దేవాపి మహర్షి బోధనలు - 16


🌹. దేవాపి మహర్షి బోధనలు - 16 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 7 . కర్మజ్ఞానములు 🌻

సిద్ధాంతము నుండి ఆచరణ వ్యక్తమగు చున్నది. ఎవరి సిద్ధాంతమును బట్టి వారు ఆచరించెదరు కదా! ప్రతి ఆచరణకు కేంద్రబిందువుగ ఒక సిద్ధాంత మున్నది. సిద్ధాంతము నుండి, ఆచరణ

నుండి సిద్ధాంతము పుట్టుచునే యుండును.

సిద్ధాంతము బీజమైన, ఆచరణ, వృక్షమగును. మరల ఆ వృక్షము నుండి అదియే బీజము జనించుచున్నది. తండ్రి నుండి కొడుకు జనించి, కొడుకు నుండి మరుల కొడుకు జనించుటచే మొదటి కొడుకు తండ్రి అగుచున్నాడు. కొడుకు తండ్రి అగుట, తండ్రి కొడుకగుట బీజము వృక్షముగ అనుశ్యుతము సాగుచునేయుండును.

మనస్సు నుండి సంకల్పము పుట్టి సంకల్పము నుండి మరల మనస్సు పుట్టుచు నుండును. అటులనే చరిత్ర నుండి పరిణామము పుట్టి చరిత్రగ మారుచున్నది. కేంద్రము నుండి పరిధి పుట్టుచున్నది. పరిధి యందలి ప్రతి బిందువు నుండి మరల పరిధులు పుట్టుచున్నవి. ఈ విధముగ కేంద్రము పరిధిగను, పరిధిగను, పరిధి కేంద్రముగను మారుచున్నవి.

పై విధముగ కర్మ నుండి జ్ఞానము పుట్టుచు, జ్ఞానము నుండి కర్మ పుట్టుచున్నది. కర్మ, జ్ఞానములు, చెట్టు, విత్తనముల వంటివి. ఈ రెండింటి యందు సమభావము కలిగి యుండుట యోగస్థితికి దారి తీయును.

కర్మలేని జ్ఞానము, జ్ఞానము లేని కర్మ ద్వంద్వమునకు సంసరణము కలిగించును. కర్మమును, జ్ఞానమును సమరీతిని గౌరవించి అనుసరించుట పరిణామమునకు దారి తీయును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021

No comments:

Post a Comment