గీతోపనిషత్తు -167


🌹. గీతోపనిషత్తు -167 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 11

🍀 11. స్థిరాసనము -1 - 1. ధ్యానము చేయు ప్రదేశము శుచిగ నుండవలెను. ప్రతి నిత్యము ఆ ప్రదేశమును నీటితో శుభ్రపరచు కొనవలెను. శుచిత్వ మేర్పడుటకు చందనపు అగరువత్తులను కూడ నేర్పరచుకొన వచ్చును. 2. శుచియగు ప్రదేశమున, మరీ ఎత్తు కాని చెక్కపీట నొక దానిని అమర్చుకొనవలెను. దానిపై దర్భాసనము వేసుకొన్నచో మరింత శ్రేష్ఠము. లోహము, రాయికన్న చెక్కపీట శ్రేష్ఠము. దాని పైన పరచిన దర్భాసనము ఆసనమునకు మరికొంత సాత్వికతను ఆపాదించును. దానిపై ఒక పలుచని తెల్లని నూలు వస్త్రము వేసుకొనినచో మరికొంత సాత్వికత లభించును. 🍀

శుచౌ దేశ ప్రతిష్టాప్య స్థిరమాసన మాత్మనః |
నాత్యుచ్ఛిత్రం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్ II 11

పరిశుద్ధమైన ప్రదేశ మందు మిక్కిలి ఎత్తుగా గాని, లోతుగా గాని లేని సమతల ప్రదేశమందు ఒక దర్భాసనము పరిచి, దానిపై ఒక జింక చర్మమును పరిచి, దాని పైన వస్త్రమును పరిచి స్థిరమగు

ఆసనమున ఆత్మసంయమమునకై కూర్చుండవలెను. ధ్యానమున కుపక్రమించు యోగసాధకుడు తప్పక పాటింప వలసిన నియమము లివి.

1. ధ్యానము చేయు ప్రదేశము శుచిగ నుండవలెను. ప్రతి నిత్యము ఆ ప్రదేశమును నీటితో శుభ్రపరచు కొనవలెను. శుచిత్వ మేర్పడుటకు చందనపు అగరువత్తులను కూడ నేర్పరచుకొన వచ్చును.

2. శుచియగు ప్రదేశమున, మరీ ఎత్తు కాని చెక్కపీట నొక దానిని అమర్చుకొనవలెను. దానిపై దర్భాసనము వేసుకొన్నచో మరింత శ్రేష్ఠము. లోహము, రాయికన్న చెక్కపీట శ్రేష్ఠము. దాని పైన పరచిన దర్భాసనము ఆసనమునకు మరికొంత సాత్వికతను ఆపాదించును. దానిపై ఒక పలుచని తెల్లని నూలు వస్త్రము వేసుకొనినచో మరికొంత సాత్వికత లభించును. శ్లోకమందు దర్భాసనము పై జింక చర్మమును వేసుకొనుట కూడ తెలిపినారు.

వంశానుక్రమముగ జింక చర్మమున్నచో ఆసనముగ వాడుకొన వచ్చును. లేనిచో జింక చర్మమును పొందుటకు చేయు ప్రయత్నము ప్రస్తుత కాలమున నేరమగును. పీట పై దర్భ చాప, దానిపై తెల్లని వస్త్రము శుచియైన ప్రదేశమున ఏర్పరచుకొన్నచో చాలును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

No comments:

Post a Comment