శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 180 / Sri Lalitha Chaitanya Vijnanam - 180


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 180 / Sri Lalitha Chaitanya Vijnanam - 180 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖


🌻 180. 'నిర్నాశా' 🌻

నాశము లేనిది, అంతము లేనిది శ్రీమాత అని అర్థము.

అంతము, ఆరంభము సృష్టికేగాని, సృష్టికి ఆధారమైన సత్యమునకు, చైతన్యమునకు రారు. సత్యము, చైతన్యము అంతము లేనిది, నాశనము లేనిది, ఎల్లప్పుడూ ఉండునది.

చైతన్యము, సత్యము నాధారము చేసుకొని సృష్టి నిర్మాణము గావించుచుండును. ఆది, మధ్య, అంతములు సృష్టికి. సృష్టి మూలమునకు కాదు. అది శాశ్వతమైనది. వానినుండి సృష్టి వ్యక్తమగును. మరల వానిలోనికి లయమగును.

మనలో భావము లెట్లు పుట్టుచున్నవి? మనముండుట వలన, మేల్కాంచి ఉండుటవలన. మనముండుట అనునది సత్యము. మేల్కాంచుట అనునది ఉండుట నుండి మేల్కాంచిన చైతన్యము, మనము మేల్కాంచి యున్నపుడు మన నుండి ఆలోచనలు వ్యక్తమగును, వానితో మనదైన జీవితమును సృష్టి చేయుదుము. వానిని వృద్ధి చేయుటకు ప్రయత్నింతుము. మన ఆలోచనకు యొక కాలపరిమితి యున్నది.

మనము చేసిన సృష్టికి కాలపరిమితి యున్నది. మనకు ఆలోచనలు రాకముందు కూడ మనము ఉన్నాము కదా! మన నుంచి వచ్చిన ఆలోచనలు, ఆలోచనల నుండి పుట్టిన భాషణము పనిలేక పోయినను మన ముందుము.

మనము శాశ్వతులము. మనకు కూడ అంతము లేదు, మరణము లేదు. మరణింతుమన్న భావన మన మేర్పరచుకొన్నదే. మనమెల్లప్పుడునూ యుందుము. మననుండి పుట్టిన ఆలోచనలు నశింప వచ్చును. మనము అవతరింపజేసిన పనులు కూడా నశింపవచ్చును. మననుండి పుట్టిన దేహము కూడా నశింపవచ్చును. అన్నియూ నశించిననూ మనముందుము.

మనము పరాప్రకృతి. పరమపురుషుల అంశ యగుటచే శాశ్వతులము. ప్రకృతి పురుషులు కూడా అట్లే శాశ్వతులు. “సత్యమ్, జస మసంతమ్ బ్రహ్మ !” అనునది శ్రుతి. ఇది దేవునికి, జీవునికీ కూడ సత్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 180 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirnāśā निर्नाशा (180) 🌻

She is indestructible. Brahman is beyond destruction. Infinity, thy name is Brahman!

Taittirīya Upaniṣad (II.1) says, “satyaṁ jñānam anantaṁ brahma”, which means that Brahman is truth, knowledge and infinite.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2021

No comments:

Post a Comment