు అన్నీ కలిగిఉన్నాదంటున్న ఈశ్వరుడనే వాడు ఎవరూలేరు” అన్నాడు జైమిని. అలా అనగానే మనకు దుఃఖం కలుగుతుంది.
33. మన విశ్వాసానికి అది మూలఛ్ఛేదం అవుతుంది. ఈయన లేడని అంటే, ఉన్నాడని ప్రమాణాలు ఎంతోమంది చెప్పారు. అయితే ఈశ్వరుడు ఉన్నాడని సమర్థించేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రమాణానికి దొరకరు. పోనీ ఉన్నాడని చూపించడానికి వీలుకలుగదు. అనుమానప్రమాణంతో కూడా ఆయన నిర్ధారణ చేయటానికి వీలులేదు.
34. ఇకపోతే ఆగమము, ఉపమానము, ఉపమేయములతో ఇలా ఉంటాడని. చెప్పటానికి మాత్రమే బాగుంటుంది. అంటే, ఎప్పుడూకూడా మనంచూడని వస్తువునుకూడా ఉందని నమ్మించవచ్చు. ఉదాహరణకు, ఒక ఊళ్ళో ఒక పెద్ద పక్షి ఉంది. ఇది ఇలా ఉంటుందని ఒకరు చెప్పవచ్చు. అంటే దాని పోలికలు ఇలా ఉంటాయని చెపితే, ఉంటే ఉండవచ్చు.
35. కాని అలాంటి పోలిక ఏమీ చెప్పదానికి వీలులేని వస్తువు ఈశ్వరుడు. దేనితోనూ పోల్చడానికి వీలులేని వస్తువు అది. అట్లాంటి వస్తువుకు ఉపమానం ఏం ఉంది? ఉపమేయంకాదది. ఈశ్వరుడు! కాబట్టి ‘ఉపమానము లేనిదానిని ఎందుకు విశ్వసించాలి?’ అని జైమిని ఒక ప్రశ్నవేశాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 285 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 134. It is not with the body identification that you should sit for meditation. It is the knowledge 'I am' that is meditating on itself. 🌻*
True meditation only begins when initially, using your discrimination, you cut off everything that does not go with the 'I am'- which includes the body-mind identification, which is the major obstacle.
You should not have the feeling 'I am so-and-so meditating' or 'I am sitting at this particular place, in this posture, meditating on�' all these externalities must go. It should be only the knowledge 'I am' that should be meditating on itself.
It is only when the purity of 'I am' is maintained in meditation that there is a chance that it will disappear.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 160 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 5 🌻*
621. వారికి దేహధారులై యున్నస్థితి ఉండును. సద్గురువుల యొక్క లేక, అవతార పురుషుని యొక్క దివ్య కార్యాలయము కూడా ఉండును.
622. నిజమైన దివ్యుడు సృష్టిలో నివసించునప్పుడు భగవంతుని సత్యముగను, ప్రపంచమును మిథ్యగను తెలుసుకొనును.
( బ్రహ్మసత్యం జగన్మిథ్య).
623. 'సలీక్' యొక్క చైతన్యమును సులూకియత్ అందురు.
624. సలూకియత్ అనగా అనంత దివ్య జ్ఞానము యొక్క విజ్ఞాన స్థితి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 16 / Sri Lalita Sahasranamavali - Meaning - 16 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ |
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ‖ 16 ‖ 🍀*
37) అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ -
ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
38) రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా -
రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 16 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 16. aruṇāruṇa-kausumbha-vastra-bhāsvat-kaṭītaṭī |*
*ratna-kiṅkiṇikā-ramya-raśanā-dāma-bhūṣitā || 16 ||🌻*
37 ) Arunaruna kausumba vasthra bhaswat kati thati -
She who shines in her light reddish silk cloth worn over her tiny waist
38 ) Rathna kinkinika ramya rasana dhama bhooshitha -
She who wears a golden thread below her waist decorated with bells made of precious stones
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 16 / Sri Vishnu Sahasra Namavali - 16 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మేషరాశి - రోహిణి నక్షత్ర 4వ పాద శ్లోకం*
*🍀 16. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|*
*అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః|| 🍀*
🍀 141) భ్రాజిష్ణుః -
స్వయంప్రకాశకుడు, జ్ఞాన సాధనచే అవగతమగువాడు.
🍀 142) భోజనం -
కర్మ, జ్ఞాన ఇంద్రియాలతో స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ వస్తువులు).
🍀 143) భోక్తా -
భుజించువాడు, భోజనమనబడు ప్రకృతిని పురుషునిగా స్వీకరించువాడు.
🍀 144) సహిష్ణుః -
సహించువాడు, దుష్టులను సంహరించువాడు.
🍀 145) జగదాదిజః -
జగముల కంటే ముందుగా నున్నవాడు, ఆది పురుషుడు.
🍀 146) అనఘః -
కల్మషము లేనివాడు.
🍀 147) విజయః -
విజయమే స్వభావముగ కలవాడు.
🍀 148) జేతా -
ఇచ్ఛామాత్రమున అంతా జరిపించువాడు.
🍀 149) విశ్వయోనిః -
విశ్వ ఆవిర్భావానికి కారణమైనవాడు.
🍀 150) పునర్వసుః -
సకల దైవముల అంతరాత్మగా విరాజిల్లువాడు, ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 16 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka Rohini 4th Padam*
*🌻 16. bhrājiṣṇurbhōjanaṁ bhōktā sahiṣṇurjagadādijaḥ |*
*anaghō vijayō jetā viśvayōniḥ punarvasuḥ || 16 || 🌻*
🌻 141) Bhrājiṣṇuḥ:
One who is pure luminosity.
🌻 142) Bhojanam:
Prakruti or Maya is called Bhojanam or what is enjoyed by the Lord.
🌻 143) Bhoktā:
As he, purusha, enjoys the prakruti, He is called the enjoyer or Bhokta.
🌻 144) Sahiṣṇuḥ:
As He suppresses Asuras like Kiranyaksha, He is Sahishnu.
🌻 145) Jagadādhijaḥ:
One who manifested as Hiranyagarbha by Himself at the beginning of creation.
🌻 146) Anaghaḥ:
The sinless one.
🌻 147) Vijayaḥ:
One who has mastery over the whole universe by virtue of his six special excellences like omnipotence, omniscience etc. known as Bhagas.
🌻 148) Jetā:
One who is naturally victorious over beings, i.e. superior to all beings.
🌻 149) Viśvayoniḥ:
The source of the universe.
🌻 150) Punarvasuḥ:
One who dwells again and again in the bodies as the Jivas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment