శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 231 / Sri Lalitha Chaitanya Vijnanam - 231
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 231 / Sri Lalitha Chaitanya Vijnanam - 231 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀
🌻 231. 'మహాభైరవ పూజితా'' 🌻
భైరవుడనగా శివుడు. మహా భైరవునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మహాశివుడు మహాదేవిని పూజించునట. అట్లే మహాదేవి మహాశివుని పూజించునట. శివశక్తుల సమభావము ఇందు దర్శన మీయబడినది. శివుడు లేని శక్తి లేదు; శక్తి లేని శివుడు లేడు. పరమున కూడ వారియే యుందురు.
పరతత్త్వమున శివతత్త్వ మెంతున్నదో, శక్తి తత్త్వము కూడ నంతయే యుండును. అందువలన శివుడు పరుడు. శ్రీమాత పరదేవత. ఈ రెంటినీ సరిసమానముగ దర్శించుట సమదర్శనము. ఎక్కువ తక్కువలు జీవుల మనస్సు యందున్నవి తప్ప, వారిరువురిలో లేవు. శ్రీమాత శ్రీదేవుని ఆరాధించిన సందర్భము లున్నవి. శ్రీదేవుడు శ్రీమాతని ఆరాధించిన సందర్భములు కూడ నున్నవి.
భైరవ శబ్దమునందలి మూడక్షరములు సృష్టి, రక్షణ, లయము ఇమిడి యున్నవి. 'భ' అనగా సృష్టి, 'ర' అనగా రక్షణ, రమణ, 'వ' అనగా వమనము లేక వినాశము. సృష్టి, స్థితి, లయములకు కారణము లైన దైవమే భైరవుడు. అతడు కాలము ననుసరించి మూడు విధములుగ వర్తించుటచే కాలభైరవుడని కూడ పిలువబడుచున్నాడు. అట్టి భైరవుడు మహాదేవుడు. అతనిచే పూజింపబడునది శ్రీదేవి.
ఆది దంపతులు ఒకరినొకరు మన్నించుట, గౌరవించుట సరిసమానముగ భావించుట తెలియవలసిన విషయము. అట్లే పురుషులలో ఒకరిపై నొకరు ఆధిపత్యము చూపక సమవర్తనము చూపుట ఉత్తమోత్తమ సంస్కారము. స్త్రీలపై ఆధిక్యము చూపు పురుషులు శ్రీదేవి అనుగ్రహమును పొందలేరు.
అట్లే పురుషులపై ఆధిక్యము కోరు స్త్రీలు మహాదేవుని అనుగ్రహమును పొందలేరు. శివశక్తులలో ఒకరు అనుగ్రహింపనిచో మరియొకరు అనుగ్రహింపరు. కావున సమదర్శనము, సమభావనమే అనుగ్రహమునకు ప్రధానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 231 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-bhairava-pūjitā महा-भैरव-पूजिता (231) 🌻
She is worshipped by the great Bhairava. Bhairava means, the highest reality. The word Bhairava is made up of three syllables - bha + ra + va. Bha means bharana, the act of sustenance; ra means ravana, the act of withdrawal or dissolution and va means varana, the act of creation.
These three are the acts of the Brahman. Bhairava form of Śiva is considered as the Supreme form as it is the combination of His prakāśa and vimarśa forms (prakāśa is Self-illuminating and vimarśa manifests the entire universe with that Light).
In other words, the Bhairava form is the united form of Śiva and Śaktī or Bhairava and Bhairavī. The entire cosmic manifestation of subjects and objects arise only from the union of Bhairava and Bhairavī, also known as Śiva-Śaktī aikya (aikya means union - nāma 999).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment