8-MARCH-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 167🌹  
11) 🌹. శివ మహా పురాణము - 367🌹 
12) 🌹 Light On The Path - 116🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 249🌹 
14) 🌹 Seeds Of Consciousness - 314🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 189🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 44 / Lalitha Sahasra Namavali - 44🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 44 / Sri Vishnu Sahasranama - 44🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 016 - 18 🌹*
AUDIO - VIDEO 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -167 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 11

*🍀 11. స్థిరాసనము -1 - 1. ధ్యానము చేయు ప్రదేశము శుచిగ నుండవలెను. ప్రతి నిత్యము ఆ ప్రదేశమును నీటితో శుభ్రపరచు కొనవలెను. శుచిత్వ మేర్పడుటకు చందనపు అగరువత్తులను కూడ నేర్పరచుకొన వచ్చును. 2. శుచియగు ప్రదేశమున, మరీ ఎత్తు కాని చెక్కపీట నొక దానిని అమర్చుకొనవలెను. దానిపై దర్భాసనము వేసుకొన్నచో మరింత శ్రేష్ఠము. లోహము, రాయికన్న చెక్కపీట శ్రేష్ఠము. దాని పైన పరచిన దర్భాసనము ఆసనమునకు మరికొంత సాత్వికతను ఆపాదించును. దానిపై ఒక పలుచని తెల్లని నూలు వస్త్రము వేసుకొనినచో మరికొంత సాత్వికత లభించును. 🍀*

శుచౌ దేశ ప్రతిష్టాప్య స్థిరమాసన మాత్మనః |
నాత్యుచ్ఛిత్రం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్ II 11

పరిశుద్ధమైన ప్రదేశ మందు మిక్కిలి ఎత్తుగా గాని, లోతుగా గాని లేని సమతల ప్రదేశమందు ఒక దర్భాసనము పరిచి, దానిపై ఒక జింక చర్మమును పరిచి, దాని పైన వస్త్రమును పరిచి స్థిరమగు
ఆసనమున ఆత్మసంయమమునకై కూర్చుండవలెను. ధ్యానమున కుపక్రమించు యోగసాధకుడు తప్పక పాటింప వలసిన నియమము లివి.

1. ధ్యానము చేయు ప్రదేశము శుచిగ నుండవలెను. ప్రతి నిత్యము ఆ ప్రదేశమును నీటితో శుభ్రపరచు కొనవలెను. శుచిత్వ మేర్పడుటకు చందనపు అగరువత్తులను కూడ నేర్పరచుకొన వచ్చును. 

2. శుచియగు ప్రదేశమున, మరీ ఎత్తు కాని చెక్కపీట నొక దానిని అమర్చుకొనవలెను. దానిపై దర్భాసనము వేసుకొన్నచో మరింత శ్రేష్ఠము. లోహము, రాయికన్న చెక్కపీట శ్రేష్ఠము. దాని పైన పరచిన దర్భాసనము ఆసనమునకు మరికొంత సాత్వికతను ఆపాదించును. దానిపై ఒక పలుచని తెల్లని నూలు వస్త్రము వేసుకొనినచో మరికొంత సాత్వికత లభించును. శ్లోకమందు దర్భాసనము పై జింక చర్మమును వేసుకొనుట కూడ తెలిపినారు. 

వంశానుక్రమముగ జింక చర్మమున్నచో ఆసనముగ వాడుకొన వచ్చును. లేనిచో జింక చర్మమును పొందుటకు చేయు ప్రయత్నము ప్రస్తుత కాలమున నేరమగును. పీట పై దర్భ చాప, దానిపై తెల్లని వస్త్రము శుచియైన ప్రదేశమున ఏర్పరచుకొన్నచో చాలును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 367🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
96. అధ్యాయము - 08

*🌻. నారద హిమాలయ సంవాదము - 2 🌻*

కాన నీవు వివేకము గలవాడవై నీ కుమార్తె యగు శివాదేవిని శివునకు ఇచ్చి వివాహమును చేయుము. సర్వేశ్వరుడు, వికార రహితుడు, అవినాశి యగు శివప్రభుడు సేవించదగినవాడు (21). అ శివుడు తొందరగా ప్రసన్నుడగును. ఆయన ఈమెను తప్పక స్వీకరించగలడు. ఈ శివాదేవి తపస్సును చేసినచో, ఆయన విశేషించి అట్టి తపస్సుచే పొందదగిన వాడు అగును (22). ఆ శివుడు సర్వవిధములా అత్యంత సమర్థుడు, సర్వేశ్వరుడు, చెడు రాతను గూడ తుడచి పెట్టగలవాడు, బ్రహ్మ అధీనమునందు గలవాడు, మరియు ఆనందము నిచ్చువాడు (23).

బ్రహ్మ ఇట్లు పలికెను -

హే వత్సా !మహర్షీ !ఉత్కంఠను కలిగించువాడు, బ్రహ్మవేత్త అగు నీవు ఇట్లు పలికి, ఆ పర్వత రాజును శుభవచనములతో ఆనందింపజేయుచూ, మరల నిట్లంటివి (24).ఈమె శంభునకు పత్నియై, ఆయనకు సర్వదా అనుకూలవతియై, మహాపతివ్రతయై, గొప్ప నిష్ఠగలదియై తల్లిదండ్రుల సుఖమును వృద్ధిచేయగలదు (25). 

ఈ తపస్విని శంభుని చిత్తమును తన వశము చేసుకొనగలదు. ఆయన కూడా ఈమెను తక్క మరియొక స్త్రీని వివాహమాడడు (26). వీరిద్దరు ప్రేమతో తుల్యమగు ప్రేమ ఏ ఇద్దరి మధ్యనైననూ భూతకాలములో లేదు ; వర్తమానకాలములో లేదు; భవిష్యత్తులో ఉండబోదు (27).

వీరిద్దరు చేయ దగిన దేవకార్యములు గలవు. ఓ పర్వత రాజా! వీరు మృతులనెందరినో జీపింప చేయవలసి యున్నది (28). ఓ పర్వతరాజా! శివుడు ఈ కన్యకు తన శరీరములోని అర్థభాగము నిచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. మరియు వీరిద్దరి కలయిక మరల సర్వత్ర ఆనందమును కలిగించును (29). 

ఈ నీ కుమార్తె శివుని శరీరము యొక్క అర్థ భాగమును తన అధీనము చేసుకొనగలదు. ఈమె తన తపశ్శక్తిచే సకలేశ్వరుడగు మహేశ్వరుని సంతోష పెట్ట గలదు (30). తపస్సుచే ఆ శివుని సంతోష పెట్టి ఈ నీ కుమార్తె బంగారము వలె, మెరుపు తీగవలె పచ్చని కాంతులతో శోభిల్ల గలదు (31). ఈ కన్య గౌరి యను పేరుతో ఖ్యాతిని గాంచగలదు. ఈమెను విష్ణువు, బ్రహ్మ మొదలగు వారితో గూడి దేవతా గణములన్నియూ పూజించగలరు (32).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారద! దేవర్షీ! ఈ నీ మాటను విని, వాక్కులో నైపుణ్యముగల ఆ హిమవంతుడు నీతో నిట్లనెను (34).

హిమవంతుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! నారదా! నీవు ప్రజ్ఞా శాలివి. నేనొక విన్నపమును చేసెదను. దానిని నీవు ప్రీతితో విని, ఆపైన నాకు ఆనందమును కలుగు జేయుము (35). ఆ మహాదేవుడు సర్వ సంగపరిత్యాగి అనియు, ఆత్మ నిగ్రహము గలవాడనియు, నిత్యము తపస్సు చేయుచుండుననియు, దేవతలకు కూడా కానరాడనియు విని యుంటిని (36). ఓ దేవర్షీ! పరబ్రహ్మ యందు అర్పితమైన మనస్సు గల ఆ శివుడు ధ్యాన మార్గము నుండి చ్యుతుడగుట యెట్లు? ఈ విషయములో నాకు పెద్ద సంశయము గలదు (37). 

వినాశము లేనిది, హృదయములో దీపశిఖవలె ప్రకాశించునది, సదాశివ నామధేయమము గలది, వికారములు లేనిది, పుట్టుక మరణము లేనది, నిర్గుణము గుణములకు అధిష్టానము, విశేషరహితము కామనాసంబంధము లేనిది అగు పరబ్రహ్మను ఆయన స్వస్వరూపముగా దర్శించును. ఆయన సర్వత్ర బ్రహ్మమునే దర్శించును గాన, ఆయనకు బాహ్య దృష్టి లేదు (38,39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 116 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 9 🌻*

442. It is not difficult to understand how the vehicles are for their “own use”. As we advance we rise above the bondage of each vehicle manifesting outwardly, and learn to use it only for the higher work, without any consideration of self. Doing this as far’ as the physical body is concerned should be the disciple’s daily practice. 

The physical body must be mastered so that it cannot throw its own reflection upon you; it exists only for you to use, and you must learn to control it completely, so that it cannot compel you to attend to any experience that you do not want. 

It should be only an instrument for use; you are training it to hand on its experience to the ego. There will come a time when you no longer want to hand on any experience at all; then the “I” takes what it wants for its own purpose. This is a high condition to reach, for it is the stage of the Adept.

443. In The Secret Doctrine it is said that a Master’s body is illusory. That means only that the physical body cannot affect or disturb Him. The forces playing around cannot influence Him through it, except in so far as He allows them; they cannot throw Him off His centre. 

H.P.B. has also said that a Master’s physical body is a mere vehicle. It hands nothing on, but is simply a point of contact with the physical plane, a body kept as an instrument needed for the work He does, and dropped when done with. 

The same thing is true of the astral and mental bodies. When the causal body becomes an instrument only, the individuality perishes, atma having acquired the power of manifesting its third aspect on the mental plane at will, and no longer needing a permanent vehicle thereon.

444. C.W.L. – This statement seems at first sight to contradict some of the earlier ones. For example, we were told to kill out desire – to kill out various parts of ourselves. It is said in The Voice of the Silence that the pupil must learn to slay the lunar form1 (1 Ante., Vol. I, Part I, Ch. 2: Initiation and the approach thereto. Vol. II, p, 128.) at will – to get rid of his astral body. The words “at will” give us the key to the expression. 

We must not destroy the astral body, because if we did so we should become monsters, with great mental development but without any sympathy. Many people find emotion a great trouble to them because it overwhelms them, but they must try not to destroy it, but to purify and control it. It must be a force which we can use and not something which overwhelms us. 

We must not kill it out, because without it we could never understand emotion in others, and we could therefore never help people who are along that line; but it must be refined and all self must be weeded out from it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జడమహర్షి - 2 🌻*

7. అయితే, ఆ జీవుడు ఇతరులకు అన్నోదకములు భక్తితో పెట్టిన వాడయితే ఎటువంటి మరణవేదనా అనుభవించడు. తెలివిగా శరీరంలో ఉండగానే, జ్ఞానమార్గాన్ని, పుణ్యమార్గాన్ని అవలంబించినవాడయితే; అసూయారహితుడు, ధర్మం తప్పనివాడు, అధర్మంలో ఉన్నటువంటి కామాది వికారములు లేనివాడు, క్రోధం లేకుండా జీవించిన వాడు అయితే; 

8. మాత్సర్య రహితుడైతే, మరణవేదన అనుభవించకుండానే పోతాడు. సుఖమయిన మృతిని పొందుతాడు. అన్నదానం చేయనివాడు, కూటసాక్షి, వేదదూషకుడు మొదలైన వాళ్ళకు భయంకరమైన యమకింకరులు దర్శనమిస్తారు. దాంతో విపరీతమయిన భయం కలుగుతుంది. 

9. తనకు భయమేస్తోంది అని చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జిహ్వ వెనక్కు వెళ్ళిపోతుంది. మాటరాదు. చూస్తూఉంటాడుకాని మాట్లాడలేడు. అటువంటి స్థితిలో వెళ్ళిపోతాడు. జీవులిలా యాతనాశరీరాలను పొంది చాలా బాధలు పడతారు అని ఇవన్నీ చెప్పి మరణవేదననూ వర్ణించాడు.

10. “మృత్యువుయొక్క స్థితి అల్ల ఉంటుంది. మృత్యువును గురించి ఎందుకు చెపుతున్నానంటే, జన్మ అంటే భయపడాల్సిన కారణాలున్నాయి. చనిపోయిన తరువాత, చావు అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకుని కూడా ప్రయోజనంలేదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా తనకు పనికిరాదు. మళ్ళీ జన్మించేటప్పటికి ఈ మృత్యువేదన అనే కష్టాన్ని గురించి మరిచిపోతాడు. 

11. ఇక వాడికేమి జ్ఞాపకం ఉంటుంది? వాడికి బోధ ఎలా కలుగుతుంది? మృత్యువాత పడ్డప్పుడు, ‘అయిపోయింది! ఇంకేప్పుడూ ఈ జన్మకు రాను, ఇక నాకు పునర్జన్మ వద్దు!’ అని అప్పుడు అనిపిస్తుంది. కాని అది స్మృతిపథంలోంచి మరుగైపోతుంది. మళ్ళీ జన్మించేటప్పటికి చావుని గురించి ఎరుగని వాడివలెనే ఉంటాడు” అని చెప్పాడు జడమహర్షి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 314 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 163. Become initiated into the understanding of what I am expounding to you; I am talking about the seed of 'Brahman' or 'I am' that I am planting in you.. 🌻*

When the Guru is faced by a sincere seeker he is very keen on imparting his knowledge to him, and this itself is the initiation. His teaching is very simple. He awakens you to the long lost 'I am' or the 'Brahman', he calls it the planting of the 'Brahma seed' in you. 

It is just like on seeing or coming across something desirable - you want it desperately, the seeds of its acquisition are sown. Because once the 'Brahma seed' is sown in you, appropriate conditions prevailing, you will go to any lengths to bring it to fruition.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 189 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 3 🌻*

ఆధ్యాత్మిక అధికారపీఠము
ప్రతి అవతార యుగ కాలప్రమాణము 700సం|| నుండి 1400సం||తో అంత్యమగును.

709. ప్రతి అవతార యుగములో పదునొకండు కాలములుండును.

710. ఒక్కొక్క కాలప్రమాణము 65సం|| నుండి 125 సం|| లతో అంత్యమగును.

711. ప్రతి కాలమందును 5 గురు సద్గురువులుందురు.

712. ప్రతి అవతార యుగాంత్యమందును పదునొకండవ కాలములో అవతార పురుషుడుండును.

713. ఐదుగురు సద్గురువులు + ఒక అవతార పురుషుడే గాక ప్రతియుగమందును 56 బ్రహ్మీభూతులుందురు. వీరు సృష్టిలీలయిందు కర్తవ్యము లేనివారైయుందురు.

భూతులుందురు వీరిలో 8 గురు ప్రజా బాహుళ్యమునకు తెలిసియుందురు. ఆధ్యాత్మిక అధికారపీఠములో కార్యనిర్వాహక సభ్యులై కార్యాధ్యక్షులై పనిచేయుచుందురు ఆదివార పీఠము 7000 మంది సభ్యులతో కూడియుండును. వీరు వారివారి ఆధ్యాత్మిక సత్తాను, స్థాయిని అనుసరించి భూమికలలో వారికి నియోగింపబడిన ఉద్యోగ ధర్మములను నిర్వహించుచుందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 44 / Sri Lalita Sahasranamavali - Meaning - 44 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 44. నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా ।
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥ 🍀*

🍀 134. నిర్లేపా - 
కర్మ బంధములు అంటనిది.

🍀 135. నిర్మలా - 
ఏ విధమైన మలినము లేనిది.

🍀 136. నిత్యా - 
నిత్య సత్య స్వరూపిణి.

🍀 137. నిరాకారా - 
ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.

🍀 138. నిరాకులా - 
భావ వికారములు లేనిది.

🍀 139. నిర్గుణా - 
గుణములు అంటనిది.

🍀 140. నిష్కలా - 
విభాగములు లేనిది.

🍀 141. శాంతా - 
ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.

142. నిష్కామా - 
కామము, అనగా ఏ కోరికలు లేనిది.

🍀 143. నిరుపప్లవా - 
హద్దులు ఉల్లంఘించుట లేనిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 44 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 44. nirlepā nirmalā nityā nirākārā nirākulā |*
*nirguṇā niṣkalā śāntā niṣkāmā nirupaplavā || 44 || 🌻*

🌻 134 ) Nirlepa -   
She who does not have any attachment

🌻 135 ) Nirmala -  
 She who is personification of clarity or She who is devoid of any dirt

🌻 136 ) Nithya - 
  She who is permanently stable

🌻 137 ) Nirakara -   
She who does not have any shape

🌻 138 ) Nirakula -  
 She who cannot be attained by confused people

🌻 139 ) Nirguna -   
She who is beyond any characteristics

🌻 141 ) Santha -   
She who is peace

🌻 140 ) Nishkala -   
She who is not divided

🌻 142 ) Nishkama -   
She who does not have any desires

🌻 143 ) Niruppallava -  
 She who is never destroyed

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 44 / Sri Vishnu Sahasra Namavali - 44 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- పుబ్బ నక్షత్ర 4వ పాద శ్లోకం*

*🍀 44. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృధుః।*
*హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః॥ 🍀*

🍀 405) వైకుంఠ: - 
సృష్ట్యారంభమున పంచమహా భూతములను సమ్మేళనము చేసినవాడు.

🍀 406) పురుష: - 
ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.

🍀 407) ప్రాణ: - 
ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.

🍀 408) ప్రాణద: - 
ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.

🍀 409) ప్రణవ: - 
ఓంకార స్వరూపుడు.

410) పృథు: - 
ప్రపంచరూపమున విస్తరించినవాడు.

411) హిరణ్యగర్భ: - 
బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.

412) శత్రుఘ్న: - 
శత్రువులను సంహరించువాడు.

413) వ్యాప్త: - 
సర్వత్ర వ్యాపించియున్నవాడు.

414) వాయు: - 
వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.

415) అథోక్షజ: - 
స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 44 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Pubba 4th Padam*

*🌻 44. vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pṛthuḥ |*
*hiraṇyagarbhaḥ śatrughnō vyāptō vāyuradhōkṣajaḥ || 44 || 🌻*

🌻 405. Vaikuṇṭhaḥ: 
The bringing together of the diversified categories is Vikuntha. He who is the agent of it is Vaikunthah.

🌻 406. Puruṣaḥ: 
One who existed before everything.

🌻 407. Prāṇaḥ: 
One who lives as Kshetrajana (knower in the body) or one who functions in the form of vital force called Prana.

🌻 408. Prāṇadaḥ: 
One who is the giver of life.

🌻 409. Praṇavaḥ: 
One who is praised or to whom prostration is made with Om.

🌻 410. Pṛthuḥ: 
One who has expanded himself as the world.

🌻 411. Hiraṇyagarbhaḥ: 
He who was the cause of the golden-coloured egg out of which Brahma was born.

🌻 412. Śatrughnaḥ: 
One who destroys the enemies of the Devas.

🌻 413. Vyāptaḥ: 
One who as the cause pervades all effects.

🌻 414. Vāyuḥ: 
One who moves towards His devotees.

🌻 415. Adhokṣajaḥ: 
He is Adhokshaja because he undergoes no degeneration from His original nature.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 016, 017, 018 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 16, 17, 18 🌻*

16
అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిర: |
నకుల: సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ ||

17
కాశ్యశ్చ పరమేష్వాస:
శిఖండీ చ మహారథ: |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చాపరాజిత: ||

18
ద్రుపదే ద్రౌపదేయాశ్చ
సర్వశ: పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహు:
శంఖాన్‌ దధ్ము: పృథక్‌ పృథక్‌ ||

16-18 తాత్పర్యము : 
ఓ రాజా ! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంత విజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదితనయుడు, గొప్ప బాహువులు గలిగిన సుభద్రాతనయుడు మున్నగు వీరులందరూ తమతమ శంఖములను పూరించిరి.

భాష్యము : 
సంజయుడు ధృతరాష్ట్రుని పధకాల వలన ఘోరవిపత్తు సంభవించనున్నదని సూచన చేయుచున్నాడు. పాండవులను తప్పించి తన పుత్రులకు పట్టం కట్టాలని అనేక పధకాలు వేసి చివరకు ధృతరాష్ట్డుడు ఈ యుద్ధానికి కారకుడయ్యెను. ఇప్పటికే కనిపించుచున్న సంకేతాల ప్రకారము అక్కడ భీష్‌మ పితామహుడితో మొదలుగా అభిమన్యుడి వరకూ ఇతర రాజులతో సహా అందరూ మరణించనున్నారని, తన పుత్రుల పధ కాలను ఆమోదించినందుకు ఈ వినాశనానికి ధృతరాష్ట్రుడే బాధ్యత వహించాలని సూచన ప్రాయంగా తెలియజేయటమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment