11) 🌹. శివ మహా పురాణము - 359🌹
12) 🌹 Light On The Path - 111🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243🌹
14) 🌹 Seeds Of Consciousness - 308🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 183🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Lalitha Sahasra Namavali - 38🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasranama - 38🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 010🌹*
AUDIO - VIDEO
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -161 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 8
*🍀 8 - 3. యోగ కారకములు - 2. కూటస్థ : చంచలత్వము, మార్పు లేక ఏకరీతిలో ఉన్న ప్రజ్ఞ, నిశ్చలత్వము, నిర్వికారత్వము కలిగి యుండుట కూటస్థ స్థితి. జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. క్షేత్రము నుండి యోగసాధకుని ప్రజ్ఞ అక్షరత్వము చెందుచుండును. అట్టి వానిని కూటస్థుడందురు. జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. అట్టివాడే ఇంద్రియములను జయించిన వాడగును. 🍀*
2. కూటస్థ :
చంచలత్వము, మార్పు లేక ఏకరీతిలో ఉన్న ప్రజ్ఞ, నిశ్చలత్వము, నిర్వికారత్వము కలిగి యుండుట కూటస్థ స్థితి. క్షరపురుషుడు గాలికి రెపరెపలాడుచు ఆరిపోవు దీపము వలె నుండును. అక్షర పురుషుడు నిశ్చల జ్యోతివలె నుండును. యోగ సాధకుడు అట్టి స్థితిని పొందవలెనని ఈ శ్లోకము సూచించు చున్నది.
జ్ఞానము, విజ్ఞానముగ పరిణతి చెందుచున్నపుడు యోగ సాధకునకు నిత్యానిత్య వస్తు వివేకము కలుగు చుండును. జీవితమున జరుగు సన్నివేశము లన్నియు వచ్చిపోవు విషయములని తెలియు చుండును.
మమకారము, మోహము వంటి బంధములు తరుగుచుండును. భయము, శోకము తగ్గుచుండును. క్రమముగ అరిషడ్వర్గములు విసర్జింపబడును. తత్ఫలితముగ బాహ్య సన్నివేశములు అతని మనస్సును కలవర పెట్టవు. మనసు చంచల స్థితి నుండి అచంచల స్థితికి చేరును. క్షేత్రము నుండి యోగసాధకుని ప్రజ్ఞ అక్షరత్వము చెందుచుండును. అట్టి వానిని కూటస్థుడందురు.
ఎన్ని సమ్మెట దెబ్బలు తగిలినను కంసాలి యొక్క దాగిలి చెక్కు చెదరక యుండును. పదును కలిగి యుండును. దానికి చలన ముండదు. కంసాలి దాగిలిని కూట మందురు. కూటస్థుడనగ అట్టి నిశ్చలత్వము కలవాడని అర్థము. పర్వత శిఖరములను కూడ కూటము లందురు. శిఖరము ఎండకు, వానకు, గాలికి, చలికి, వేడిమికి తట్టుకొనుచు ఉత్తమ స్థితి యందుండును. కూటస్టు డట్టివాడు. కూటస్థితి అక్షర స్థితి. అది ఉత్తమ స్థితి. అట్టి స్థితప్రజ్ఞత్వము అరుదుగ నుండును.
జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. అట్టివాడే ఇంద్రియములను జయించిన వాడగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 361 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
94. అధ్యాయము - 06
*🌻. పార్వతి పుట్టుట - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడా దంపతులు దేవ కార్యమునందు శ్రద్ధ గలవారై జగన్మాతను కుమార్తెగా పొందగోరి ఆమెను భక్తితో నిత్యము స్మరించుచుండిరి (1). పూర్వము తండ్రివలన అవమానమును పొంది యోగాగ్నిచే శరీరమును త్యజించిన ఆ చండిక అపుడు మరల హిమవంతుని భార్యయొక్క గర్భమునందు జన్మించుటకు సంకల్పించెను (2).
ప్రసన్నురాలై కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఆ తల్లి తాను ఇచ్చిన మాటను సత్యము చేయదలచెను. అపుడా మహేశ్వరి పూర్ణాంశముతో హిమవంతుని మనస్సులో ప్రవేశించెను (3). విశాల హృదయుడు అగు ఆ హిమవంతుడు అపుడు మిక్కిలి ఆనందము గలవాడై, అపూర్వ కాంతులతో విరాజిల్లెను. ఆయన అగ్నిహోత్రము వలె తేరిపార చూడరాని తేజస్సుతో విరాజిల్లెను (4).
అపుడు హిమవంతుడు మంగళకరమగు సమయములో శివాదేవి యొక్క పూర్ణాంశమును పరిశుద్ధమగు చిత్తముతో తన ప్రియురాలియందు ఆధానము చేసెను (5). మేన తన మనస్సునందుండి కరుణను వర్షించే పరమేశ్వరి అనుగ్రహము వలన గర్భమును దాల్చెను. హిమవంతుని పత్ని గర్భవతి కాగా ఆ పర్వత రాజు మిక్కిలి సుఖమును పొందెను (6).
హిమవంతుని ప్రియురాలగు మేన, సర్వ బ్రహ్మాండములకు నివాస స్థానమగు జగన్మాతను తన గర్భములో ధరించుటచే, సర్వదా తేజోరాశిచే వ్యాప్తయై అతిశయించిన ప్రకాశముతో ఒప్పారెను (7). మేన యొక్క గర్భిణీ లక్షణములు ఆమె భర్తకు ఆనందమును కలిగించెను. మరియు దేవతల శుభకరమగు కోరిక ఈడేరుటచే, వారికి ఆమె గర్భము ఆనందహేతువు ఆయెను (8).
శరీరములో శక్తి తక్కువగా నుండుటచే తక్కువ ఆభరణులను ధరించి, లోధ్ర పుష్పమువలె పాండు వర్ణము గల ముఖముతో ప్రకాశించే ఆమె చంద్రుడు అస్తమించిన తరువాత కనబడీ కనబడని నక్షత్రములు గల రాత్రివలె భాసిల్లెను (9). ఓ మహర్షీ! పర్వతరాజగు హిమవంతుడు ఏకాంతమునందు మృద్గంధముతో గూడియున్న ముఖమును ముద్దాడి అతిశయించిన ప్రేమను ప్రదర్శించెను. అయిననూ, ఆయనకు తృప్తి కలుగలేదు (10).
మేన ఏయే వస్తువులను కోరుచున్నది ? ఆమె సిగ్గు వలన నాకు చెప్పకున్నది ఆమె అభీష్టమేమి? అని హిమవంతుడు ఆమె చెలికత్తెలను పదే పదే ప్రశ్నించెను (11). గర్భసంబంధి క్లేశమును పొందిన మేన దేనిని చూచినా, లేక కోరినా దానిని హిమవంతుడు వెనువెంటనే రప్పించి ఆమెకు ఇచ్చెడివాడు. ఆమెకు ఇష్టమై ముల్లోకములలో ఆయన సంపాందిప శక్యము కాని వస్తువు లేనే లేదు (12).
వృద్ధి పొందిన అవయవములు గల ఆ మేన గర్భక్లేశమును అతిక్రమించి, అనేక పత్రములతో నిండుగా నున్న లేత తీగవలె ప్రకాశించెను (13). హిమవంతుడు గర్భవతియగు తన భార్యను, నిధులనన్నిటినీ తనలో దాచుకున్న పృథివిని వలె, అగ్నిని తన గర్భములో దాచుకున్న శమీ వృక్షమును వలె, భావన చేసెను (14).
వివేకి యగు హిమవంతుడు ప్రియురాలి మనస్సును సంతోషపెట్టుటకు, తాను సంపాందించిన ధనమును సద్వినియోగము చెయుటకు, వేదధర్మము యొక్క ఉన్నతి కొరకు వైదిక సంస్కారములనన్నిటినీ యథావిధిగా జరిపించెను (15). కొంత కాలము తరువాత హిమవంతుడు, వైద్యులచే రక్షింపబడుతూ పురిటి గృహములో నున్న మేనను చూచెను. ఆమె ప్రసవించుటకు సిద్ధముగా నుండి, మేఘములతో నిండి వర్షించుటకు సిద్ధముగా నున్న అంతరిక్షమువలె, ప్రకాశించెను (16).
తన గర్భమునందు జగన్మాతను ధరించి మహా తేజస్సుతో నొప్పారు, శుభకరములగు అవయవములు గల ప్రియురాలిని చూచి, ఆ సమయములో హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (17). ఓ మహర్షీ! ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అచటకు వచ్చి గర్భమునందున్న ఉమా దేవిని స్తుతించిరి (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 111 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 4 🌻*
422. But, as is said here, self-sacrificing labour alone is not sufficient to gain for the man the highest development.
He also needs to develop his devotion, and above all to develop his power of response to the inner light, because without that he will not be a perfect instrument. Without that he might be working away most energetically, but would be unable to respond to the touch, the hint from above, sufficiently quickly.
He would need, as it were, to be pulled round energetically, instead of requiring just a gentle touch, which is all that should be necessary, and so would cause more trouble to his Master in training him. He must also learn something of the great plan, because, glorious as the work is, the man cannot do it perfectly unless he has knowledge.
Therefore he must make a definite effort in the way of study to attain that. Much knowledge comes in actually doing the work, but there is every reason for us to take advantage of the accumulated experience of our forerunners and learn whatever we can by study, so that our work may be better done.
423. The vices of men become steps in the ladder, one by one, as they are surmounted. The virtues of men are steps indeed, necessary – not by any means to be dispensed with. Yet, though they create a fair atmosphere and a happy future, they are useless if they stand alone.
424. A.B. – Here both vices and virtues are called steps. This broad view cannot harm students, and is indeed necessary for the disciple, but it would be right in the world to take the narrow view, for vice must mean vices, and virtue must mean virtues, to undeveloped people.
The broad view would confuse their ideas of morality; they cannot apply principles with understanding, and think of the moral bearing of each action, so they must have a list of things that are bad, for their avoidance, a set of religious and social commandments for their guidance. , It would be a mistake to upset the popular view of vice and virtue, although it permits many actions the disciple has outgrown.
425. But esotericists should learn to understand what they both mean, as manifestations of the Divine. The way to regard it is to think of every soul as a divine being, as a centre of outgoing energies pouring into the world.
The life of man consists in the expression of the life of atma, and it finds expression outwards. In the earlier stages of its evolution there was nothing to be called vice or virtue, but simply an outrush of energies, very largely along lines which the standards achieved by society to-day would not approve.
It is true that from the beginning of our human career most of us, especially those who had individualized at a high point from the animal kingdom, were in a position to use our intelligence to some extent, and so were able to learn many things by observation of others.
But it remains a fact that nevertheless all of us in earlier stages must have done many things which would now be accounted evil. Those experiences taught us to do better, so they were steps or means of progress.
And they also helped to make it possible for us to understand and help others who are going through such experiences now. All types of experiences are equally necessary; we could not know even partly what they are without every kind of expression, and should never be able to help other people if we did not understand.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 7 🌻*
48. ఎవరికి భవంతునిమీద పగ ఉంటుందో, వాడికి ఆయన కనపడడు, వాడిని పట్టించుకోడు. వాడెంత అపచారం చేసినా సహిస్తాడు, మాట్లాడడు. కాని, వాడిని కటాక్షించడు. ఎందుచేతనంటే, వాడికి తన ఉనికి తెలియటంకూడా ఆయన సహించడు.
49. కాబట్టి వాళ్ళ యందు పూర్తిగా భగవంతుడికి ఉపేక్ష ఉంటుంది. శత్రువులయందు శ్రద్ధ ఉండదు, భక్తుడియందే శ్రద్ధ ఉంటుంది. అలాకాకపోతే, శత్రువుమీద ఆయనకు కోపమే ఉండి ఉంటే, అది శ్రద్ధ అవుతుంది కదా!.
50. ఆసేతుశీతాచల పర్యంతం రామేశ్వరం నుంచీ కేదార్‌నాథ్ వరకు ఆ సంప్రదాయాలు, ఆ పూజలు, ఆ మంత్రాలు, ఆ విగ్రహాలు అవన్నీ ఏదో విచిత్రంగా ఉంటాయితప్ప తత్త్వం మాత్రం ఒక్కటే!
51. భారతీయతలో ఆ గురుతత్త్వం, ఆ ప్రబోధం, ఆ మార్గం, ఆ శరణాగతి అదంతాకూడా అలాగే ఉంటుంది. ఈ భారతీయ సంప్రదాయంలో ఈ మహర్షులు ప్రతిష్ఠించింది ఏమిటంటే, అది ఈశ్వరతత్త్వంకంటే, గురుతత్త్వం అనే చెప్పాలి. వాళ్ళు దానిని సుప్రతిష్ఠంచేసి దానికి శాశ్వతం ఇచ్చి వెళ్ళిపోయారు.
52. నిజంగా గురుతత్త్వమే అయిన ఈ ఋషుల చరిత్రలన్నీకూడా అమోఘమైనటు వంటివి. వీటిలో ప్రతీచోట బ్రహ్మవిష్ణు రుద్రులొస్తున్నారు. అంటే త్రిమూర్తులతీనే సన్నిహితసంబంధం కలిగిఉన్నప్పటికీ, వీరు మనుష్యులే! వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించారు. ఈ గురుతత్త్వం మాత్రం ఎప్పుడైనా ఈ భారతదేశంలో నశించదు.
53. ఈ సంప్రదాయం ఎప్పుడయినా, ఎప్పటికైనా భారతదేశ సంస్కృతికి కల్యాణప్రదమై పునరుజ్జీవన హేతువవుతుంది. ఈ సంస్కృతియొక్క పునరుజ్జీవనహేతువు దేంట్లో ఉండంటే, ఈ గురుతత్త్వంలోనే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 308 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 157. Once you reach the state of 'I am' and are aware of that only, you will have transcended all the tendencies ('Vasanas'). 🌻*
'Vasanas', tendencies or desires have a very strong pull and act as very potent hindrances in the 'Sadhana' (practice). The obvious desires are easy to identify but the subtle ones enter through the back door or are always stubbornly there in the background.
The desire 'to be' is at the very root and often missed, it has developed gradually over the years as the verbal 'I am' with the 'I am so-and-so'. But, if you recollect and are observant enough, it will be clear that when the pure non-verbal 'I am', or sense of 'presence', arrived it had no traces of desire in it, although it was dormant.
This pure 'I am' when desire was unexpressed is presently your goal. As you abide in it with full understanding a stage will come when you are aware of the 'I am' only. It is only on reaching this stage you will have transcended all desires and they won't trouble you anymore.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 183 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 5 🌻*
690. అవతారపురుషుడు భూలోకములో ఉన్నప్పుడు కూడా, 56 గురు బ్రహ్మీభూతులు దేహధారులై యుందురు. వీరు 56 గురు 56 కార్యాలయములను నిర్వహింతురు. కాని ఒక్క అవతారపురుషుడు మాత్రమే సర్వాధికారియై యుండును.
691. అవతార పురుషుడే భగవంతుడు. భగవంతుడే, మానవకోటికి మానవుడై, జంతుశ్రేణికి జంతువై, పక్షిజాతికి పక్షియై ఇట్లు సృష్టిలో సర్వమూ తానే “అగు” చున్నాడు. అనగా:-
సృష్టియే తానగు చున్నాడు (విశ్వరూపుడు) ఇదియే అవతారమనగా సరియగు అర్థము.
692. పంచ సద్గురువులు భగవంతుని దివ్యత్వమును మాయాసృష్టికి బహూకరించినప్పుడు, ఈ దివ్యత్వము సృష్టి అంతటా అలముకొని, స్పృశించి, అసంఖ్యాకరముల సూక్ష్మ – మానసిక రూపములలో కనిపించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 38. మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।*
*మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥🍀*
🍀 99. మూలాధారైక నిలయా -
మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
🍀 100. బ్రహ్మగ్రంథి విభేదినీ -
బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
🍀 101. మణిపూరాంతరుదిరా -
మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
🍀 102. విష్ణుగ్రంథి విభేదినీ -
విష్ణుగ్రంథిని విడగొట్టునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 38. mūlādhāraika-nilayā brahmagranthi-vibhedinī |*
*maṇi-pūrāntaruditā viṣṇugranthi-vibhedinī || 38 || 🌻*
🌻 99 ) Moladharaika nilaya -
She who exists in Mooladhara In Mooladhara which is in the form of four petalled lotus the kundalini sleeps.
🌻 100 ) Brhama Grandhi Vibhedini -
She who breaks the tie in Brahma grandhi i.e she who helps us to cross the ties due to our birth.
🌻 101 ) Mani poorantharudhitha -
She who exists in Mani pooraka chakra full dressed in her fineries
🌻 102 ) Vishnu grandhi vibedhini -
She who breaks the ties of Vishnu grandhi i.e she who helps us cross the ties due to our position.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasra Namavali - 38 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహ రాశి- మఖ నక్షత్ర 2వ పాద శ్లోకం*
*🍀 38. పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్।*
*మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || 🍀*
🍀 346) పద్మనాభ: -
పద్మము నాభియందుండువాడు.
🍀 347) అరవిందాక్ష: -
కమలరేకులవంటి కన్నులు గలవాడు.
🍀 348) పద్మగర్భ: -
పద్మగర్భమున నివసించువాడు.
🍀 349) శరీరభృత్ -
ప్రాణుల శరీరములను పోషించువాడు.
🍀 350) మహర్థి: -
మహావిభూతులు కలవాడు.
🍀 351) బుద్ధ: -
ప్రపంచాకారముతో భాసించువాడు.
🍀 352) వృద్ధాత్మా -
సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
🍀 353) మహాక్ష: -
గొప్ప నేత్రములు గలవాడు.
🍀 354) గరుడధ్వజ: -
తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 38 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Makha 2nd Padam*
*🌻 38. padma nābhō ravindākṣaḥ padmagarbhaḥ śarīrabhṛt |*
*maharddhir ṛddhō vṛddhātmā mahākṣō garuḍadhvajaḥ || 38 || 🌻*
🌻 346. Padma-nābhaḥ:
One who resides in the Nabhi or the central part of the heart-lotus.
🌻 347. Aravindākṣaḥ:
One whose eyes resemble Aravinda or the Lotus.
🌻 348. Padma-garbhaḥ:
One who is fit to be worshipped in the middle of the heart-lotus.
🌻 349. Śarīra-bhṛt:
One who supports the bodies of beings, strengthening them in the form of Anna (Food) and Prana.
🌻 350. Mahardhi:
One who has enormous Ruddhi or prosperity.
🌻 351. Ṛddhaḥ:
One who is seen as standing in the form of the world.
🌻 352. Vṛddhātmā:
One whose Atma or body is Vruddha or ancient.
🌻 353. Mahākṣaḥ:
One who has got two or many glorious eyes.
🌻 354. Garuḍa-dhvajaḥ:
One who has got Garuda as his flag.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 010 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 10 🌻*
10
*అపర్యాప్తం తదస్మాకం బలం భీష్‌మాభిరక్షితమ్ |*
*పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||*
🌻. తాత్పర్యము :
మన సైన్యబలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్‌మునిచే సంపూర్ణముగా రక్షింప బడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది.
🌻. భాష్యము :
ఇక్కడ దుర్యోధనుడు ఇరుపక్ష సైన్యాల సమర్థతను పోల్చుచున్నాడు. ఒకవైపు సైన్యాలు భీ ష్‌మునిచే రక్షింప బడుచుండగా, మరొకవైపు సైన్యాన్ని భీముడు రక్షించుచున్నాడు. భీష్‌ముని ముందు భీముడు అల్పుడని ధుర్యోధనుని అభిప్రాయము. దుర్యోధనుడికి భీముని పట్ల గల అసూయ వలన భీమున్ని ఎప్పుడూ చిన్నచూపు చూసేవాడు. ఈ లెక్కప్రకారము దుర్యోధనుడు విజయము తమదేనని నిర్ణయానికి వచ్చినాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment