శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 223 / Sri Lalitha Chaitanya Vijnanam - 223
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 223 / Sri Lalitha Chaitanya Vijnanam - 223 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
🌻 223. 'మహాబుద్ధి'🌻
ఏ బుద్ధి వలన అన్నియూ తెలియుచున్నవో ఆ బుద్ధి మహాబుద్ధి. బుద్ధి వలన సమస్తము అవగాహన అగుచున్నది. మంచి చెడు తెలియుచున్నది. జ్ఞానము కూడ బుద్ధివలననే ఏర్పడుచున్నది. బుద్ధి సహాయముననే జ్ఞాన సముపార్జనము, జయము, విజయము కలుగు చున్నవి. అంతర్లోకములు, బహిర్లోకములు కూడ బుద్ధి సహాయముననే సమన్వయింప బడుచున్నవి. చీమ, దోమ వంటి ప్రాణుల నుండి బ్రహ్మదేవుని వఱకు, బుద్ధి వలననే జీవనము సాగించుచున్నారు.
బుద్ధి లేనిదే సృష్టియే లేదు. ఏమి చేయవలెను? అను ప్రశ్నకు సమాధానము బుద్ధి వలననే తెలియును. ఎట్లు చేయవలెను? అను ప్రశ్నకు కూడ సమాధానము బుద్ధినుండే వచ్చును. అన్ని లోకములను, అందరిని నడిపించుచున్న బుద్ధి మహాబుద్ధి. మహాబుద్ధియే అందరి యందు పాత్రానుసారము నిక్షిప్తము చేయబడి యున్నది.
నదిలో ముంచిన పాత్రలలో నది నీరున్నట్లే జీవుల మెదడులో బుద్ధి ప్రకాశించుచు నుండును. విద్యుత్తు బల్బులో విద్యుత్తువలె బుద్ధి ప్రకాశించు చుండును. పాత్రలోని నది నీరు, బల్బులోని విద్యుత్తు - పాత్రకు, బల్బునకు సంబంధించినవి కావు. బుద్ధి మనయందు పాత్రలో నదినీరు వలె, బల్బులో విద్యుత్తువలె, నిక్షిప్తము చేయబడి యున్నది. అదియే శ్రీదేవి సాన్నిధ్యము.
ఆమె సాన్నిధ్యమును మనలో పెంచుకొనుటకే గాయత్రీ మంత్రము. ఆమె మహా బుద్ధి. జీవుల యందు బుద్ధిగ, ఎఱుకగ, తెలివిగ ప్రకాశించుచుండును.
బుద్ధి వలన సమస్తము తెలియుచున్నది గాని బుద్ధి నందించిన బుద్ధిని తెలియలేము. బుద్ధి నందించిన బుద్ధి మహాబుద్ధి. దానివైపు బుద్ధిని మరల్చినచో తెలుసుకొనదగిన దేమియూ మిగులదు. అట్టి మహాబుద్ధియైన శ్రీదేవిని ఆరాధించువారు బుద్ధిమంతులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 223 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-buddhiḥ महा-बुद्धिः (223) 🌻
She is intelligence personified. Intelligence is another quality of the Brahman. Intelligence can be explained as knowing That which explains everything else.
Chāndogya Upaniṣad (VI.1.3) says, “That teaching by which what is never heard of becomes heard, what is never thought of becomes thought, what is never known becomes known.” Such intelligence can be given only by Her and that is why She is called as mahā-buddhiḥ.
{Further reading on buddhi: Buddhi is a product of mind. In the process of evolution, antaḥkaraṇa originates first.
Antaḥkaraṇa works internally as against other tattva-s that work externally through senses. Antaḥkaraṇa consists of mind and its modifications. They are cittā (the individual conscience), buddhi (intellect), manas (mind) and ahaṁkār (ego). Chitta is the blemished reflection of pure consciousness.
The other three, buddhi, manas and ahaṁkār are highly subtle in nature. Buddhi is also known as mahat. Mahat literally means great. It is the source of mind and ego. It is the cause of phenomenal universe. It not only helps in comprehending the material world, but also helps in establishing commune with the Brahman.
Without intellect, Brahman can never be realised. Śvetāśvatara Upaniṣad (VI.5) says, “It is the ignorance that leads to being born again and again.” Ignorance can be conquered only by intellect.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment