భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 148


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 148 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 27 🌻


593. భగవంతునితో గల ఐక్యము, దాని సర్వాతిశమయమైనా అవస్థలో, అది కేవలమును ఏకత్వమే. కేవలమును అద్వైతమే.

594. సంస్కార రహితమైన సత్యస్థితి, ఇచ్చట జ్ఞానము కలుగును. ఇచ్చట భగవంతుడు తాను పూర్వమున్నట్లుగనే పవిత్రుడై యుండును.

595. భగవంతుని జ్ఞానము, ఈ జ్ఞానము, బ్రహ్మజ్ఞాని ని సత్యజీవితమును అపనమ్మక బ్రతుకును కేటాయించ గల సమర్ధుని కావించును. బ్రహ్మజ్ఞాని యొక్క అతీతావస్థ, బ్రహ్మజ్ఞానినే కాదని, లోన ఇముడ్చుకొనును.

596. ప్రియతముని గుణములలో (విశేషణములలో) ప్రేమికుడు కరిగిపోవుటయే "బ్రహ్మజ్ఞాని సత్యస్థితి".

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2021

No comments:

Post a Comment