మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి.


🌹. మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


మరొక ముఖ్య విషయం, మీకు మీరు బానిస కానంత వరకు ఎప్పటికీ మీరు మరొకరికి బానిస కాలేరు. బానిసత్వమనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకడు బలవంతుడు కావచ్చు, మరొకడు బలహీనుడు కావచ్చు.

కానీ, ఏ బాంధవ్యంలోనైనా మీరు చెరసాల అధికారి అయితే ఇతరులు ఆ చెరసాలలో బందీ అవుతారు. అలాగే చెరసాల లోపల ఉన్న వారి వైపు నుంచి చూస్తే, వారికి మీరు బందీగా కనిపిస్తారు, మీకు వారు చెరసాల అధికారిగా కనిపిస్తారు. అతి బాధాకరంగా జీవించే మానవాళి దీనస్థితికి ఉన్న అనేక ముఖ్య కారణాలలో ఇది ఒకటి.

బాంధవ్యంతో కూడిన ప్రేమ కన్నా ద్వేషం చాలా బలమైనది. ఎందుకంటే, ఆ స్థితిలోని మీ ప్రేమ కేవలం పైపైన మాత్రమే ఉండే భవిష్యత్తుకు సంబంధించిన విత్తన స్థాయి శక్తి మాత్రమే కానీ, వాస్తవమైనది కాదు. ఎందుకంటే, పూర్తిగా జంతు వారసత్వమైన మీ ద్వేషం చాలా లోతైనది. ఎందుకంటే, అది అనేక జన్మల నుంచి యుగయుగాలుగా, తరతరాలుగా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్న పూర్తిస్థాయికి ఎదిగిన ద్వేషం కాబట్టి.

ఈ మార్పు కేవలం మనిషిలోనే జరుగుతోంది. కాబట్టి, నన్ను ద్వేషించే వారిని నేను అడ్డుకోలేను. అలాగే నన్ను ప్రేమించే వారినీ నేను అడ్డుకోలేను. అందుకే, నేను చెప్పగలిగేది ఒక్కటే. ప్రేమ, ద్వేషం - ఇలా ఏదైనా బాంధవ్యంగా మారిన వెంటనే అది దాని స్వచ్ఛతను కోల్పోతుంది. కాబట్టి, మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి.

అంటే, మీరు ప్రేమలో పడతారని కాదు. మీరు ఎప్పుడూ ప్రేమలోనే ఉంటూ, అన్నింటినీ ప్రేమిస్తూ ఉంటారు. అంతే. అప్పుడు ప్రేమించడం మీ స్వభావమై, అదే మీ ఉనికి ఊపిరిగామారి, ఎప్పుడూ ప్రేమ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి, మీరు ఒంటరిగా ఉన్నా, మీచుట్టూ ప్రేమ శక్తి నిండి ఉంటుంది.

కానీ, పాత భావాల బాంధవ్యాలను వదిలించు కున్నప్పుడు మాత్రమే మీరు ఆ స్థితిలో ఉండగలరు. అప్పుడు మీరు ‘కుర్చీ’లాంటి జీవం లేని దానిని తాకినా, మీ చేతులు దానిపై ప్రేమ కురిపిస్తాయి- ఆ స్థితిలో ‘ఎవరికి, ఏమిటి’ అనేది మీకు ఒక విషయమే కాదు.

ఎందుకంటే, అక్కడ ప్రేమ అనేది ఒక బాంధవ్యంగా ఉండదు. ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించు కుంటూ కలిసి ఉండగలరు. వారు ఎంత ఎక్కువగా ప్రేమించుకుంటే అంతగా వారి మధ్య బాంధవ్యం తగ్గిపోయి స్వేచ్ఛ పెరుగుతుంది. అందువల్ల ఆశించడాలు, శాసించడాలు, దబాయించడాలు తగ్గిపోతాయి. అప్పుడు సహజంగానే వారిమధ్య ఎలాంటి నిరాశలకు చోటుండదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

No comments:

Post a Comment