దేవాపి మహర్షి బోధనలు - 46


🌹. దేవాపి మహర్షి బోధనలు - 46 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 31. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻


నా గురుదేవులు నన్ను ప్రభావితము చేయుచూ యిట్టి వాక్యములు పలికి అదృశ్యులైరి. నా జీవిత సమస్యలను నాకే వదలివైచిరి గాని, వాటి గూర్చి ఒక్క మాటయిననూ పలుకలేదు.

పరిష్కారము తెలుపలేదు. ఏమి చేయవలెనో సలహా కూడా నీయలేదు. నిజమునకు, పరమగురువు లెవరూ తమ అనుయాయులకు అనుక్షణం ఏమి చేయవలెను? ఎచ్చటికి పోవలెను? ఎట్లు పలుక వలెను? అను విషయములు గూర్చి ముచ్చటించరు. అట్టి విషయములను అనుయాయుల విచక్షణకు, బుద్ధికి వదలివైతురు. మన వ్యక్తిగత జీవితము నందలి వివరములతో వారు సంబంధము పెట్టుకొనరు.

భౌగోళికముగా కార్యములను నిర్వర్తించుచూ, జాతి పరిణామమునకు నిరంతరంగా, నిర్విరామముగా కృషిచేయు పరమగురువుల నుండి యిట్టి సలహా సంప్రదింపులకై అనుయాయులు ఎదురుచూచుట న్యాయ సమ్మతము కాదు.

మన కుటుంబ పోషణము, వ్యక్తిగత, సాంఘిక, ఆర్థిక, అభివృద్ధి విచక్షణతో మనమే నిర్వర్తించు కొనుచూ, పరహితము, లోకహితమూ మిళితమైయున్న కార్యములకై త్రికరణశుద్ధితో పనిచేయు సైనికులవంటివారు, వారికి కావలెను కాని, గోరుముద్దలకై ఎదురుచూచు పసివారు కాదు.

అనుయాయులను మెచ్చుకొనుట, తీయని మాటలు చెప్పుటకు పరమగురువులు తమ అమూల్యమైన సమయమును వెచ్చింపరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

No comments:

Post a Comment